హోమ్ /వార్తలు /సినిమా /

Acharya : ఆచార్య ఫస్ట్ డే ఎంత రాబట్టే అవకాశం ఉంది.. బుకింగ్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Acharya : ఆచార్య ఫస్ట్ డే ఎంత రాబట్టే అవకాశం ఉంది.. బుకింగ్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..

‘ఆచార్య’ మూవీ ఫస్ట్ డే ఎంత రాబట్టే అవకాశం ఉందంటే.. (Twitter/Photo)

‘ఆచార్య’ మూవీ ఫస్ట్ డే ఎంత రాబట్టే అవకాశం ఉందంటే.. (Twitter/Photo)

Chiranjeevi - Ram Charan - Acharya |   మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi ), రామ్ చరణ్‌ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’ (Acharya ). ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు ఎంత రాబట్టే అవకాశం ఉందో చూడాలి.

ఇంకా చదవండి ...

  Chiranjeevi - Ram Charan - Acharya|   మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi ), రామ్ చరణ్‌ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’ (Acharya ). కొరటాల శివ దర్శకత్వం వహించారు. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా విడుదలవుతోంది. ఇప్పటికే  ఆచార్య టీమ్ ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. ఇక ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో చిరంజీవి‌తో పాటు రామ్ చరణ్ కూడా కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ (Ram Charan)  సిద్దు పాత్ర దాదాపు గంట పాటు ఉండనుందట.

  ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదలవుతోంది. 132.50 కోట్ల టార్గెట్‌తో ఆచార్య బరిలో దిగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ 4 రోజుల ముందే మొదలైంది. పైగా తెలంగాణలో ఐదో ఆటతో పాటు వారం రోజుల పాటు ఈ సినిమాకు రూ. 50 పెంచుకునే వెసులుబాటు ఇచ్చింది. ఇక ఏపీలో 10 రోజుల పాటు 50 రూపాయలు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ సినిమా ఫస్ట్ డే బుకింగ్స్ మెగా ఎక్స్‌పెక్టేషన్స్‌కు తగ్గట్టు లేదనే టాక్ ప్రీ బుకింగ్స్ చూస్తే తెలుస్తోంది. బాక్సాఫీస్ దగ్గర తండ్రీ తనయులు రచ్చ మాత్రం అనుకున్నంత రేంజ్‌లో లేదు. హైదరాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ రపంలో రూ. 4.5 కోట్ల రేంజ్‌లో ఉంది. అటు రాయలసీమ, ఆంధ్రాలో బుకింగ్స్ కూడా తక్కువే ఉన్నాయి. టిక్కెట్స్ రేట్స్ హైక్‌గా ఉండటం.. ఇప్పటికే ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాల హైప్‌తో పోలిస్తే తక్కువగా ఉంది.

  Longest Run Movies in Tollywood: 365 నుంచి 1000 రోజుల వరకు.. థియేటర్స్‌లో ఎక్కవ రోజులు ఆడిన టాప్ తెలుగు సినిమాలు..


  ఆన్‌లైన్‌లో కన్నా ఆఫ్‌లైన్‌లో సినిమా థియేటర్ బుకింగ్స్ దగ్గర టికెట్ సేల్ అయ్యే అవకాశాలున్నాయి. మొత్తంగా అన్ని పరిగణలోకి చూసుకుంటే.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 2ం నుంచి 25 కోట్ల మధ్య షేర్ వచ్చే అవకాశాలున్నాయి. ఓవర్సీస్ అన్ని కలిపితే.. రూ. 30 కోట్లు దాటే అవకాశాలైతే ఫుష్కలంగా ఉన్నాయి. మొత్తంగా మొదటి రోజు ‘ఆచార్య’ ఎంత రాబడుతోందో చూడాలి.

  RRR - KGF 2 - Bahubali 2 : ఆర్ఆర్ఆర్,కేజీఎఫ్ 2, బాహుబలి 2 సహా బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 చిత్రాలు..


  ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా సోనూ సూద్ నటించారు. మొత్తంగా ఈ  ట్రైలర్ ను ఆధ్యాత్మికంకు నక్సలిజాన్ని మిక్స్ చేసి కొరటాల శివ సరికొత్తగా ఆచార్య సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. కొరటాల శివ ఆచార్య సినిమాను తనదైన సోషల్ మెసెజ్‌తో తెరకెక్కించినట్టు కనబడుతోంది. ఇక  ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయినట్టు సమాచారం.ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon prime) భారీ రేటుకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ డీల్‌కు సంబంధించిన అన్ని అగ్నిమెంట్స్ కూడా పూర్తైయినట్టు సమాచారం. ‘ఆచార్య’ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత ‘ఆచార్య’ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Acharya, Chiranjeevi, Ram Charan, Tollywood

  ఉత్తమ కథలు