Home /News /movies /

ACHARYA FILM DISTRIBUTOR OPEN LETTER TO MEGASTAR CHIRANJEEVI SB

Acharya: ఆచార్య పోయింది.. చిరంజీవి డబ్బులివ్వల్సిందే.. బహిరంగ లేఖ

ఆచార్య పోస్టర్

ఆచార్య పోస్టర్

ఆచార్య సినిమా ఆశించిన విజయం అందుకోలేకపోయింద. దీంతో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలో చిరంజీవికి ఓ డిస్ట్రిబ్యూటర్ బహిరంగ లేఖ రాశాడు.

    మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ), రామ్ చరణ్‌ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’ (Acharya ). కొరటాల శివ దర్శకత్వం వహించారు. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదలన విషయం తెలిసిందే. అయితే సినిమా ఆశించనంత విజయం అందుకోలేదు. మొదటి నుంచే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో మెగా అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమా ప్లాప్ అయిందంటూ.. తెగ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆచార్య డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి మరోలా ఉంది. మెగాస్టార్ చిరు సినిమా కదా అని.. ఆచార్యను భారీ మొత్తంతో కొన్నవారి పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది.

    ఈ క్రమంలో ఓ డిస్ట్రిబ్యూటర్ చిరంజీవికి రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కళ్యాణ కర్నాటక రీజియన్ రాయచూర్ జిల్లాకు చెందిన రాజగోపాల్ బజాజ్ అనే డిస్ట్రిబ్యూటర్ చిరుకు బహిరంగ లేఖ రాశాడు. తాను ఆచార్య సినిమాను కొనుగోలు చేశానని.. కాని అది ఆశించిన స్థఆయిో థియేటర్లలో ఆడలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను తీవ్రంగా నష్టపోయానని చెప్పుకొచ్చాడు. వరంగల్‌ శ్రీనుకు చెందిన కార్తికేయ ఎగ్జిబిటర్స్‌కు భారీగా ప్రీమియం చెల్లించామన్నాడు. కానీ ఇప్పుడు ఆచార్య సినిమాకు అభిమానుల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. సినిమా కూడా థియేటర్లలో సరిగా ఆడటం లేదు. దీంతో తాను భారీ నష్టాలు చవిచూస్తున్నామన్నాడు.


    ‘కోవిడ్ కారణంగా .. ఇప్పటికే.. ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు చతికిలా పడిన విషయం మీకు బాగా తెలిసిందే.కరోనా కారణంగా చాలా మంది భారీ నష్టాల్లో కూరుకుపోయారు. అందుకే ఇప్పుడు ఆచార్య మూవీ వల్ల నష్టపోయిన డిస్ట్రీబ్యూటర్లకు మీరు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నా.నేను ఈ సినిమా కోసం మార్కెట్ నుంచి డబ్బులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టా. ఇప్పుడు సినిమా ఆడకపోవడంతో తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయా. నా మనవిని మీరు తప్పకుండా మన్నించి సాయం చేస్తే.. నేను భవిష్యత్తులో మీ ప్రాజెక్టుల విషయంలో పనిచేసేందుకు సాయపడుతుంది’ అంటూ డిస్ట్రిబ్యూటర్ రాజగోపాల్ బజాజ్ చిరంజీవికి బహిరంగ లేఖ రాశారు. అయితే ఈ లేఖను ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో షేర్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ పోస్టు వైరల్ అవుతోంది. మరి దీనిపై చిరంజీవి ఎలా స్పందిస్తారో చూడాలి.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Acharya, Acharya movie, Megastar Chiranjeevi, Ram Charan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు