హోమ్ /వార్తలు /సినిమా /

Acharya : చిరంజీవి, రామ్ చరణ్‌ల ‘ఆచార్య’ మూవీ నుంచి మరో బిగ్ అప్డేట్..

Acharya : చిరంజీవి, రామ్ చరణ్‌ల ‘ఆచార్య’ మూవీ నుంచి మరో బిగ్ అప్డేట్..

‘ఆచార్య’ మూవీ నుంచి బిగ్ అప్డేట్ (Twitter/Photo)

‘ఆచార్య’ మూవీ నుంచి బిగ్ అప్డేట్ (Twitter/Photo)

Chiranjeevi - Ram Charan - Acharya Trailer Talk : చిరంజీవి, రామ్ చరణ్ పూర్తి స్థాయిలో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న మూవీ ‘ఆచార్య’. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు.

ఇంకా చదవండి ...

  Chiranjeevi - Ram Charan - Acharya |   మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi ), రామ్ చరణ్‌ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’ (Acharya ). కొరటాల శివ దర్శకత్వం వహించారు. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదలకానుంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్‌గా జరిగింది. విడుదలకు మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో  ఆచార్య టీమ్ ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. ఇక ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో చిరంజీవి‌తో పాటు రామ్ చరణ్ కూడా కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ (Ram Charan)  సిద్దు పాత్ర దాదాపు గంట పాటు ఉండనుందట.

  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేస్తే.. మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమా కోసం రూ. 50 పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. దాంతో పాటు ఐదు షోలకు పర్మిషన్ ఇచ్చింది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ చేసారు. దీంతో అభిమానులు ఈ సినిమా టిక్కెట్స్ కోసం ఎగబడుతున్నారు.

  Chiranjeevi Ram Charan Acharya News18(1)
  ‘ఆచార్య’ మూవీ బుకింగ్స్ ఓపెన్ (Twitter/Photo)

  ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా సోనూ సూద్ నటించారు. మొత్తంగా ఈ  ట్రైలర్ ను ఆధ్యాత్మికంకు నక్సలిజాన్ని మిక్స్ చేసి కొరటాల శివ సరికొత్తగా ఆచార్య సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. కొరటాల శివ ఆచార్య సినిమాను తనదైన సోషల్ మెసెజ్‌తో తెరకెక్కించినట్టు కనబడుతోంది. ఇక  ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయినట్టు సమాచారం.ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon prime) భారీ రేటుకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ డీల్‌కు సంబంధించిన అన్ని అగ్నిమెంట్స్ కూడా పూర్తైయినట్టు సమాచారం. ‘ఆచార్య’ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత ‘ఆచార్య’ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది.

  Tollywood Top Most Profitable Movies : RRR సహా తెలుగులో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన టాప్ సినిమాలు ఇవే..

  ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి మరో రెండు సినిమాలను చేస్తున్నారు. ఆయన మలయాళీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ (God father) అనే పేరును ఖరారు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలకానుందని సమాచారం. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కీలకపాత్రలో కనిపించనున్నారు.

  Top Highest Grosser Indian Movies : బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాలు.. RRR2కు KGF 2 గట్టి పోటి..


  ఇక ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా చేస్తుంది. బాబీ, వెంకీ కుడుముల దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేయనున్నారు చిరంజీవి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Acharya, Chiranjeevi, Koratala siva, Ram Charan, Tollywood

  ఉత్తమ కథలు