Acharya - Chiranjeevi - Ram Charan | మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ చిత్రంపై అంచనాలు ఎంత భారీగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోవిడ్ ఆంక్షల తర్వాత రీసెంట్గా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్లో చిరంజీవి జాయిన్ అయ్యారు. మరోవైపు రామ్ చరణ్ కూడా ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ‘ఆచార్య’లో రామ్ చరణ్ అతిథి పాత్ర కాకుండా.. పూర్తి స్థాయిలో నటించబోతున్నట్టు సమాచారం. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే రామ్ చరణ్ పాత్ర ఈ సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. ఈ పాత్రను కేవలం రామ్ చరణ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసాడు కొరటాల. ఇప్పటికే మగధీర, బ్రూస్లీ, ఖైదీ నెం 150 సినిమాల్లో కలిసి కనిపించారు చిరు, రామ్ చరణ్. కానీ అవన్నీ కొన్ని నిమిషాల పాటు వచ్చి మాయం అవుతుంటాయి. కానీ ఆచార్యలో అలా కాదు.. దాదాపు చిరంజీవి, రామ్ చరణ్ స్క్రీన్ పై అరగంటకు పైనే ఉంటుందని సమాచారం. కానీ కొరటాల శివ మాత్రం ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రను గంట వరకు పొడిగించినట్టు సమాచారం.
ఈ సినిమాలో దేవాలయం సెట్ కోసం దాదాపు 10 కోట్లను ఖర్చు చేసారు. హైదరాబాద్ శివారులోని కోకాపేట్లో 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ చిత్రం కోసం టెంపుల్ టౌన్ సిటీ ఫోటోలు కూడా చిరు షేర్ చేసాడు. కళా దర్శకుడు సురేష్ నేతృత్వంలో రూపొందించిన ఈ టెంపుల్ సిటీ సెట్‌కి సంబంధించి చిరంజీవి షేర్ చేసిన వీడియో వైరల్ అయింది. ఇక్కడే దాదాపు సగం షూటింగ్ పూర్తి చేయనున్నాడు కొరటాల శివ. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటించనున్నాడు. అది నక్సలైట్ అని తెలుస్తుంది.

చిరంజీవి, కొరటాల శివ (File/Photo)
ఇప్పటికే ఇక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. చిరంజీవి సినిమాకు చాలా ఏళ్ళ తర్వాత మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. దర్శకుడిగా తన కెరీర్ మొదలు పెట్టిన తర్వాత దేవీ శ్రీ ప్రసాద్ కాకుండా బయటి మ్యూజిక్ డైరెక్టర్‌తో కొరటాల పని చేయడం ఇదే తొలిసారి.

చిరంజీవి, రామ్ చరణ్ (File/Photo)
ఆచార్య కోసం 30 రోజులు డేట్స్ ఇచ్చాడు చరణ్. ఆయన పార్ట్ త్వరగా పూర్తి చేస్తే సినిమా విడుదల కూడా ముందుగానే అవుతుందని ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. ఈ సినిమాను మే 9న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ డేట్లో చిరంజీవి నటించిన ‘జగదేవవీరుడు అతిలోకసుందరి’, గ్యాంగ్ లీడర్’ సినిమాలు రిలీజై.. బ్లాక్ బస్టర్‌తో పాటు ఇండస్ట్రీ హిట్‌ను నమోదు చేసాయి. ఇపుడు అదే డేట్లో విడుదల కాబోతున్న ఈ సినిమాతో చిరంజీవి మరో ఇండస్ట్రీ హిట్‌ను నమోదు చేస్తారా లేదా అనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:January 16, 2021, 10:05 IST