Acharya - Chiranjeevi - Ram Charan : ’ఆచార్య’ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ వెనక ఇంత పెద్ద కథ ఉందా.. ఏమైనా మెగా స్కెచ్ మాములుగా లేదుగా..

చిరంజీవి, రామ్ చరణ్ ‘ఆచార్య’ (Acharya Photo : Twitter)

Acharya - Chiranjeevi - Ram Charan : ’ఆచార్య’ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ వెనక ఇంత పెద్ద కథ ఉందా.. ఏమైనా మెగా స్కెచ్ మాములుగా లేదంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాలు.

  • Share this:
    Acharya - Chiranjeevi - Ram Charan : ’ఆచార్య’ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ వెనక ఇంత పెద్ద కథ ఉందా.. ఏమైనా మెగా స్కెచ్ మాములుగా లేదంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాలు. చిరంజీవి (Chiranjeevi ) విషయానికొస్తే.. ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. (Acharya) ఆచార్య ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీటైంది.  హీరోగాచిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అంత అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా మే 13న విడుదలకావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది మిస్టరీ గానే మిగిలిపోయింది.

    అనేక కథనాల నడుమ ఈ సినిమా విడుదల తేదిపై క్లారిటీ వచ్చింది. ఈ సినిమాను మొదట దసరా అన్నారు.. ఆ తర్వాత సంక్రాంతి రేస్ లో ఉంటుందని టాక్ నడిచింది. లేటెస్ట్2గా ఆచార్య ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది. ఐతే.. ఈ రిలీజ్ డేట్ వెనక పెద్ద రీజనే ఉందని చెబుతున్నారు.

    Chiranjeevi - Mani Sharma: ఆచార్య సహా చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

    ఈ సినిమాలో రామ్ చరణ్ కథను మలుపు తిప్పే పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కంటే ముందు రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో చేస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీతో చరణ్‌కు ప్యాన్ ఇండియా స్టార్ ఇమేజ్ రావడం పక్కా చెబుతున్నారు. అందుకే ఆచార్య సినిమాను ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత ప్యాన్ ఇండియా లెవల్లో హిందీతో పాటు తమిళంలో రిలీజ్ చేస్తే.. బాగానే వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే లేట్ అయినా.. లేటెస్ట్‌గా ఫిబ్రవరి 4న ఏ హిందీ, తెలుగు సినిమాలు పోటీలో లేని టైమ్‌లో ఈ సినిమాను విడుదల చేేయాలనే నిర్ణయానికి చిరంజీవి వచ్చినట్టు సమాచారం.

    Chiranjeevi - Salman Khan: చిరంజీవి ‘గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ రోల్ పై క్లారిటీ..

    ఇక ఈ చిత్రంలో చిరంజీవి‌తో పాటు రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ (Ram Charan) పాత్ర దాదాపు ఓ 30 నిమిషాల నిడివి ఉండనుందట.ఆ పాత్ర సినిమాకు హైలెట్‌గా ఉంటుందట. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడిందని సమాచారం. ఆచార్యలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ (Kajal Aggerwal) నటిస్తుంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే (PooJa Hegde) నటిస్తోంది. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

    NBK - Chiranjeevi - Nagarjuna - Jr NTR: చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ బాటలో స్మాల్ స్క్రీన్ పై బాలకృష్ణ సందడి..

    ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి మరో రెండు సినిమాలను చేస్తున్నారు. ఆయన మలయాళీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే పేరును ఖరారు చేశారు.

    ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న టాప్ 15 బాలీవుడ్ హీరోయిన్స్..

    ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది. ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ రీమేక్ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ ( S. S Thaman) పనిచేస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ స్టార్ బిజు మీనన్ (Biju Menon) కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమాలో నటించబోతన్నట్టు సమాచారం.

    Mani Sharma : ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట్లో పెళ్లి సందడి.. త్వరలో ఓ ఇంటి వాడు కానున్న మహతి స్వర సాగర్..

    ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహెర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా చేస్తుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది. తమన్నా గతంలో ఒకసారి చిరంజీవి సరసన నటించిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా చిత్రంలో తమన్నా (Tamannaah) తన నటనతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకి ఇది రెండో సినిమా అని చెప్పాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: