హోమ్ /వార్తలు /సినిమా /

Acharya - Chiranjeevi : రెండు పాటలు మినహా చిరంజీవి, రామ్ చరణ్‌ల ఆచార్య టాకీ పార్ట్ పూర్తి..

Acharya - Chiranjeevi : రెండు పాటలు మినహా చిరంజీవి, రామ్ చరణ్‌ల ఆచార్య టాకీ పార్ట్ పూర్తి..

ఈ రోజుల్లో దర్శక నిర్మాతలు అధికారికంగా పోస్టర్స్ కానీ.. టీజర్స్ గానీ విడుదల చేసేంత వరకు కూడా లీకు రాయుళ్ళు ఓపిక పట్టడం లేదు. అందుకే ముందుగానే లీక్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న ప్రభాస్ సలార్.. ఆ తర్వాత మహేష్ బాబు సర్కారు వారి పాట.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత అవుతుంది.

ఈ రోజుల్లో దర్శక నిర్మాతలు అధికారికంగా పోస్టర్స్ కానీ.. టీజర్స్ గానీ విడుదల చేసేంత వరకు కూడా లీకు రాయుళ్ళు ఓపిక పట్టడం లేదు. అందుకే ముందుగానే లీక్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న ప్రభాస్ సలార్.. ఆ తర్వాత మహేష్ బాబు సర్కారు వారి పాట.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత అవుతుంది.

Acharya - Chiranjeevi : రెండు పాటలు మినహా చిరంజవి, రామ్ చరణ్‌ల ఆచార్య టాకీ పార్ట్ పూర్తి చేసుకున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

  Acharya - Chiranjeevi : రెండు పాటలు మినహా చిరంజవి, రామ్ చరణ్‌ల ఆచార్య టాకీ పార్ట్ పూర్తి చేసుకున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా అడవిలో ఓ కొలను దగ్గర చెట్టు కింద ఉన్న చిరంజీవి, రామ్ చరణ్‌లున్న ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆచార్య’ సినిమాను ఎపుడు విడుదల చేస్తారా అని మెగాభిమానులు ఎదురు చూస్తున్నారు.  ఐతే.. ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కావడంతో ఆ రోజు ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాను అక్టోబర్ 1న విడుదల చేసే అవకాశాలున్నట్టు మెగా కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే యాక్ట్ చేస్తోంది. చాలా యేళ్ల తర్వాత చిరంజీవి సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

  ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు కామ్రేడ్స్ పాత్రలో కనిపించనున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్, చిరంజీవి మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్‌గా నిలవనున్నాయి. మరోవైపు దేవాలయాలు మన జాతి సంపద. ఈ నేపథ్యంలో మన దేవాలయాల గొప్పదనాన్ని ఈ సినిమాలో చూపెట్టనున్నారు. సోనూసూద్ ఈ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నారు.

  ‘ఆచార్య తర్వాత చిరు.. లూసీఫర్ రీమేక్ షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛంగా ప్రారంభమైంది.ఈ చిత్రానికి  ‘గాడ్ ఫాదర్’ అనే  టైటిల పరిశీలనలో ఉంది. లూసీఫీర్ రీమేక్‌ తర్వాత  బాబీ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో చిరంజీవి చాలా యేళ్ల తర్వాత తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దాంతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ సినిమాను రీమేక్  చేస్తున్నారు. దాంతో పాటు పలువురు దర్శకులు చెప్పిన కథకు ఓకే చెప్పినట్టు సమాచారం.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Acharya, Chiranjeevi, Kajal Aggarwal, Koratala siva, Mani Sharma, Pooja Hegde, Ram Charan, Tollywood

  ఉత్తమ కథలు