హోమ్ /వార్తలు /సినిమా /

Acharya 3 Days WW Collections : ’ఆచార్య’ 3 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్.. మరి ఇంత దారుణమా..

Acharya 3 Days WW Collections : ’ఆచార్య’ 3 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్.. మరి ఇంత దారుణమా..

ఆచార్య 3 డేస్ వాల్డ్ వైడ్‌ కలెక్షన్స్ (Twitter/Photo)

ఆచార్య 3 డేస్ వాల్డ్ వైడ్‌ కలెక్షన్స్ (Twitter/Photo)

Acharya 3 Days World Wide Collections  |   మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi ), రామ్ చరణ్‌ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’ (Acharya ). ఈ సినిమాకు నెగిటివ్ టాక్ కలెక్షన్స్ పై ప్రభావం చూపించింది. మూడో రోజు ఈ సినిమా వాల్డ్ వైడ్‌గా ఎంత రాబట్టిందంటే..

ఇంకా చదవండి ...

  Acharya 3 Days World Wide Collections  |   మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi ), రామ్ చరణ్‌ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’ (Acharya ). కొరటాల శివ దర్శకత్వం వహించారు. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదలై నెగిటిక్ టాక్ సొంతం చేసుకుంది. ఈ ఎఫెక్ట్  ఆచార్య కలెక్షన్స్ పై పడింది. పైగా మొదటి రోజు మొదటి ఆట నుంచే ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా ఉండటంతో మెగాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  శని వారంతో పాటు ఆది వారం కూడా ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. పైగా తెలంగాణలో ఇప్పటికే టికెట్స్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి. పైగా అదనంగా మరో రూ. 50 రూపాయలు పెంచడం.. మరోవైపు 10Th Class ఎగ్జామ్స్ కూడా ఉండటంతో కొన్ని ఫ్యామిలీలు థియేటర్స్ వైపు అసలు చూడటం లేదు. ఇవన్ని  కూడా ఈ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపించింది.

  ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో చిరంజీవి‌తో పాటు రామ్ చరణ్ కూడా కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ (Ram Charan)  సిద్దు పాత్ర దాదాపు గంట పాటు ఉండనుందట.

  Acharya - AP - TG 1st Day Top Share Movies From Acharya To RRR Bheemla Nayak Bahubali Chirnajeevi Ram Charans Telangana AP Top Highest Share Movies List,Acharya - AP - TG 1st Day Top Share Movies : ఏపీ, తెలంగాణలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ సినిమాలు.. ఆచార్య స్థానం ఎక్కడంటే..
  ‘ఆచార్య’ లో చిరంజీవి, రామ్ చరణ్ (Twitter/Photo)

  ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది. అంతేకాదు 132.50 కోట్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ దగ్గర ఆచార్య బరిలో దిగింది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో  రూ. 29.50 కోట్లు రాబట్టింది. రెండో రోజు రూ. 5.15 కోట్లు రాబడితే.. మూడో రోజు ఆది వారం.. రూ. 4.07 కోట్లు మాత్రమే రాబట్టి బాక్సాఫీస్‌ను నిరాశ పరిచింది.  ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో చేతులేత్తేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమా రూ. 4.07 కోట్లు మాత్రమే రాబట్టింది. ఓవర్సీస్ ప్లస్ మిగతా ఏరియాల్లో కలిపితే.. రూ. 38 లక్షలు వచ్చాయి. మొత్తంగా రూ. 4.45 కోట్లు వసూళ్లను రాబట్టింది.

  నైజాం (తెలంగాణ): రూ. 11.56 కోట్లు / రూ. 38కోట్లు

  సీడెడ్ (రాయలసీమ): రూ. 5.87 కోట్లు /  రూ.  18.50 కోట్లు

  ఉత్తరాంధ్ర: రూ. 4.66 కోట్లు /  రూ.  13 కోట్లు

  ఈస్ట్: రూ. 3.18 కోట్లు / రూ. 9.50 కోట్లు

  వెస్ట్: రూ. 3.29 కోట్లు / రూ. 7.02 కోట్లు

  గుంటూరు: రూ. 4.52 కోట్లు / రూ. 9 కోట్లు

  కృష్ణా: రూ. 2.84 కోట్లు / రూ. 8 కోట్లు

  నెల్లూరు : రూ. 2.80 కోట్లు / రూ. 4.30 కోట్లు

  తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి రూ. 38.72 కోట్లు /  రూ. 107.50 కోట్లు

  కర్ణాటక + రెస్టాఫ్ భారత్ : రూ. 2.45 కోట్లు / రూ. 9 కోట్లు

  ఓవర్సీస్ : రూ. 4.35 కోట్లు / రూ. 12 కోట్లు

  తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా రూ. 45.52 కోట్లు / రూ. 131.20 కోట్లు షేర్  రాబట్టాలి. బ్రేక్ ఈవెన్ కావాలంటే.. రూ. 132.50 కోట్ల షేర్ రాబట్టాలి.

  Day 1 WW Share - రూ. 35.05 (52 కోట్ల గ్రాస్ )

  Day 2 WW Share – రూ. 6.02Cr(10.85cr~ Gross)

  Day 3 WW Share – 4.45Cr(7.80cr~ Gross)

  మొత్తంగా 3 రోజుల్లో ఈ సినిమా రూ. 45.52 కోట్ల షేర్ (రూ. 70.65 కోట్ల షేర్) రాబట్టింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 86.98 కోట్లను రాబడితే కానీ బ్రేక్ ఈవెన్ పూర్తి కాదు. ఇపుడున్న పరిస్థితుల్లో ఆచార్య బ్రేక్ ఈవెన్ పూర్తి కావడం దాదాపు అసాధ్యమే.  ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా సోనూ సూద్ నటించారు. ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon prime) భారీ రేటుకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ డీల్‌కు సంబంధించిన అన్ని అగ్నిమెంట్స్ కూడా పూర్తైయినట్టు సమాచారం. ‘ఆచార్య’ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత ‘ఆచార్య’ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది.

  Tollywood Top Most Profitable Movies : RRR సహా తెలుగులో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన టాప్ సినిమాలు ఇవే..

  ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి మరో రెండు సినిమాలను చేస్తున్నారు. ఆయన మలయాళీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ (God father) అనే పేరును ఖరారు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలకానుందని సమాచారం. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కీలకపాత్రలో కనిపించనున్నారు.

  Chiranjeevi Dupe : చిరంజీవికి ఎన్నో ఏళ్లుగా డూప్‌గా నటించిన వ్యక్తి ఎవరో తెలుసా..


  ఇక ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా చేస్తుంది. బాబీ, వెంకీ కుడుముల దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేయనున్నారు చిరంజీవి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Acharya, Chiranjeevi, Ram Charan, Tollywood

  ఉత్తమ కథలు