Home /News /movies /

ACE TELUGU LYRICIST SIRIVENNELA SEETHARAMA SASTRY TO BE CONFERRED WITH PADMA SHRI AWARD TA

Padma Shri: ’పద్మశ్రీ’ సిరివెన్నెల సీతారామశాస్త్రి

సిరివెన్నెల సీతారామ శాస్త్రి

సిరివెన్నెల సీతారామ శాస్త్రి

Padma Shri: ’పద్మశ్రీ’ సిరివెన్నెల సీతారామశాస్త్రి | పదాలతో ప్రయోగాలు చేయడం  ఆయనకు పెన్నుతో పెట్టిన విద్య.. తెలుగు సినిమా పాటల పూదోటలో  విరిసిన ఒకానొక పారిజాతపుష్పం. అక్షరాలనే కిరణాలు, పదాలనే తేజాలను  సృష్టించాడు.  తన పాటలతో అక్షర సేద్యం చేసే కవి కర్షకుడు. అతని పాట ప్రతి నోటా అనేలా ఉంటాయి.తాజాగా కేంద్రం ఆయన్ని పద్మశ్రీ సత్కరించడం చూసి సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
పదాలతో ప్రయోగాలు చేయడం  ఆయనకు పెన్నుతో పెట్టిన విద్య.. తెలుగు సినిమా పాటల పూదోటలో  విరిసిన ఒకానొక పారిజాతపుష్పం. అక్షరాలనే కిరణాలు, పదాలనే తేజాలను  సృష్టించాడు.  తన పాటలతో అక్షర సేద్యం చేసే కవి కర్షకుడు. అతని పాట ప్రతి నోటా అనేలా ఉంటాయి. అతని రాక తెలుగు సినిమా పాటకు ఏరువాక. చిన్నచిన్న పదాలతో అనితర సాధ్యమైన సాహిత్యం.. ఆయనకే చెల్లింది.  తెలుగు సినిమా యవనికపై సాహితీ సిరివెన్నెల కురిపించిన  సినీకవి సీతారామశాస్త్రీ. తాజాగా కేంద్రం ఆయన్ని పద్మశ్రీ సత్కరించడం చూసి సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తన పాటలతో మనం సమాధానం చెప్పలేని ప్రశ్నలేన్నో వేస్తాడు. శాస్త్రీయ గీతమైనా...ప్రణయ గీతమైనా...సందేశాత్మక గీతాలైనా ..ఇలా ఏరకమైన గీతాలైనా  ఆయన కలం నుంచి ఆశువుగా జాలువారుతాయి.  ఆదిభిక్షువు వాడినేమి కోరేది  బూడిదిచ్చే వాడినేమి అడిగేది అంటూ పరమశివుని తత్వాన్ని చాటిన అపర సాహితి ఋషి సిరివెన్నెల. 1955 మే 20న విశాఖపట్నం, అనకాపల్లిలో జన్మించారు సీతారామశాస్ర్తీ. మొదట టెలిఫోన్ డిపార్ట్ మెంట్ లో సాధారణ ఉద్యోగిగా ఉంటూ  పద్యాలు గేయాలు రాసేవాడు. ఒకసారి ఆయన రాసిన ‘గంగావతరణం’ అనే గేయాన్నిచూసిన కళాతపస్వీ కె.విశ్వనాథ్  సీతారామశాస్రీ ని ‘సిరివెన్నెల’ మూవీ తో వెండితెరకు పరిచయం చేసాడు..

ఈ విధంగా  తొలిసినిమా లోనే అన్ని పాటలు రాసే అవకాశం దక్కింది. అవన్నీ అత్యంత ప్రజాదరణ పొందడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు సీతారామశాస్త్రీ. అప్పటి వరకు చెంబోలుగా ఉన్న ఆయన ఇంటిపేరు కాస్తా సిరివెన్నెల గా మారింది. ఈ విధంగా తన తొలిసినిమా పేరే ఇంటిపేరుగా మారింది. ఈ మూవీలో శాస్త్రీ రాసిన ‘విధాత తలపున ప్రభవించినది.. అంటూ  విపంచిగా సిరివెన్నెలలు కురిపించిన ఈ గీతం తెలుగు సినీ ప్రపంచాన్ని అద్భుత సాహిత్యంలో ముంచెత్తింది. తొలిసినిమాతోనే సిరివెన్నెల ఇంటికి శివుని వాహనం ‘నంది’ అవార్డు రూపంలో రంకెలేస్తూ రావడం విశేషం.


‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని...నిప్పుతోని కడుగు ఈ సమాజ జీవచ్ఛావాన్ని’ అంటూ తన సాహిత్యంతో ‘మారదు లోకం మారదు కాలం’ అంటూ సమాజంలో ఉన్న కుళ్లును తన కలంతో కడిగిపారేసాడు. ఈ మూవీలో కనిపించి వినిపించాడు సీతారామశాస్త్రీ.

అర్థ శతాబ్ధపు అజ్ఞానాన్ని స్వరాజ్య మందామా....దానికి స్వర్ణోత్సవాలు చేద్దామా?’ అంటూ తన పాటలతో అగ్గిరవ్వలను జేశాడు. రాసే ప్రతి సినిమాకు కొత్తగా సాహిత్యం అందించడంలో ఆయన నిష్ణాతుడు. ‘సురాజ్యమవలేని స్వరాజ్య మెందుకని’ తన పాటతో ప్రశ్నించాడు.  సిందూరం మూవీలో ఆయన రాసిన ఈ సాహిత్యానికి అభినందించని సినీ ప్రియుడు లేడు. ఈ పాటకు సైతం శాస్త్రీకి నంది అవార్డు వశం కావడం విశేషం.

అలాగే ఎవరో ఒకరు ఎప్పుడో అపుడు.. నడవరా ముందుకు అటో ఇటో ఎటో వైపు అంటూ ...మొదటగా ముందడుగు నీవెయ్యి.. నీ వెనుకే సమాజం వస్తుంది అని చెప్పాడు. రాసిన ప్రతీ పాటలో విలువైన పదాన్ని పొదిగి ఆ గీతానికి విలువను ఆపాదించడంలోనూ శాస్త్రీ స్టైలే వేరు.

సమాజాన్ని సంస్కరించే గీతాలే కాదు..అలనాటి కవులు బాణీలో సాహితీ సౌరభాలందించాడు సీతారామ శాస్త్రీ. శృతిలయలు సినిమాలో ‘తెలవారదేమో స్వామి’ అంటూ ఆయన రాసిన శాస్త్రీయ గీతాన్ని మొదటగా అన్నమయ్య కృతిగా భావించారు. అంతలా మమేకమై రాసిన అద్భుత కవి శాస్త్రీ. అలనాటి కవుల ప్రబంధాల్లా సాహిత్యం రాయడంలో తనకు సాటిలేదని నిరూపించుకొన్నాడు.


స్వర్ణకమలం మూవీలో ఆయన రాసిన ఓం నమో నమ: శివాయ అంటూ ఆయన రాసిన పదాలు ఓంకారనాదం లా మన చెవుల్లో ఇప్పటికీ ఝుమ్మంటునే ఉన్నాయి. అందెల రవళికి పదముల తానై అనే చరణానికి.. నాట్యానానికి ,నటరాజ స్వామికి మధ్య బంధాన్ని తన కలంతో పండిత పామర జనరంజకంగా రాసి ఇటువంటి గీతాలలో తనకు తిరుగులేదని పించుకున్నాడు.

‘భద్రం బి కేర్ ఫుల్ బ్రదు భర్తకు మారకు బ్యాచిలరు’ అని పాడుకేనే ఆధునిక బ్రహ్మచారుల శైలీని అద్ధం పట్టింది. కామెడీ పాటలను రాయడంలో తనకు సాటిరారని నిరూపించుకున్నాడు శాస్త్రీ.

‘జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది’..అంటూ ‘చక్రం’ సినిమాలో ఆయన రాసిన ఈ పాట ఆయనలోని తాత్వికుడ్ని మన ముందు ఆవిష్కరించింది. కవినై...కవితనై...భార్యనై...భర్తనై...అన్ని తానే అంటాడు. అందరు ఉన్న నా జీవితం ఒంటరి అన్నాడు ఈ పాటలో.. పాటను అర్థం అయ్యేలా రాయనక్కర్లేదు. అర్ధం చేసుకునే కోరిక పుట్టేలా రాసి ప్రేక్షకుడి స్థాయిని పెంచిన కవి శాస్త్రీ.

కొంత మంది ఇంటి పేరు కాదుర గాంధీ...ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ. అంటూ బాపూజీ అంతరంగాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు. ‘ఎంత వరకు ఎంత వరకు’ అంటూ గమ్యంలో ఆయన రాసిన గేయంలో.. సమాజంలో ఉన్న గాయాలను కళ్లకు కట్టినట్లు చూపాడు. తెలుగులో దాదాపు అందరి హీరోలకు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు.  2019 ఏడాదికి గాను కేంద్రం ఆయన్ని పద్మశ్రీతో గౌరవించడం తెలుగు సాహిత్యానికి దక్కిన గౌరవంగా భావించాలి.

ఇవి కూడా చదవండి

Padma Bhushan: ‘పద్మభూషణ్’ మోహన్ లాల్

సిరివెన్నెల సీతారామశాస్త్రికి పద్మశ్రీ.. మోహన్ లాల్‌కు పద్మభూషణ్..

తెలుగువారికి 4 పద్మ శ్రీ అవార్డులు...లిస్టులో హారిక, సిరివెన్నెల

ప్రణబ్ ముఖర్జీకి 'భారతరత్న'..నానాజీ, హజారికాకు కూడా...
First published:

Tags: Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు