ACE DIRECTOR RAGHAVENDRA RAO TO PRODUCE KRISHNA TULASI SERIAL IN ZEE TELUGU MNJ
Raghavendra Rao: రాఘవేంద్రరావు నిర్మాణంలో రాబోతున్న ధారావాహిక.. ఇది తనకెంతో ప్రత్యకమన్న దర్శకేంద్రుడు
Intresting story behind Darsakendrudu Raghavendra Rao first movie as an actor
Raghavendra Rao- Krishna Tulasi: గత కొన్నేళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉన్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. ప్రస్తుతం సినిమాల పర్యవేక్షకుడిగా, ప్రజెంటర్గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కాగా ఇప్పుడు దర్శకేంద్రుడు మరో బాధ్యతను కూడా తీసుకున్నారు. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ జీతెలుగుతో కలిసి ఆయన ఓ ధారావాహికను నిర్మిస్తున్నారు.
Raghavendra Rao- Krishna Tulasi: గత కొన్నేళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉన్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. ప్రస్తుతం సినిమాల పర్యవేక్షకుడిగా, ప్రజెంటర్గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కాగా ఇప్పుడు దర్శకేంద్రుడు మరో బాధ్యతను కూడా తీసుకున్నారు. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ జీతెలుగుతో కలిసి ఆయన ఓ ధారావాహికను నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ సీరియల్కి పర్యవేక్షకుడిగా కూడా పనిచేస్తున్నారు. ఇక ఈ సీరియల్ షూటింగ్ ఇప్పటికే కొంత భాగం పూర్తి అవ్వగా.. త్వరలో ప్రసారానికి కూడా సిద్ధమైంది. ఇంతకు రాఘవేంద్రరావు నిర్మిస్తోన్న సీరియల్ ఏంటి..? ఆయన ఈ సీరియల్ నిర్మించేందుకు ప్రత్యేక కారణాలేంటి అన్న వివరాల్లోకి వెళ్తే..
జీ తెలుగులో మరో కొత్త సీరియల్ రాబోతోంది. కృష్ణ తులసి పేరిట రాబోతోన్న ఈ సీరియల్ ఫిబ్రవరి 22 నుంచి సాయంత్రం గం.6.30ని.లకు ప్రసారం కాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్లు ప్రారంభమయ్యాయి. ఇక ఈ సీరియల్ గురించి రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. దీని కథనం తన మనసుకు హత్తుకుందని అన్నారు. జీ తెలుగుతతో భాగస్వామ్యం అవ్వడం ఆనందంగా ఉందని, ఈ సీరియల్లో శ్యామ పాత్ర అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉందని రాఘవేంద్రరావు తెలిపారు.
కృష్ణ తులసి
కాగా చిన్నప్పటి నుంచి భక్తభావంతో ఉంటూ పాటలు పాడటంలో దిట్టైన శ్యామ.. ఇంట్లో పరిస్థితుల వలన తన గాత్రాన్ని దానం చేస్తుంది. స్టేజ్ వెనకాల ఉంటూ స్టేజ్ ముందు తన సవతి చెల్లెలికి గాత్రం ఇస్తుంటుంది. ఇక తన రంగును చూసి తనను ఎవరూ ఇష్టపడరని భావించే శ్యామ జీవితంలోకి అందమైన వ్యక్తి ఎలా ఎంటర్ అవుతాడు..? వీరి కథ ఎన్ని మలుపులు తిరగబోతుంది..? అనే కథనంతో ఈ సీరియల్ తెరకెక్కింది. ఇందులో ఐశ్వర్య, దిలీప్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. పవిత్ర నాథ్, ప్రత్యూష, జేఎల్ శ్రీనివాస్, రాధికా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించనున్నారు. ఫిబ్రవరి 22న నుంచి ఈ సీరియల్ ప్రసారం కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సీరియల్ ప్రోమోలు అందరినీ ఆకట్టుకున్నాయి.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.