హోమ్ /వార్తలు /సినిమా /

Adhire Abhi: జబర్దస్త్ కమెడియన్ అదిరే అభికి తీవ్ర గాయాలు..!

Adhire Abhi: జబర్దస్త్ కమెడియన్ అదిరే అభికి తీవ్ర గాయాలు..!

అదిరే అభి

అదిరే అభి

సినిమా షూటింగ్ జరుగుతుండగా అభి కింద పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు అవ్వడంతో వెంటనే అక్కడున్న సిబ్బంది ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

అదిరే అభి..  ప్రముఖ సినీ నటుడు, జబర్దస్త్ కమెడియన్ కూడా. అతడి పూర్తి పేరు అభియన కృష్ణ. అభి అనేక సినిమాల్లో నటించినా.. జబర్దస్త్ ద్వారా అదిరే అభికి విపరీతమైన పాపులారిటీ వచ్చింది. జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న కమెడియన్స్ లలో అదిరే అభి కూడా ఒకరు. కేవలం కామెడీ షోలు మాత్రమే చేయకుండా నటుడిగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నాడు అభి. దర్శకుడిగా కూడా మారాడు. అయితే అదిరే అభి తాజాగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్‌లో అతడికి తీవ్ర గాయాలు అయినట్లు వార్తలు వస్తున్నాయి. అభి చేతికి అలాగే కాలికి కూడా దెబ్బలు తగిలినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అదిరే అభి హీరోగా నటిస్తున్న ఓ చిత్రం షూటింగ్ జరుగుతోంది. అయితే ఇందులో భాగంగా ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అభి కింద పడిపోవడంతో అతడికి తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది అభిని హాస్పిటల్ కు తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఆయన సన్నిహితులు అంటున్నారు.

అభి చేతికి మాత్రం తీవ్ర గాయాలు కావడంతో డాక్టర్లు అభి చేతికి 15 కుట్లు వేసినట్లు సమాచారం. అభి గాయాల పాలవ్వడంతో సినిమా షూటింగ్ కూడా నిలిచిపోయింది.అభి ప్రస్తుతం కోలుకుంటున్నాడని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు.

అదిరే అభి జబర్దస్త్‌ షో నుంచి కూడా తప్పుకున్నాడు. మా టీవీలో నాగబాబు జడ్జిగా ఉన్న కామెడీ స్టార్స్‌ ప్రోగ్రామ్‌కు వెళ్లిపోయాడు. అయితే ఇప్పుడు అభి అక్కడ కూడా లేడు. ప్రస్తుతం సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘ఈశ్వర్’ చిత్రంలో హీరో స్నేహితుడి పాత్రలో అభి వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘విష్ణు’ ‘ఒట్టు ఈ అమ్మాయెవరో తెలీదు’ ‘విద్యార్థి’ ‘గౌతమ్ ఎస్.ఎస్.సి’ ‘ప్రేమికులు’ ‘మా నాన్న చిరంజీవి’ ‘ఈగ’ ‘రాగల 24 గంటల్లో’ ‘బాహుబలి2’ ‘ రాంగ్ గోపాల్ వర్మ’ వంటి చిత్రాల్లో నటించాడు అభి. బాహుబలి సినిమాకు గాను అదిరే అభి దర్శకత్వ శాఖలో కూడా పనిచేశాడు. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

First published:

Tags: Adire abhi, Jabardast comedian, Tollywood

ఉత్తమ కథలు