హోమ్ /వార్తలు /సినిమా /

OTT | Anurag Thakur : ఓటీటీల పేరుతో ఇష్టం వచ్చినట్టు తీస్తే కుదరదు.. : మంత్రి అనురాగ్ ఠాకూర్ వార్నింగ్..

OTT | Anurag Thakur : ఓటీటీల పేరుతో ఇష్టం వచ్చినట్టు తీస్తే కుదరదు.. : మంత్రి అనురాగ్ ఠాకూర్ వార్నింగ్..

Minister Anurag thakur on ott content Photo : Twitter

Minister Anurag thakur on ott content Photo : Twitter

OTT | Anurag Thakur : ఓటీటీ కంటెంట్​పై అందులో ఉండే అశ్లీలతపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ నిన్న నాగ్ పూర్‌లో జరిగిన సమావేశంలో ఘాటుగా స్పందించారు. ఓటీటీల్లో వచ్చే కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్​లు అసభ్యకరంగా ఉంటున్నాయని మండిపడ్డారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఓటీటీ(OTT content) కంటెంట్​పై అందులో ఉండే అశ్లీలతపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur ) ఘాటుగా స్పందించారు. ఓటీటీల్లో వచ్చే కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్​లు అసభ్యకరంగా ఉంటున్నాయని మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. ఓటీటీకి ఇచ్చిన స్వేచ్ఛ క్రియేటివిటీ కోసమని.. అశ్లీలత, అసభ్య పదజాలం వాడేందుకు కాదని స్పష్టం చేశారు. ఓటీటీల్లో అశ్లీలత హద్దులు దాటితే ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వస్తుందని పేర్కోన్నారు.

కేంద్ర సమాచార ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తాజాగా నాగ్‌పూర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో పెరుగుతున్న అశ్లీలత, అసభ్య పదజాలం గురించి విలేకరులతో మాట్లాడారు. ఈ అంశంపై ప్రభుత్వ తీవ్రతను వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ " సృజనాత్మకత పేరుతో దుర్భాషలాడితే సహించేది లేదు. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో దుర్వినియోగం ఎక్కవుతోంది.

అసభ్యకరమైన కంటెంట్‌పై పెరుగుతున్న ఫిర్యాదులపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. దీనికి సంబంధించి నిబంధనలలో ఏవైనా మార్పులు చేయవలసి వస్తే దానిని పరిగణనలోకి తీసుకునేందుకు మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉందని అన్నారు.  ఈ ప్లాట్‌ఫారమ్‌లలో సృజనాత్మకతకు స్వేచ్ఛ ఇవ్వబడింది తప్పా అశ్లీలతకు కాదు. ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాడానికి సిద్ధంగా ఉందన్నారు. ఇందులో మార్పులు తీసుకురావడానికి నిబంధనల్లో ఏమైనా మార్పులు అవసరమవుతాయా అనే కోణాన్ని ఐటీశాఖ పరిశీలిస్తుందని తెలిపారు.

First published:

Tags: Aha OTT Platform, Tollywood news

ఉత్తమ కథలు