బూతులు ఎక్కువైపోతున్నాయి బాసూ.. దర్శకులు కాస్త చూస్కోవాలేమో..?

తెలుగు ఇండ‌స్ట్రీలో రోజురోజుకీ మార్పులు జ‌రుగుతున్నాయి. అందులో భాగంగానే మేకింగ్ కూడా మారిపోతుంది. ఒక‌ప్పుడు సినిమాలో చిన్న బూతు వ‌స్తేనే బీప్ వేసేవాళ్లు సెన్సార్ స‌భ్యులు. కానీ మెల్ల‌గా సెన్సార్ కూడా క‌త్తెర ప‌దును త‌గ్గించింది. రాను రాను ఇప్పుడు బూతులు కూడా యదేచ్ఛ‌గా తెర‌పై వినిపిస్తున్నాయి.. క‌నిపిస్తున్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 18, 2019, 2:57 PM IST
బూతులు ఎక్కువైపోతున్నాయి బాసూ.. దర్శకులు కాస్త చూస్కోవాలేమో..?
సెన్సార్ బోర్డ్
  • Share this:
తెలుగు ఇండ‌స్ట్రీలో రోజురోజుకీ మార్పులు జ‌రుగుతున్నాయి. అందులో భాగంగానే మేకింగ్ కూడా మారిపోతుంది. ఒక‌ప్పుడు సినిమాలో చిన్న బూతు వ‌స్తేనే బీప్ వేసేవాళ్లు సెన్సార్ స‌భ్యులు. కానీ మెల్ల‌గా సెన్సార్ కూడా క‌త్తెర ప‌దును త‌గ్గించింది. రాను రాను ఇప్పుడు బూతులు కూడా యదేచ్ఛ‌గా తెర‌పై వినిపిస్తున్నాయి.. క‌నిపిస్తున్నాయి. అప్ప‌ట్లో దూల తీరింది అంటే బీప్ అనేవాళ్లు.. కానీ ఇప్పుడు అది కామ‌న్ వ‌ర్డ్ అయింది. ఆ త‌ర్వాత నీ య‌.. అనే ప‌దాన్ని కూడా ఇప్పుడు త‌రుచూ వాడేస్తున్నారు. అక్క‌డి వ‌ర‌కు ఆగితే బాగానే ఉంటుంది.

Abused Language using in Telugu movies.. Censor Board taking not serious about words pk.. తెలుగు ఇండ‌స్ట్రీలో రోజురోజుకీ మార్పులు జ‌రుగుతున్నాయి. అందులో భాగంగానే మేకింగ్ కూడా మారిపోతుంది. ఒక‌ప్పుడు సినిమాలో చిన్న బూతు వ‌స్తేనే బీప్ వేసేవాళ్లు సెన్సార్ స‌భ్యులు. కానీ మెల్ల‌గా సెన్సార్ కూడా క‌త్తెర ప‌దును త‌గ్గించింది. రాను రాను ఇప్పుడు బూతులు కూడా యదేచ్ఛ‌గా తెర‌పై వినిపిస్తున్నాయి.. క‌నిపిస్తున్నాయి. telugu cinema,tollywood,abused words telugu cinema,abused language in telugu movies,arjun reddy movie,falaknuma das trailer,బూతులు,తెలుగు సినిమాల్లో బూతులు,ఫలక్‌నామా దాస్ సినిమా,అర్జున్ రెడ్డి సినిమా,ఫలక్ నామా దాస్ ట్రైలర్
అర్జున్ రెడ్డి ఫలక్ నామా దాస్

ఇడియ‌ట్, దేశ‌ముదురు, స్టుపిడ్, సాలే, బేవ‌కూఫ్ ఇలా ప్ర‌తీ ప‌దాన్ని వాడేస్తున్నారు.. కొంద‌రు ద‌ర్శ‌కులు అయితే టైటిల్స్ పెట్టేస్తున్నారు. ఆ మ‌ధ్య అర్జున్ రెడ్డి సినిమాలో ఏం మాట్లాడుతున్నావ్ రా.. అనే డైలాగ్ ఎంత ఫేమ‌స్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇక ఇప్పుడు దాన్ని దాటేసి మ‌రో స్టేజ్ కు వెళ్లిపోయింది తెలుగు ఇండ‌స్ట్రీ. తాజాగా ల అనే అక్షరంతో మొద‌ల‌య్యే బూతుల‌ను కూడా చూసి చూడ‌న‌ట్లుగా వ‌దిలేస్తున్నారు సెన్సార్ స‌భ్యులు.

Abused Language using in Telugu movies.. Censor Board taking not serious about words pk.. తెలుగు ఇండ‌స్ట్రీలో రోజురోజుకీ మార్పులు జ‌రుగుతున్నాయి. అందులో భాగంగానే మేకింగ్ కూడా మారిపోతుంది. ఒక‌ప్పుడు సినిమాలో చిన్న బూతు వ‌స్తేనే బీప్ వేసేవాళ్లు సెన్సార్ స‌భ్యులు. కానీ మెల్ల‌గా సెన్సార్ కూడా క‌త్తెర ప‌దును త‌గ్గించింది. రాను రాను ఇప్పుడు బూతులు కూడా యదేచ్ఛ‌గా తెర‌పై వినిపిస్తున్నాయి.. క‌నిపిస్తున్నాయి. telugu cinema,tollywood,abused words telugu cinema,abused language in telugu movies,arjun reddy movie,falaknuma das trailer,బూతులు,తెలుగు సినిమాల్లో బూతులు,ఫలక్‌నామా దాస్ సినిమా,అర్జున్ రెడ్డి సినిమా,ఫలక్ నామా దాస్ ట్రైలర్
తెలుగు ఇండస్ట్రీ

ఈ మ‌ధ్యే విడుద‌లైన విశ్వ‌క్ సేన్ ఫ‌ల‌క్ నామా దాస్ సినిమా ట్రైల‌ర్లో బూతుల‌కు అడ్డే లేద‌స‌లు. ఇది చూస్తుంటే మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లకు సెన్సార్ ఏ స్థాయిలో ఫ్రీ డ‌మ్ ఇచ్చిందో అర్థ‌మైపోతుంది. యూ ట్యూబ్ ఎలాగూ సెన్సార్ లేదు కాబ‌ట్టి నేరుగా బూతుల‌తోనే ట్రైల‌ర్ వ‌దిలేస్తున్నారు. ఈ ట్రైల‌ర్ నిండా విష‌యంతో పాటు బూతులు కూడా ఉన్నాయి. ఎంత స‌హ‌జాత్మ‌కంగా తీసార‌నుకున్నా కూడా మ‌రీ అంత‌గా వెండితెర‌పై క‌నిపిస్తుంటే ఆ బూతుల ప్ర‌భావం ప్రేక్షకుల‌పై కూడా బాగానే ప‌డుతుంద‌న‌డంలో ఆశ్చ‌ర్య‌మైతే లేదు. మ‌రి ఇది ఎక్క‌డ ఆగుతుందో చూడాలిక‌.
Published by: Praveen Kumar Vadla
First published: February 18, 2019, 2:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading