• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ABIJEET GETTING POUR OF OFFERS BEFORE WINNING BIGG BOSS 4 TITLE MNJ

Abijeet: అభిజీత్‌కి అప్పుడే వెల్లువెత్తుతున్న ఆఫ‌ర్లు.. బయటకు రాగానే బిజీ అవ్వనున్న నటుడు

Abijeet: అభిజీత్‌కి అప్పుడే వెల్లువెత్తుతున్న ఆఫ‌ర్లు.. బయటకు రాగానే బిజీ అవ్వనున్న నటుడు

అభిజీత్‌

బిగ్‌బాస్ 4(Bigg Boss 4 Telugu) ఫైన‌ల్‌కి వ‌చ్చేసింది. ఈ సీజ‌న్‌లో టైటిల్ ఫేవ‌రెట్‌గా ముందు నుంచి వినిపిస్తోన్న పేరు అభిజీత్‌(Abijeet). ఇక హౌజ్‌లోకి వెళ్లిన త‌రువాత అత‌డిపై వీక్ష‌కుల‌కు మ‌రింత క్లారిటీ వ‌చ్చేసింది. కొన్ని కార‌ణాల వ‌ల‌న ప‌లు టాస్క్‌ల‌కు

  • Share this:
    Abijeet: బిగ్‌బాస్ 4 ఫైన‌ల్‌కి వ‌చ్చేసింది. ఈ సీజ‌న్‌లో టైటిల్ ఫేవ‌రెట్‌గా ముందు నుంచి వినిపిస్తోన్న పేరు అభిజీత్‌. ఇక హౌజ్‌లోకి వెళ్లిన త‌రువాత అత‌డిపై వీక్ష‌కుల‌కు మ‌రింత క్లారిటీ వ‌చ్చేసింది. కొన్ని కార‌ణాల వ‌ల‌న ప‌లు టాస్క్‌ల‌కు దూరంగా ఉన్న‌ప్ప‌టికీ.. హౌజ్‌లోకి కంటెస్టెంట్‌లు అంద‌రితో మంచి రాపోను తెచ్చుకున్నాడు అభిజీత్‌. అంతేకాదు ఎదుటివారు ఎన్ని మాట‌లు అన్నా కూడా.. సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు వారిపై కేర్ తీసుకున్నాడు త‌ప్ప ఎవ్వ‌రినీ శ‌త్రువుగా భావించ‌లేదు. బిగ్‌బాస్ సైతం అభిజీత్‌ని మెర్చ్యూర్డ్ కంటెస్టెంట్ అంటూ కితాబిచ్చారు. ఇప్ప‌టివ‌ర‌కు మూడు సీజ‌న్లు పూర్తి కాగా.. ఏ కంటెస్టెంట్ కూడా బిగ్‌బాస్ చేత అలాంటి ప్ర‌శంస‌ను పొంద‌లేదు. ఇక విజ‌య్ దేవ‌రకొండ‌, నాగ‌బాబు, శ్రీకాంత్ వంటి సెల‌బ్రిటీలు సైతం అభికి స‌పోర్ట్ ఇస్తున్నారు. వీట‌న్నింటితో బిగ్‌బాస్ విన్న‌ర్ అభిజీత్‌నే అని దాదాపుగా అంద‌రూ ఫిక్స్ అయ్యారు. బ‌య‌ట పోల్స్ సైతం అభికి అనుగుణంగానే ఉన్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో అభికి సంబంధించిన ప‌లు వార్త‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అదేంటంటే ఈ హీరోకు అప్పుడే ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయ‌ట‌.

    అభితో స్టార్ మా నిర్వాహ‌కులు ఓ స్పెష‌ల్ షోను ప్లాన్ చేశార‌ట‌. అలాగే ప్ర‌ముఖ ఓటీటీ యాప్ ఆహా కూడా అభి కోసం ఓ స్పెష‌ల్ ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే ప‌లువురు ద‌ర్శ‌కులు కూడా అభి కోసం ఎదురుచూస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక బ‌య‌ట‌కు వ‌చ్చాక అభి ఓకే అంటే ఇవ‌న్నీ ప‌ట్టాలెక్క‌నున్నాయి. చూస్తుంటే అభి ఇక‌పై మ‌రింత బిజీగా మార‌బోతున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది.

    కాగా శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు అభి. ఆ త‌రువాత రామ్ లీలా, మిర్చి లాంటి కుర్రాడు వంటి చిత్రాల్లో న‌టించారు. అయితే అవేవి పెద్ద విజ‌యాన్ని సాధించ‌లేదు. ఆ త‌రువాత యాంక‌ర్ వ‌ర్షిణితో క‌లిసి పెళ్లిగోల అనే సిరీస్‌లో అభి క‌నిపించారు. ఈ సిరీస్ మంచి విజ‌యం సాధించ‌డంతో పాటు అభికి మంచి పేరును తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే.
    Published by:Manjula S
    First published:

    అగ్ర కథనాలు