హీరోగా ఎంట్రీ ఇస్తున్న సుమలత తనయుడు!

Sunil Kumar Jammula | news18india
Updated: May 29, 2018, 9:56 AM IST
హీరోగా ఎంట్రీ ఇస్తున్న సుమలత తనయుడు!
  • Share this:
టాలీవుడ్ లో హీరోయిన్ గా సుమలత ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది. సుమ‌ల‌త ఖైదీ, చట్టంతో పోరాటం, శృతి లయలు లాంటి చిత్రాలలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.  ఇప్పుడు  ఆమె తనయడు అభిషేక్  హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి  ఫ్లాన్ చేస్తున్నాడు. అభిషేక్ లో మంచి హీరో ఫీచర్స్  ఉన్నాయి. దీనితో ఫ్రెండ్స్ ఎప్పటినుండో  సినిమా వైపు  వెళ్ళమని ఎంకరేజ్ చేస్తున్నారట.

సుమలత భర్త  అంబరీష్ శాండిల్ ఉడ్ లో  రెబల్ స్టార్ గా ఫేమస్ హీరో అన్న సంగతి తెలిసిందే.  ఇప్పుడు వీళ్ళ  తనయడు అభిషేక్ హీరోగా  తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు .

యాక్టింగ్ వైపు ఆసక్తి వున్న అభిషేక్ ఇప్పటికే నటనలోను .. మార్షల్ ఆర్ట్స్ లోను ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నాడు. 'అమర్' అనే సినిమా ద్వారా అభిషేక్ పరిచయం కానున్నాడు. సందేశ్ నాగరాజ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి, నాగ శేఖర్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా తాన్యా హోప్ ను తీసుకున్నారు. భారీ బడ్జెట్ తో త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అభిషేక్ తన పేరెంట్స్ మాదిరిగా వెండితెరపై తనదైన ముద్ర వేస్తాడేమో చూడాలి.
Published by: Sunil Kumar Jammula
First published: May 29, 2018, 9:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading