కరోనా వైరస్‌ను జయించిన బచ్చన్ ఫ్యామిలీ.. అభిషేక్ కూడా..

అభిషేక్ బచ్చన్ (abhishek bachchan)

Abhishek Bachchan: సరిగ్గా మూడు వారాల కింద అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడ్డాడని తెలుసుకుని అభిమానులంతా కంగారు పడ్డారు. ఆ లోపే అభిషేక్ కూడా కరోనా వైరస్..

  • Share this:
సరిగ్గా మూడు వారాల కింద అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడ్డాడని తెలుసుకుని అభిమానులంతా కంగారు పడ్డారు. ఆ లోపే అభిషేక్ కూడా కరోనా వైరస్ సోకిందని చెప్పాడు. వెంటనే ఐశ్వర్య రాయ్, ఆరాధ్య కూడా కరోనా బారిన పడ్డట్లు కన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో బచ్చన్ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలంటూ అభిమానులు దేశవ్యాప్తంగా ప్రార్థనలు చేసారు. వాళ్ల పూజలు ఫలించి ఒక్కొక్కరుగా కోలుకుంటూ వచ్చారు. ఇప్పటికే ఐశ్వర్య, ఆరాధ్య, అమితాబ్ కరోనాను జయించారు. ఇప్పుడు అభిషేక్ బచ్చన్ కూడా కరోనా నుంచి బయటపడ్డాడు.


ఈయనకు తాజాగా చేసిన పరీక్షలో కరోనా నెగిటివ్ వచ్చింది. ఇదే విషయాన్ని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసాడు జూనియర్ బచ్చన్. మాటిచ్చాను.. తప్పలేదు.. చెప్పినట్లుగానే నాకు కరోనా నెగిటివ్ వచ్చింది అంటూ పోస్ట్ చేసాడు అభిషేక్. తన, తన కుటుంబ ఆరోగ్యం కోసం ప్రార్థించిన వాళ్లందరికీ చేతులెత్తి నమస్కారం చేసాడు అభిషేక్. నానావతి హాస్పిటల్ వైద్యులు, నర్సింగ్ చేసిన సేవలకు ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పాడు అభిషేక్. ఏదేమైనా కూడా బచ్చన్ కుటుంబం అంతా కరోనా నుంచి కోలుకోవడంతో అభిమానులు కూడా సంతోషంలో మునిగిపోయారు.
Published by:Praveen Kumar Vadla
First published: