ఇకపై ఆమీర్ ఖాన్‌తో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చినా నటించను.. అభిషేక్ బచ్చన్..

ఇకపై బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్‌ ఆమీర్ ఖాన్‌తో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చినా.. నటించను అని చెబుతున్నాడు అభిషేక్ బచ్చన్.

news18-telugu
Updated: June 27, 2020, 8:08 AM IST
ఇకపై ఆమీర్ ఖాన్‌తో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చినా నటించను.. అభిషేక్ బచ్చన్..
అభిషేక్ బచ్చన్, ఆమీర్ ఖాన్ (File/Photo)
  • Share this:
ఇకపై బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్‌ ఆమీర్ ఖాన్‌తో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చినా.. నటించను అని చెబుతున్నాడు అభిషేక్ బచ్చన్. ఇక వీళ్లిద్దరు కలిసి గతంలో ‘ధూమ్ 3’లో కలిసి నటించారు. అందులో అభిషేక్ .. ఏసీపీ జై దీక్షిత్ పాత్రలో నటిస్తే.. ఆమీర్ ఖాన్ దొంగ‌ పాత్రలో నటించాడు. దొంగ, పోలీసు నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ఇపుడు ఈ సిరీస్‌లో నాల్గో భాగాన్ని తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారు చిత్ర నిర్మాతలు. తాజాగా అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ.. తనకు మరోసారి ఆమీర్ ఖాన్‌తో నటించే ఛాన్స్ వచ్చినా.. ఆయనతో సినిమా చేయనున్నాడు. ఎందుకంటే ఆయనతో నటించడం అంత తేలిక కాదన్నారు. మరోవైపు ఆయన డైరెక్షన్ చేసే సినిమాలో యాక్ట్ చేస్తానని చెప్పాడు. ఇక ‘ధూమ్ 3’ ఆమీర్ ఖాన్‌తో నటించే అవకాశం రావడాన్ని నేను ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నాను. నాకు మరో ఛాన్స్ వస్తే.. ఆయన దర్శకత్వంలో నటిస్తాను. ఒకవేళ ఆమీర్ ఖాన్..నా విన్నపాన్ని అంగీకరిస్తాడని భావిస్తున్నాను. ఆయనలో ఒక నటుడే కాదు.. అద్బుతమైన దర్శకుడు కూడా ఉన్నాడు. ఆయన సెట్‌లో ఉంటే ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాడు. అంతేకాదు అందరితో ఎంతో జోవియల్‌గా ఉంటాడనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు.ఈ సందర్భంగా చికాగో జరిగిన ధూమ్ 3 షూటింగ్ విషయాలను అభిమానులతో పంచుకున్నారు అభిషేక్ బచ్చన్.
First published: June 27, 2020, 8:08 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading