హోమ్ /వార్తలు /సినిమా /

రెక్కీ 360 టీజర్ రిలీజ్.. వీడియో ఆద్యంతం ఉత్కంఠభరితం!!

రెక్కీ 360 టీజర్ రిలీజ్.. వీడియో ఆద్యంతం ఉత్కంఠభరితం!!

Photo Twitter

Photo Twitter

RECCE 360 Teaser: రెక్కీ 360 మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. కేవలం 54 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ లోని ప్రతి సన్నివేశం కూడా ఉత్కంఠ రేపుతోంది.

చిన్న సినిమాల్లో కూడా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు సూపర్ సక్సెస్ సాధిస్తున్నాయి. అలాంటి కోవలో రాబోతున్న కొత్త సినిమా రెక్కీ 360 (RECCE 360). స్నోబాల్ పిక్చర్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1గా తెరకెక్కుతున్న సూపర్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. శ్రీమతి సాకా ఆదిలక్ష్మి సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని "కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు" అనే ట్యాగ్ లైన్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రానికి ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ (VSR Prasad) దర్శకత్వం వహిస్తుండగా కమలకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ యునీక్ ఎంటర్టైనర్ తో అభిరామ్ (Abhiram) హీరోగా పరిచయమవుతుండగా.. క్రేజీ కమెడియన్ భద్రమ్ సెకండ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటివరకు తన కెరీర్ లోనే చేయని ఓ వినూత్నమైన పాత్రలో ఆయన కనిపించనున్నాడు.

ఇకపోతే ఈ క్రైం థ్రిల్లర్ లో అమీక్షా పవార్ (Ameeksha Pavar), జస్విక (Jaswika) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్‌లో విడుదల చేయగా ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెలుగు తెరపై ఇప్పటివరకు రాని కథాంశానికి ఎవరూ ఊహించని కొన్ని ట్విస్టులు జోడించి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

కాగా, ఈ రెక్కీ 360 మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. కేవలం 54 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ లోని ప్రతి సన్నివేశం కూడా ఉత్కంఠ రేపుతోంది. చిత్ర కథా నేపథ్యం ఎలా ఉంటుందో చెబుతూ ప్రతి ఫ్రేమ్ కూడా ఆసక్తికరంగా మలిచారు. క్రైం నేపథ్యంలో సాగే ఈ కథలో ఊహించని ట్విస్టులు ఉంటాయని టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. ఇకపోతే ఈ రెక్కీ 360 మూవీ టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ సెట్టర్ అవుతుందని మేకర్స్ అంటున్నారు.' isDesktop="true" id="1355306" youtubeid="6g_kFiMRoX0" category="movies">

ఈ చిత్ర రూపకల్పనలో ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్ అందించిన మోరల్ సపోర్ట్ కు ఎప్పటికీ రుణపడి ఉంటామని మేకర్స్ పేర్కొన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తి చేసుకుని, తుది మెరుగులు దిద్దుకుంటున్న " రెక్కీ 360" చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రంలో నాగరాజు ఉండ్రమట్ట, దేవిచరణ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

First published:

Tags: Crime story, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు