కొన్ని బంధాలు చాలా గట్టిగా ఉంటాయి. ఎంత గట్టిగా అంటే... కొన్నేళ్ల పాటు కలవకపోయినా.. కొన్నేళ్త తర్వాత కలిసినా... వాళ్ల కలయిక చూపరులకు ఎక్కడో కన్నీటిపొర తెప్పించేలా..! ఎప్పుడూ చీమ జోకులు చెప్పే లాస్య... వాటిలో హాస్యం లేకపోయినా స్నేహంగా నవ్వే రవి... ఇప్పుడు కలిసిపోయారు. కలిసి యాంకరింగ్ కూడా చేసేస్తున్నారు. వారిద్దరినీ ఒక వేదిక మీదకు తీసుకొచ్చింది ఓ చానెల్ చేస్తున్న సంక్రాంతి సంబరమే.. అయినా వారి కలయిక వెనుక ఓ స్నేహపూర్వక హస్తం ఉందని కూడా తెలుస్తోంది. ఆ హస్తం ఎవరిదో తెలుసుకోవడానికి ముందు తన ఇన్‌స్టా పేజ్‌లో రవి పెట్టిన పోస్టు జనాలను బాగా అట్రాక్ట్ చేస్తోంది. 2021.. ఈ కొత్త ఏడాది చాలా గొప్పగా ఉంది. నెగటివిటీని చంపేసి, పాజిటివిటీ వైపు అడుగులు వేద్దాం. ఎర్రోళ్ల సంతోష్, పూజా రావు అనంత్ కి ధన్యవాదాలు. మా జోడీని స్క్రీన్ మీదకు మళ్లీ తెచ్చినందుకు. లాస్యా మంజునాథ్ కమ్ బ్యాక్ వేరే లెవల్ ఉంది. తనకి కూడా ఆల్ ద బెస్ట్ అంటూ చాలా ఉద్వేగంగా పెట్టాడు పోస్ట్. అటు చానెల్ విడుదల చేసిన ప్రోమో నిజంగానే వేరే లెవల్లో ఉంది.
గేమ్ షో ప్లానింగ్ నుంచి.. లాస్యా, రవి కలుసుకుంటున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో హ్యాపీడేస్ మ్యూజిక్ ప్లే కావడం నుంచి ప్రతిదీ వేరే లెవల్లో ఉంది. అన్నిటికన్నా అందరినీ అట్రాక్ట్ చేసిన విషయం లాస్య కొడుకు జున్ను... రవి కూతురు కలిసి షేక్ హ్యాండ్స్ చేసుకోవడం. ఇంతకు ముందే చెప్పినట్టు వీరి కలయికకు మెయిన్‌గా కృషి చేసింది అభిజిత్ అట. యాంకర్ రవితో అభిజిత్‌కి ఎప్పటి నుంచో పరిచయం ఉందట. హౌస్‌లో లాస్యక్క అంటూ అభి లాస్యకు ఎంత దగ్గరయ్యాడో అందరికీ తెలిసిందే. ఒకరిపట్ల ఒకరికి ఉన్న స్నేహాన్ని గమనించిన అభిజిత్, ఒకరితో ఒకరిని కలపడానికి తనవంతు కృషి చేశాడని, ఈ సంక్రాంతి వారిద్దరి లైఫ్‌లో అంత కలర్‌ఫుల్‌గా, సందడిగా ఉండటానికి కారణం అతనేనని ఇన్‌సైడ్ టాక్.
View this post on Instagram
ఇప్పటికే ప్రోమోలో లాస్యకి రవి చెప్పిన సారీ చూసే ప్రతి ఒక్కరినీ కదిలించింది. వారిద్దరూ కట్టుకున్న ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లు ఎప్పటికీ ముడి విడిపోకుండా ఉండాలనే సంకేతాలను మెండుగానే అందజేస్తున్నాయి. అందరి విషెస్ కలిస్తే ఈ జోడీ యాంకరింగ్ ఫ్యూచర్‌లో మామూలుగా ఉండదన్నమాట.
సో లాస్య అండ్ రవి ఇంకెన్ని షోలలో కలిసి అలరిస్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor lasya, Anchor ravi, Bigg Boss