Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: May 17, 2019, 7:31 AM IST
abcd సినిమా పోస్టర్
అల్లు శిరీష్ హీరోగా సంజీవ్ రెడ్డి తెరకెక్కించిన సినిమా ABCD. ఒక్క క్షణం సినిమా తర్వాత భారీ గ్యాప్ తీసుకుని అల్లు శిరీష్ నటించిన సినిమా ఇది. మే 17న ప్రపంచ వ్యాప్తంగా ABCD విడుదలైంది. ఒక్క రోజు ముందే ఓవర్సీస్లో కూడా భారీగా షోస్ వేసారు దర్శక నిర్మాతలు. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను విడుదల చేయడంతో అంచనాలు కూడా బాగానే పెరిగిపోయాయి. ఇప్పుడు సినిమా టాక్ కూడా పాజిటివ్‌గా రావడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దర్శక నిర్మాతలు.

ఏబిసిడి పోస్టర్
మలయాళంలో హిట్ అయిన సినిమాను అదే పేరుతో ఇక్కడ రీమేక్ చేసాడు అల్లు శిరీష్. మాస్టర్ భరత్ ఈ చిత్రంలో హీరో స్నేహితుడి పాత్రలో నటించాడు. ఈ చిత్రంతోనే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు ఈ కుర్రాడు. ఇక ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం చూస్తుంటే సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా సంజీవ్ రెడ్డి తెరకెక్కించాడు. అయితే ప్రేక్షకులను థియేటర్స్ వరకు రప్పించే స్టామినా అల్లు వారబ్బాయికి ఉందా అనేది అసలు అనుమానం.

అల్లు శిరీష్ ఫైల్ ఫోటో
సినిమా పరంగా మాత్రం ఎలాంటి అనుమానాలు లేవు.. మంచి సినిమా.. కామెడీతో నింపి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు సంజీవ్. ఓవర్సీస్ ఆడియన్స్ కూడా అల్లు శిరీష్ నటనకు ఫిదా అవుతున్నారు. భరత్ కూడా చాలా బాగా నటించాడని చెప్తున్నారు ఓవర్సీస్ ప్రేక్షకులు. కృష్ణార్జున యుద్ధం ఫేమ్ రుక్సర్ మీర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. మరి చూడాలిక.. ఇండియాలో ABCD ఎలాంటి ఫలితాన్ని తీసుకొస్తుందో..?
Published by:
Praveen Kumar Vadla
First published:
May 17, 2019, 7:30 AM IST