news18-telugu
Updated: November 30, 2019, 10:16 AM IST
జబర్దస్త్ సాయి తేజ ఫైల్ ఫోటో (Source: Twitter)
జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సాయితేజ అలియాస్ పింకీ త్వరలో మరో కార్యక్రమంలో కనపడనుంది. పింకీకి సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తాజాగా కమెడియన్ సాయితేజ అలియాస్ పింకీ తెలుగు సీరియల్లో నటించనుంది. ఈ విషయాన్ని స్వయంగా పింకీయే చెప్పింది. జీతెలుగులో ప్రసారం అయ్యే గుండమ్మ కథ సీరియల్లో నటిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంపై తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. తనను ఇన్నాళ్లు ఎంతగానో ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. తాను నటించనున్న కొత్త సీరియల్ కూడా చూడాలని పేర్కొంది.
ఈ విషయంతో పాటు.. పింకీ ఓ ఇంట్లో అంట్లు కడిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఈ విషయంపై కూడా తనను ఫ్యాన్స్ ఎన్నో ప్రశ్నలు వేశారని. ఎవరైనా ఇంట్లో పనిచేస్తున్నావా? అంటూ ప్రశ్నలు వేశారని పేర్కొంది. అయితే అది తన స్నేహితుల ఇల్లేనని.. ఆ ఇంట్లో ఫంక్షన్ అయితే వెళ్లానని .. వారికి సాయంగా అక్కడున్న అంట్లు కడిగానని తెలిపింది. మన పనులు మనం చేసుకోవవడమే మంచిదని తెలపిింది. తాను ఇంట్లో కూడా తనకు సంబంధించిన అన్ని పనుల్ని తానే స్వయంగా చేసుకుంటానని చెప్పింది పింకీ. ఈ మేరకు టిక్ టాక్‌లో క్లారిటీ ఇచ్చింది పింకీ.
Published by:
Sulthana Begum Shaik
First published:
November 30, 2019, 10:15 AM IST