రివ్యూ: ఆటగాళ్లు
నటీనటులు: నారారోహిత్, జగపతిబాబు, దర్శికా బానిక్, బ్రహ్మానందం తదితరులు
రేటింగ్: 2/5
నిడివి: 140 నిమిషాలు
సంగీతం: సాయికార్తిక్
ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేశ్
సినిమాటోగ్రఫీ: విజయ్ సి కుమార్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: పరుచూరి మురళి
కెరీర్ మొదట్నుంచి కూడా తనకంటూ ప్రత్యేకమైన శైలి సృష్టించుకుని అందులోనే సినిమాలు చేస్తున్నాడు నారా రోహిత్. ఆయన సినిమా అంటేకొత్తదనం ఉంటుందనే నమ్మకం కలిగించాడు. కానీ ఈ మధ్య అది పోయింది. వరస ఫ్లాపుల్లో ఉన్న ఈయన ఇప్పుడు ఆటగాళ్లు అంటూ వచ్చాడు. మరి ఈ చిత్రంతో ఈయన ఏం చేసాడు..? ప్రేక్షకులను మెప్పించాడా..?
కథ:
సిద్ధార్థ్(నారా రోహిత్) తెలుగు ఇండస్ట్రీలో పేరు మోసిన దర్శకుడు. ఈయనకు హీరోలతో సమానమైన ఇమేజ్ ఉంటుంది. లైఫ్ హాయిగా సాగిపోతున్న సమయంలో అనుకోకుండా తన భార్య (దర్శిక భానత్) మర్డర్ కేసులోనే ఇరుక్కుంటాడు సిద్ధార్థ్. అన్ని సాక్ష్యాలు కూడా సిద్ధూనే ముద్దాయి అని తేలుస్తాయి. కానీ అదే సమయంలో ఆయన నిర్దోషి అంటూ నిరూపిస్తాడు లాయర్ వీరేంద్ర(జగపతిబాబు). అయితే అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో తాను చేసింది తప్పు.. అసలు నేరస్థుడు సిద్ధార్థే అని వీరేంద్రకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తాడు.. శిక్ష ఎలా పడింది అనేది అసలు కథ..
విశ్లేషణ:
నారా రోహిత్.. జగపతిబాబు.. పరుచూరి మురళి.. ఎవరూ హిట్లలో లేరు. అంతా కలిసి ఇప్పుడు ఆటగాళ్లు అంటూ వచ్చారు. చెప్పుకోడానికి కొత్త కథ అయితే కాదు.. అలాగని ఆసక్తికరమైన కథనం కూడా లేదు. తెలిసిన కథనే మరింత రొటీన్ గా చెప్పేసరికి ఎక్కడా పెద్దగా ఆసక్తికరంగా అనిపించదు ఆటగాళ్లు. తొలి సన్నివేశాన్నే యాక్సిడెంట్ తో ఓపెన్ చేసి ఆసక్తి రేపినా.. ఆ తర్వాత ఆ టెంపో కొనసాగించలేక చేతులెత్తేసాడు దర్శకుడు పరుచూరి మురళి. మరీ ముఖ్యంగా ఫస్టాప్ అయితే చెప్పుకోడానికి ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఆసక్తికరంగా అనిపించదు. పైగా జగపతిబాబు పాత్రనే ఎక్కువగా హైలైట్ చేస్తూ నారా రోహిత్ ను ప్రతీ సీన్ లోనూ తక్కువ చేసాడు దర్శకడు. దానివల్ల కథకు అయినా యూజ్ ఉందా అంటే అది కూడా లేదు.
న్యాయం గెలవాలి అనే ఒక్క ట్యాగ్ లైన్ పట్టుకుని సినిమా అంతా నడిపించాడు. కేస్ టేకప్ చేస్తే ఓడిపోడు అనే పేరున్న లాయర్ ను తన బుర్రతో అంత ఈజీగా ఓ నేరస్థుడు మోసం చేస్తుంటే.. ఏం చేయలేక వేడుక చూడటం నిజంగా విడ్డూరమే. సెకండాఫ్ కూడా ఇలాగే ఎటూ కాకుండా ఉంటుంది. ఆటగాళ్లు అని టైటిల్ పెట్టినందకు ప్రేక్షకులు కచ్చితంగా మైండ్ గేమ్ ఊహిస్తారు. కానీ అది ఈ సినిమాలో కనిపించదు. ఓ సాదాసీదా సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆటగాళ్లును తెరకెక్కించి చేతులు దులిపేసుకున్నాడు దర్శకుడు మురళి. ఫస్టాఫ్ లో కథకు అవసరం లేకుండా బ్రహ్మానందంతో వచ్చే సీన్స్ కానీ.. సెకండాఫ్ లో చాలా వరకు కూడా ఇలాంటి అనవసరం అనిపించే సీన్స్ సహనానికి పరీక్ష పెడుతుంటాయి. ఒకప్పుడు నీ స్నేహం.. పెదబాబు లాంటి సినిమాలు చేసినా ఇప్పుడు మాత్రం పరుచూరి మురళి రేసులో నిలబడటం కష్టమే అనిపిస్తుంది.
నటీనటులు:
నారా రోహిత్ కొంచె కొత్తగా ప్రయత్నించాడు. హీరోగా నటించి బోర్ కొట్టిందేమో ప్రతినాయకుడిగా ప్రయత్నించాడు. ఇక హీరో రోహిత్ కాదు.. జగపతిబాబు అని త్వరగానే అర్థమయ్యేలా చేసాడు దర్శకుడు. ఈయన కూడా ఇలాంటి పాత్రలలో చాలా సార్లు నటించాడు. హీరోయిన్ దర్శిక భానత్ కు పెద్దగా కథతో అవసరం లేకుండా పోయింది. చిన్న పాత్రలోనే ఓ పాట.. కొన్ని సీన్లు ఇచ్చి పాత్రను చంపేసాడు దర్శకుడు. బ్రహ్మానందం నవ్వించకపోగా చిరాకు తెప్పించాడు. మిగిలిన వాళ్లంతా జస్ట్ ఓకే..
టెక్నికల్ టీం:
సాయికార్తిక్ సంగీతం చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఈ సినిమాలో ఆయన కూడా కనిపించాడు. ఆర్ఆర్ అయితే మొత్తం బిగ్బాస్ నుంచి కాపీ కొట్టేసాడు సాయికార్తిక్. సినిమాటోగ్రఫీలో విజయ్ సి కుమార్ ఓకే అనిపించాడు కానీ ఎడిటింగ్ లో మార్తాంక్ కే వెంకటేశ్ అనుభవం కనిపించలేదు. అధినాయకుడు తర్వాత ఇన్నేళ్లు గ్యాప్ తీసుకున్నా పరుచూరి మురళి జాతకం అయితే మారలేదు.
చివరగా ఒక్కమాట:
బాక్సాఫీస్ ఆటలో కనబడని ఆటగాళ్లు..
ఈ మూవీ రివ్యూ కూడా చదవండి..