ప్రేక్షకులను అలరించేందుకు బిగ్‌బాస్ తెలుగు సీజన్-5 సిద్దం అవుతుంది. ఈ షోకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి జనాలు విపరీతమై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సీజన్‌ను ఎవరు హోస్ట్ చేయనున్నారు?, ఎవరెవరు కంటెస్టెంట్లుగా ఉంటారు? అనే ప్రశ్నలు అభిమానుల మదిలో ఉన్నాయి. మరోవైపు కంటెస్టెంట్ల ఎవరనే దానిపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ సాగుతుంది. అయితే కొద్ది రోజుల కిందట ఈ సీజన్‌కు సంబంధించి లోగోను విడుదల చేసిన స్టార్ మా యాజమాన్యం.. తాజాగా ప్రోమోను కూడా విడుదల చేసింది. ఈ ప్రోమో ద్వారా బిగ్‌బాస్ తెలుగు సీజన్-5కు హోస్ట్ ఎవరనే దానిపై స్టార్ మా స్పష్టత ఇచ్చేసింది. బిగ్‌బాస్ తెలుగు 3,4 సీజన్లకు హోస్ట్‌గా చేసిన నాగార్జుననే ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.
ఇక, బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్లు వీరేనంటూ.. సోషల్ మీడియాలో పలువురు సెలబ్రిటీల పేర్లు వైరల్ అవుతున్నాయి. అందులో యాంకర్ రవి, ఇషా చావ్లా, సురేఖా వాణి, యాంకర్ వర్షిణి, నవ్యస్వామి, లోబో, ఆర్జే కాజల్, అనీ మాస్టర్ పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి. వారితో పాటుగా బిగ్‌బాస్ సీజన్-3 లో వరుణ్ సందేశ్-వితిక జంటను తీసుకున్నట్టుగానే ఈ సీజన్లో కూడా ఓ సెలబ్రిటీ కపుల్‌ను తీసుకోనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆట సందీప్, అతని భార్య జ్యోతి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా విస్తృతమైన ప్రచారం సాగుతుంది.
సందీప్, జ్యోతి దంపతులు
ఈ వార్తలకు బలం చేకూర్చేలా ఆట సందీప్ అతని సోషల్ మీడియా అకౌంట్ ఓ పోల్ పెట్టాడు. అందులో తమ జోడిని బిగ్‌బాస్‌లో చూడాలని ఎంత మంది అనుకుంటున్నారు..? అని అడిగాడు. అయితే అందుకు దాదాపు 80 శాతం మంది నుంచి పాజిటివ్ రెస్ఫాన్స్ వచ్చింది. అంతేకాకుండా సందీప్ దంపతుల బిగ్‌బాస్ ఎంట్రీపై స్పందించిన సందీప్.. సస్పెన్స్ అంటూ కామెంట్ చేశాడు.
ఒకవేళ సందీప్ దంపతులను బిగ్‌బాస్ టీమ్ సంప్రదించకుంటే సోషల్ మీడియాలో పోల్ ఎందుకు నిర్వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక, బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంటర్ కావడానికి ముందే ఈ జోడి ఈ రకంగా తమ ప్రమోషన్‌కు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటారనే ప్రచారం సాగుతుంది. అయితే ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతున్న వారిలో.. ఎవరెవరు ఈ సీజన్లో ఉంటారో తెలియాలంటే మాత్రం సీజన్ స్టార్ట్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే. తాజాగా వస్తున్న సమాచారం మేరకు బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ సెప్టెంబర్ రెండవ వారంలో మొదలు కానుందని తెలుస్తోంది. మరోవైపు బిగ్‌బాస్ ఎంట్రీ కోసం యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ కోటి రూపాయల వరకు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో బిగ్ బాస్ టీమ్ ఆయన డిమాండ్‌ను తిరస్కరించిందనే టాక్ వినిపిస్తోంది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.