Home /News /movies /

AASHIQUI HERO RAHUL ROY SUFFERS BRAIN STROKE ON SHOOT IN KARGIL AND ADMITTED IN MUMBAI NANAVATHI HOSPITAL PK

Rahul Roy: బాలీవుడ్ హీరో రాహుల్ రాయ్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. ఐసీయూలో చికిత్స..

ఆషిఖీ హీరో రాహుల్ రాయ్‌కు బ్రెయిన్ స్ట్రోక్ (Rahul Roy)

ఆషిఖీ హీరో రాహుల్ రాయ్‌కు బ్రెయిన్ స్ట్రోక్ (Rahul Roy)

Rahul Raoy brain stroke: 2020 సినిమా ఇండస్ట్రీకి అస్సలు కలిసిరాలేదు. అందుకే ఎవరికైనా అనారోగ్యం అనే మాట వినిపిస్తే చాలు భయపడిపోతున్నారు అభిమానులు. ఇక సినిమా వాళ్ల పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరం లేదు.

2020 సినిమా ఇండస్ట్రీకి అస్సలు కలిసిరాలేదు. అందుకే ఎవరికైనా అనారోగ్యం అనే మాట వినిపిస్తే చాలు భయపడిపోతున్నారు అభిమానులు. ఇక సినిమా వాళ్ల పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. గుండెలు అరచేతుల్లో పెట్టుకుని ఉన్నారు వాళ్లు. ఇప్పటికే ఎంతోమందిని 2020 తీసుకెళ్లిపోయింది. దాంతో ఇప్పటి వరకు వెళ్లిన వాళ్లు చాలు.. ఇక నువ్వు వెళ్లిపో త్వరగా అంటూ 2020ని సాగనంపే పనిలో ఉన్నారంతా. ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు రాహుల్ రాయ్ హాస్పిటల్ పాలయ్యాడు. ‘ఆషిఖీ’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు ఈయన. కేవలం 22 ఏళ్ల వయసులోనే వచ్చిన రాహుల్.. అప్పట్లో ఇండియాను ఊపేసాడు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ సంచలనమే. రాహుల్ ఒక్క సినిమాతోనే స్టార్ అయిపోయాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈయన ఎల్ఏసీ షూటింగ్ కోసం కార్గిల్‌కు వచ్చి అనారోగ్యానికి గురయ్యాడు. అక్కడి వాతావరణం పడక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఈయనకు. దాంతో వెంటనే చిత్రీకరణకు స్వస్తి చెప్పి ముంబైలోని నానావతిలో రాహుల్ రాయ్‌ను చేర్పించారు.
ఆషిఖీ హీరో రాహుల్ రాయ్‌కు బ్రెయిన్ స్ట్రోక్ (Rahul Roy)

ఈ విషయాన్ని రాహుల్ తమ్ముడు రోమీర్ రాయ్ స్పష్టం చేసాడు. ప్రస్తుతం ఈయన ఐసియూలో ఉన్నాడు. కంగారు పడాల్సిన పనేం లేదని.. రాహుల్ ప్ర‌స్తుతం ఐసీయూలో ఉన్నా కోలుకుంటున్నాడని తెలిపాడు. అతడి ఆరోగ్యానికి వచ్చిన ప్రమాదమేం లేదని వైద్యులు వెల్లడించినట్లు చెప్పాడు రోమీర్ రాయ్. ఇప్పుడిప్పుడే ఆయ‌న‌ స్పృహలోకి వస్తున్నట్లు తెలిపాడు. రాహుల్ బ్రెయిన్ స్ట్రోక్ న్యూస్ తెలుసుకుని బాలీవుడ్ ఉలిక్కిపడింది. ఆయనకు కరోనా టెస్టులు కూడా చేయగా నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు కుటుంబ సభ్యులు.
rahul roy kargil movie shoot brain stroke,rahul roy brain stroke,rahul roy had brain stroke,superstar actor had brain stroke,rahul roy suffering from brain stroke,aashiqui rahul roy,actor rahul roy,rahul roy aashiqui movie songs,bigg boss winner had brain stroke,aashiqui 2 movie songs,ఆషిఖీ హీరో రాహుల్ రాయ్‌కు బ్రెయిన్ స్ట్రోక్,బిగ్ బాస్ విన్నర్ రాహుల్ రాయ్‌కు బ్రెయిన్ స్ట్రోక్
ఆషిఖీ హీరో రాహుల్ రాయ్‌కు బ్రెయిన్ స్ట్రోక్ (Rahul Roy)

2006లో మొదలైన బిగ్ బాస్ తొలి సీజన్ కంటెస్టెంట్ కమ్ విన్నర్ రాహుల్ రాయ్. ఆ అరుదైన రికార్డు కూడా ఈయన సొంతం చేసుకున్నాడు. ఆషిఖీ తర్వాత ఎందుకో రాహుల్‌కు చెప్పుకోదగ్గ అవకాశాలు అయితే రాలేదు. అడపాదడపా సినిమాలు చేయడం.. టీవీ షోలతోనే కెరీర్ వెల్లదీస్తున్నాడు ఈయన. రాహుల్ రాయ్ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని అభిమానులు దేవున్ని ప్రార్థిస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bollywood, Hindi Cinema

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు