Home /News /movies /

AARADUGULA BULLET TRAILER RELEASED GOPICHAND NAYANTHARA GOT SUCCESS THIS TIME TA

Gopichand - Aaradugula Bullet : గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ ట్రైలర్ విడుదల..

ఆరడుగుల బుల్లెట్ ట్రైలర్ విడుదల (Twitter/Photo)

ఆరడుగుల బుల్లెట్ ట్రైలర్ విడుదల (Twitter/Photo)

Gopichand - Aaradugula Bullet : మాచో స్టార్ గోపీచంద్ తాజాగా స్పోర్ట్స్ డ్రామా సీటిమార్ (Seetimaarr)తో వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. 2015లో రిలీజ్ దగ్గరకు వచ్చి చివరి నిమిషంలో పలు కారణాల చేత రిలీజ్ ఆగిపోయిన ఆరడుగుల బుల్లెట్ ఈ నెల 8న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసారు.

ఇంకా చదవండి ...
  Gopichand - Aaradugula Bullet : మాచో స్టార్ గోపీచంద్ తాజాగా స్పోర్ట్స్ డ్రామా సీటిమార్ (Seetimaarr)తో వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహించారు. అనేక అవాంతరాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. (Seetimaarr)  'సీటీమార్' కథ విషయానికి వస్తే.. గ్రామీణ ప్రాంతంలో ఉన్న కొందరి యువతులను ఎలా ఛాంపీయన్స్‌గా మార్చారు.. దానికోసం ఎలాంటీ కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందనేది కథగా కనిపిస్తోంది. ఈ సినిమాలో ఆంధ్ర ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా  (Tamannaah ) నటించారు.

  అది అలా ఉంటే సీటీమార్’ సక్సెస్‌తో ఎపుడో థియేటర్స్‌లో రిలీజ్ కావాల్సిన గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. ఈ సినిమాను తెలుగులో ‘సమర సింహా రెడ్డి’, ‘నరసింహనాయుడు’, ’ఇంద్ర’ వంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బి.గోపాల్  డైరెక్ట్ చేసారు. నాలుగేళ్ల క్రితం థియేటర్స్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఫైనాన్షియల్ కారణాల వల్ల విడుదల కాలేదు. మధ్యలో ఈ సినిమాను ఓటీటీలో కూడా రిలీజ్ చేయడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు ఉన్న అడ్డంకులు తొలిగాయి. ఈ సినిమాలో గోపీచంద్ సరసన నయనతార హీరోయిన్‌గా నటించారు. తాజాగా  ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు.


  అపుడెపుడే నాలుగేళ్ల క్రితం విడుదల చేసిన ట్రైలర్‌ను కొత్తగా యూట్యూబ్‌లో విడుదల చేసారు. అల్లరి చిల్లరిగా తిరిగే శివ అనే  కుర్రాడు.. ఎలాంటి పనీ పాటా లేకుండా తండ్రి భారమవుతాడు.  ఎపుడు తండ్రితో తిట్లు తింటూ ఉండే హీరో విజయవాడలో పుట్టి హైదరాబాద్‌లో పెరుగుతాడు. ఈ నేపథ్యంలో విజయవాడలో ఉండే ఓ రౌడీతో వాళ్ల ప్రభుత్వాధికారి అయిన ఆయన తండ్రికి ఓ విషయంలో గొడవ అవుతోంది. ఈ నేపథ్యంలో రౌడీలో హీరో తండ్రిపై దాడికి పాల్పడుతుంటే.. హీరో వచ్చి విలన్స్‌ను చితకబాదుతాడు. పాత సినిమాల్లోని రొటీన్ మాస్ మసాలా ఫార్ములాతో ఈ సినిమాను తెరకెక్కించారు.

  Venkatesh Multistarers : అబ్బాయి రానా సహా వెంకటేష్ ఇతర హీరోలతో చేసిన మల్టీస్టారర్ మూవీస్ ఇవే..

  2015లో రిలీజ్ దగ్గరకు వచ్చి చివరి నిమిషంలో పలు కారణాల చేత రిలీజ్ ఆగిపోయిన ఆరడుగుల బుల్లెట్ ఈ నెల 8న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా వెలువడింది.వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాకు అబ్బూరి రవి మాటలు అందించారు.

  Hit Movie Remake Bollywood: అధికారికంగా ప్రారంభమైన ’హిట్’ హిందీ రీమేక్.. బాలీవుడ్‌లో సౌత్ సినిమాల హంగామా..

  మణిశర్మ సంగీతం అందించారు. నాలుగేళ్లుగా ల్యాబులో ఉండిపోయిన ఈ సినిమా థియేటర్స్‌లో ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి. ఈ సినిమాను తాండ్ర రమేష్ నిర్మించగా.. బి గోపాల్ దర్శకత్వం వహించారు.

  Bollywood 2022 Release Movies : ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సహా బాలీవుడ్‌లో విడుదల కాబోతున్న టాలీవుడ్ హీరోల ప్యాన్ ఇండియా మూవీస్ ఇవే..

  ఇక గోపీచంద్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ పక్కా కమర్షియల్ అనే సినిమాలో నటిస్తున్నారు. రాశీ ఖన్నా హీరోయిన్‌గా చేస్తోంది. అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్‌ఫుల్ బ్యానర్స్ జీఏ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్ నిర్మాణంలో బ‌న్నీవాసు నిర్మిస్తున్నారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Aaradugula Bullet, B.Gopal, Gopichand, Nayanthara, Tollywood

  తదుపరి వార్తలు