డిస్నీ+ హాట్‌స్టార్ వారి కొత్త హాట్‌స్టార్ స్పెషల్స్ "ఆర్ యా పార్" (Aar Ya Paar trailer) ట్రైలర్‌ను తమిళం, తెలుగులో విడుదల చేశారు. తమ తెగను కాపాడుకుంటూ ఆధునిక ప్రపంచంలో మనుగడ కోసం ప్రయత్నిస్తున్న అండర్‌డాగ్ కథ ఇది. ఈ యాక్షన్ డ్రామా సిరీస్‌ను సిద్ధార్థ్ సేన్‌గుప్తా (Siddarth sen guptha) రూపొందించగా, జ్యోతి సాగర్ (Jyothi Sagar) మరియు సిద్ధార్థ్ సేన్‌గుప్తా ఎడ్జ్‌స్టార్మ్ వెంచర్స్ LLP పతాకంపై నిర్మించారు. గ్లెన్ బారెట్టో, అంకుష్ మోహ్లా మరియు నీల్ గుహ దర్శకత్వం వహించారు.
డిసెంబర్ 30, 2022 న డిస్నీ+ హాట్‌స్టార్‌లో హిందీలో విడుదల కాబోతున్న ఈ ప్రాజెక్ట్ తమిళం, హిందీ, తెలుగు, మరాఠీ, కన్నడ, బెంగాలీ మరియు మలయాళం లో కూడా డబ్ కానుంది. హై పేస్డ్ యాక్షన్ డ్రామా గా విడుదల కాబోతున్న ఈ సిరీస్ లో ఆదిత్య రావల్, పత్రలేఖ, సుమీత్ వ్యాస్, ఆశిష్ విద్యార్థి, దిబ్యేందు భట్టాచార్య, ఆసిఫ్ షేక్, శిల్పా శుక్లా, వరుణ్ భగత్, నకుల్ సెహ్‌దేవ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఆదిత్య రావల్ పోషించిన సర్జూ ప్రయాణమే ఈ సిరీస్. విలు విద్యలో అద్భుతమైన ప్రతిభ ఉన్న గిరిజన వ్యక్తి తన తెగ మనుగడ కోసం ఆధునిక ప్రపంచం, దాని అవినీతి రాజకీయ మరియు ఆర్థిక యంత్రాంగానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఘోరమైన కిరాయి హంతకుడుగా మారతాడు. ఎంతో ఆసక్తికరంగా ఈ కథ ఉండనుందట.
ఈ సందర్భంగా నటుడు ఆదిత్య రావల్ మాట్లాడుతూ.. “ఒక పాత్రగా సర్జూ తన భూమిని, తన ప్రజలను రక్షించాలని కోరుకుంటాడు. తన లక్ష్యాన్ని సాధించడానికి ఎంత దూరం అయినా వెళ్తాడు. ఈ ప్రయాణంలో ఒకదాని తర్వాత మరొక సవాళ్లతో వ్యవహరించేటప్పుడు పాత్ర యొక్క విభిన్న ఛాయలు కనిపిస్తాయి. హాట్‌స్టార్ స్పెషల్స్ ఆర్ యా పార్‌లో సర్జూ పాత్రలో నటించే అవకాశాన్ని నాకు కల్పించినందుకు సిద్ధార్థ్ సేన్‌గుప్తా మరియు డిస్నీ+ హాట్‌స్టార్‌లకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను," అని అన్నారు.
ఆర్ య పార్ మూవీ హిందీలో అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత తమిళం, తెలుగు, మరాఠీ, కన్నడ, బెంగాలీ మరియు మలయాళంలో డబ్ చేయబడుతుంది అని మేకర్స్ అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Disney+ Hotstar, Hot star, Tollywood