Home /News /movies /

AAMIR KHAN TO GRACE RRR EVENT IN THE IMPERIAL HOTEL LAWNS IN DELHI HERE ARE THE DETAILS SR

RRR | Aamir Khan : ఆర్ ఆర్ ఆర్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హిందీ సూపర్ స్టార్ అమీర్ ఖాన్..

NTR Ram Charan RRR Movie Photo : Twitter

NTR Ram Charan RRR Movie Photo : Twitter

RRR : ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం)  (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

ఇంకా చదవండి ...
  ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం)  (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో టీమ్ ప్రమోషన్స్‌లో భాగంగా దేశంలో పలు పట్టణాలతో పాటు నగరాల్లో పర్యటనలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఢిల్లీలో ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఓ ప్రమోషన్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్లాన్ చేసింది. ఈ కార్యక్రామానికి హిందీ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ చీఫ్ గెస్ట్‌గా వస్తున్నారు. దీనికి సంబంధించి ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఓ ప్రకటనను ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది. ఢీల్లీలోని ఇంపీరియల్ లాన్స్‌లో సాయంత్రం ఏడు గంటలకు నిర్వహించనున్న ప్రమోషనల్ కార్యక్రమానికి అమీర్ ఖాన్ రానున్నారని తెలిపింది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న కర్నాటకలోని చిక్కబల్లాపురాలో భారీగా ప్రిరిలీజ్ ఈవెంట్‌ను జరిపారు. ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా కర్నాటక ముఖ్య మంత్రి బస్వారాజ్ బొమ్మై వచ్చిన సంగతి తెలిసిందే.

  ఆర్ ఆర్ ఆర్ టీమ్ ప్రమోషన్స్‌లో భాగంగా తొమ్మిది నగరాల్లో పర్యటించనున్నారు. మార్చి 18న హైదరాబాద్‌తో పాటు దుబాయ్‌లో ప్రచారం. మార్చి 19న బెంగళూరులో ప్రిరిలీజ్ ఈవెంట్. మార్చి 20న బరోడా, ఢిల్లీలో పర్యటన. మార్చి 21న అమృత్‌సర్‌తో పాటు జైపూర్‌లో ప్రచారం చేయనున్నారు. మార్చి 22న కోల్‌కతా, వారణాసిలో, మార్చి 23న చివరగా హైదరాబాద్‌లో ప్రమోషనల్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో దర్శకుడు, నిర్మాతలతో పాటు హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్‌లు పాల్గోననున్నారు. ఇక ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల హుషారైనా పాట ఎత్తర జెండా వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట ను విశాల్ మిశ్రా, పృధ్వీ చంద్ర, ఎంఎం కీరవాణి, సాహితి చాగంటి, హారిక నారాయణ్‌లు పాడారు. హుషారుగా సాగుతున్న ఈ పాటు ఆర్ ఆర్ ఆర్ అభిమానులకి మరింత ఎనర్జీ ఇచ్చేలా ఉంది.


  ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదలవుతోంది. కాగా ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ చరణ్ ఆలియాల మధ్య ఓ సూపర్ రోమాంటిక్ పాటను రాజమౌళి చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ పాట డైరెక్ట్‌గా సినిమాలో ఓ సర్పైజ్ ఎలిమెంట్‌లాగా ఉండనుందని అంటున్నారు.

  Tamannaah Bhatia : సముద్ర తీరాన తమన్నా.. సూపర్ కూల్ లుక్‌లో మిల్కీ అందం... పిక్స్ వైరల్..

  ఇక మరోవైపు ఈ సినిమా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో కూడా విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో రిలీజ్ కావడంలేదు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రసాద్స్ ఐమ్యాక్స్‌లో ఈ సౌలభ్యం లేకపోవడంతో ఈ సినిమాను చూడాలనే వారికి ఇది చేదువార్తనే చెప్పోచ్చు. ఇక ఈ సినిమాను యూకేలోని ఓడియన్ బీఎఫ్ఐ ఐమ్యాక్స్ థియోటర్స్ ప్రీమియర్ షోగా ప్రదర్శించనున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్‌పై ప్రదర్శించనున్నట్టు తెలుస్తుంది. ఇక యూకేలోని వెయ్యి స్క్రీన్స్‌లో (RRR) ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల చేస్తున్నారట. ఇక ఆర్ ఆర్ ఆర్  (RRR) విషయానికి వస్తే.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ (Olivia Morris, Alia Bhatt) నటించారు.  అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు ఈ  (RRR) చిత్రం ఓటిటి రిలీజ్‌ ఎప్పుడు ఉండనుందో అనే విషయంలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయికాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఆర్ ఆర్ ఆర్  (RRR) విడుదలైన 60 రోజులకు ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని అంటున్నారు.ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

  ఆర్ ఆర్ ఆర్ సినిమాకు (Rated U/A) U/A సర్టిఫికెట్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమా టోటల్ రన్ మూడు గంటల ఆరు నిమిషాలు వచ్చింది. ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బుకింగ్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇప్పటికే యూఎస్‌లో ఎన్టీఆర్ ఓ అభిమాని ఏకంగా థియేటర్ నే బుక్ చేయడం విశేషం. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనే ముందు రోజే స్పెషల్ షోస్ వేయనున్నట్టు సమాచారం. ఈ సినిమా నార్త్‌ ఇండియన్‌ థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ ను ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: NTR, Rajamouli, Ram Charan, RRR

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు