#మూవీరివ్యూ: ‘థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్’.. తీరం లేని ప్రయాణం..

అమీర్ ఖాన్ సినిమా అంటే అదో తెలియ‌ని ఆనందం ప్రేక్ష‌కుల్లో ఉంటుంది. ఆయ‌న సినిమా చేస్తున్నాడు అంటే చాలు బాక్సాఫీస్ పూన‌కం వ‌చ్చిన‌ట్లు ఊగిపోతుంది. దంగ‌ల్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని ఇప్పుడు థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ అంటూ వ‌చ్చాడు అమీర్. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది..? అంచ‌నాలు అందుకుందా...?

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 8, 2018, 3:25 PM IST
#మూవీరివ్యూ: ‘థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్’.. తీరం లేని ప్రయాణం..
థగ్స్ ఆఫ్ హిందోస్థాన్ మూవీ
Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 8, 2018, 3:25 PM IST
న‌టీన‌టులు: అమీర్ ఖాన్, అమితాబ్ బ‌చ్చ‌న్, క‌త్రినా కైఫ్. ఫాతిమా స‌నా షైక్ త‌దిత‌రులు
రేటింగ్: 2.25/5
నిడివి: 2 గంట‌ల 44 నిమిషాలు

నిర్మాత‌: ఆదిత్య చోప్రా
క‌థ, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: విజ‌య్ కృష్ణ ఆచార్యఅమీర్ ఖాన్ సినిమా అంటే అదో తెలియ‌ని ఆనందం ప్రేక్ష‌కుల్లో ఉంటుంది. ఆయ‌న సినిమా చేస్తున్నాడు అంటే చాలు బాక్సాఫీస్ పూన‌కం వ‌చ్చిన‌ట్లు ఊగిపోతుంది. దంగ‌ల్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని ఇప్పుడు థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ అంటూ వ‌చ్చాడు అమీర్. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది..? అంచ‌నాలు అందుకుందా...?

క‌థ‌:
Loading...
వ్యాపారం పేరుతో భార‌త‌దేశానికి 1795లో ఆంగ్లేయులు వ‌స్తారు. ఇండియా అంతా కొల్ల‌గొడ‌తారు కానీ ఒక్క రోన‌క్ పూర్ మాత్రం వాళ్ల సొంతం కాదు. అక్క‌డ మ‌హారాజు మొండిగా పోరాడుతుంటాడు. దాంతో స్వ‌యంగా బ్రిటీష్ రాజు క్లైవ్ రంగంలోకి దిగి దాన్ని సొంతం చేసుకుంటాడు. ఆ క్ర‌మంలోనే అంద‌ర్నీ చంపేస్తాడు. కానీ ఆ యుద్ధంలో ఆ రాజ్య‌పు రాణి జ‌హీరా(ఫాతిమా స‌నా)ను త‌న ప్రాణాలు అడ్డుపెట్టి బ‌తికిస్తాడు ఆజాద్(అమితాబ్). ఆ త‌ర్వాత ప‌గ‌తో పెరుగుతుంది జ‌హీరా. ఎలాగైనా క్లైవ్ ను అంత‌మొందించి స్వాతంత్ర్యం తేవాల‌నుకుంటారు. వాళ్ల‌కు మోస‌గాడు అయిన ఫిరంగీ (అమీర్ ఖాన్ )ప‌రిచ‌యం అవుతాడు. అత‌డి సాయంతో వాళ్లు మ‌ళ్లీ ఎలా స్వాతంత్ర్యం తెచ్చుకున్నారు అనేది క‌థ‌.

విశ్లేష‌ణ‌:
ఇండిపెండెన్స్ అనే కాన్సెప్ట్ తో వ‌చ్చిన సినిమాల‌కు ముఖ్యంగా కావాల్సంది ఎమోష‌న్. అది ఉంటే ఇట్టే క‌నెక్ట్ అయిపోతారు ప్రేక్ష‌కులు. కానీ థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ లో లేనిది ఇదే. ఎక్క‌డా క‌థ‌లో సీరియ‌స్ నెస్ క‌నిపించ‌దు. ఎమోష‌న‌ల్ సీన్స్ కూడా ఎందుకో తెలియ‌దు కానీ అస్స‌లు క‌నెక్ట్ కాలేదు. పైగా అమీర్ ఖాన్ లాంటి హీరో ఇలాంటి క‌థ‌ను ఎలా ఎంచుకున్నాడా అనే అనుమానం చూస్తున్నంత సేపు వ‌స్తుంది. అలాంటి సాదా సీదా క‌థ‌కు ఓకే చెప్పాడు అమీర్ ఖాన్. తొలి అర‌గంట కారెక్ట‌ర్ ఇంట్రో కోసం కాస్త నెమ్మ‌దిగా క‌థ మొద‌లుపెట్టాడు ద‌ర్శ‌కుడు. ప‌ది నిమిషాల్లోనే తాను చెప్పాల‌నుకున్న‌ది చెప్పాడు. ఆ త‌ర్వాత అస‌లు క‌థ‌లోకి వెళ్లాడు. అయితే అప్ప‌ట్నుంచి అస‌లు క‌థ గాడి త‌ప్పి.. మ‌రో క‌థ మొద‌లైంది.
అమీర్ ఖాన్ ఎంట్రీ త‌ర్వాత క‌థ మ‌రింత నెమ్మ‌దించింది. అత‌డి పాత్ర‌ను చాలా టిపికల్ గా రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు విజ‌య్. అయితే ఆస‌క్తి క‌రంగా సాగాల్సిన క‌థ‌ను ప్ర‌తీసారి అమీర్ దారి త‌ప్పించాడు అంటే న‌మ్మ‌బుద్ది కాదు. ఇంట‌ర్వెల్ వ‌ర‌కు కూడా ఎలాంటి మ‌లుపులు లేకుండా సాగిన క‌థ త‌ర్వాత కాస్త జోరు అందుకున్న‌ట్లు క‌నిపిస్తుంది. అయితే యుద్ధం త‌ర్వాత మ‌ళ్లీ క‌థ మొద‌టికి వ‌స్తుంది. సెకండాఫ్ అయితే పూర్తిగా గాడి త‌ప్పిన క‌థ మ‌రింత నీర‌సంగా సాగుతుంది. కేవ‌లం యాక్ష‌న్ స‌న్నివేశాలు మాత్ర‌మే అల‌రించాయి.. అవి కాకుండా ఒక్క‌టి కూడా అల‌రించే సీన్ లేక‌పోవ‌డం థ‌గ్స్ కు అతిపెద్ద మైన‌స్. క్లైమాక్స్ కూడా తేలిపోయింది. క‌థ లేక కేవ‌లం యాక్ష‌న్ సీన్స్ మాత్ర‌మే న‌మ్ముకున్నాడు ద‌ర్శ‌కుడు విజ‌య్ కృష్ణ ఆచార్య‌. ఓవ‌రాల్ గా విజువ‌ల్స్ ఉన్నా విష‌యం లేక తేలిపోయారు ఈ బందిపోట్లు.

న‌టీన‌టులు:
అమీర్ ఖాన్ గొప్ప‌గా న‌టించాడు. అయితే ఎందుకో తెలియ‌దు కానీ ఆయ‌న పాత్ర‌ను ద‌ర్శ‌కుడు స‌రిగ్గా డీల్ చేయ‌లేక‌పోయాడేమో అనిపించింది. ప్ర‌తీ సీన్ లోనూ కామెడీ చేస్తూ సీరియ‌స్ సీన్స్ కూడా చిరాకు తెప్పించాడు అమీర్. న‌ట‌న ప‌రంగా ఓకే కానీ కారెక్ట‌ర్ బాగోలేదు. అమితాబ్ బ‌చ్చ‌న్ అదుర్స్ అనిపించాడు. ఆయ‌న మ‌రోసారి త‌న పాత్ర‌కు ప్రాణం పోసాడు. క‌త్రినా కైఫ్ జ‌స్ట్ గెస్ట్ రోల్ చేసింది. దంగ‌ల్ లో అమీర్ కూతురుగా న‌టించిన ఫాతిమా షైక్ ఇందులో యుద్ద‌నారిగా అల‌రించింది. మిగిలిన వాళ్లంతా జ‌స్ట్ ఓకే..

టెక్నిక‌ల్ టీం:
అతుల్ అజ‌య్ సంగీతం సినిమాకు పెద్ద‌గా క‌లిసిరాలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. ముఖ్యంగా యాక్ష‌న్ సీన్స్ లో అదిరిపోయే ఆర్ఆర్ ఇచ్చారు అతుల్ అజ‌య్. స్టీవార్ట్ కూడా నేప‌థ్య సంగీతం అందించాడు. ఇక ఎడిటింగ్ చాలా వీక్ అనిపించింది. చాలా సీన్స్ బోర్ కొట్టించాయి. పైగా 2 గంట‌ల 45 నిమిషాల సినిమా మ‌రింత దారుణం. యాక్ష‌న్ డిపార్ట్ మెంట్.. విజువ‌ల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ప‌నిచేసారు. సినిమాకు కాస్తో కూస్తో సేవియ‌ర్స్ వాళ్లే. ఇక సినిమాటోగ్ర‌ఫీ ప‌ర్లేదు. ద‌ర్శ‌కుడిగా విజ‌య్ కృష్ణ ఆచార్య కాస్ట్ మిస్టేక్ చేసాడు. 300 కోట్ల‌తో నాసీర‌కం సినిమా చేసి చూపించాడు. ధూమ్ 3 లోనే కంటెంట్ లేక‌పోయినా క‌మ‌ర్షియ‌ల్ గా వ‌ర్క‌వుట్ అయింది కానీ ఈ సారి వ‌ర్క‌వుట్ అయ్యేలా క‌నిపించడం లేదు. య‌శ్ రాజ్ ఫిల్మ్ నిర్మాణ విలువలు అత్యున్న‌తంగా ఉన్నాయి.

చివ‌ర‌గా ఒక్క‌మాట‌:
థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్.. గాలివాన‌లో వాన‌నీటిలో ప‌డ‌వ ప్ర‌యాణం..
First published: November 8, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...