అభిమానులకు ఆమీర్ బహిరంగ క్షమాపణలు

news18-telugu
Updated: November 27, 2018, 11:33 AM IST
అభిమానులకు ఆమీర్ బహిరంగ క్షమాపణలు
థగ్స్ ఆప్ హిందోస్థాన్ మూవీలో ‘పిరంగి’ పాత్రలో ఆమీర్ (Image: Yash Raj Films)
  • Share this:

ఈ యేడాది బాలీవుడ్‌లో ఎన్నో అంచనాలతో రూ.300 కోట్ల అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’ మూవీ అభిమానుల అంచనాలను తలకిందలు చేస్తూ...ఈ యేడాది బాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో...అమితాబ్ బచ్చన్, ఆమీర్ ఖాన్ వంటి అగ్రనటులు ఫస్ట్ టైమ్ కలిసి నటించిన ఈ చిత్రం సామాన్య ప్రేక్షకులను సైతం నిరాశకు గురిచేసింది.


‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ ఫ్లాప్ అవ్వడంపై పూర్తి బాధ్యత నాదే అంటూ తాజాగా ఈ చిత్ర హీరో ఆమీర్ ఖాన్ మీడియా ముఖంగా అభిమానులకు, ప్రేక్షకులకు సారీ చెప్పాడు. ఐతే ఈ సినిమాను ఇష్టపడిన ప్రేక్షకులూ ఉన్నారు. వారికి మేం కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాం. కానీ మెజారిటీ ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చలేదు. కాబట్టి  మా ప్రయత్నంలోనే లోపం ఉందని ఒప్పుకుంటున్నానన్నారు. అంతేకాదు నా సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులకు నేను ఎంటర్టైన్ చేయలేకపోయాను. అందుకే వాళ్లందరికీ నేను మీడియా ముఖంగా క్షమాపణలు చెబుతున్నాను.
థగ్స్ ఆఫ్ హిందోస్థాన్ మూవీ


ఆడియన్స్‌కు ఈ సినిమా ఎందుకు నచ్చలేదన్న విషయాన్ని నేను మాట్లాడదలుచుకోలేదు. ఈ సినిమాల నా బిడ్డలాంటిది. అది విఫలమైంది కాబట్టి..నేనూ విఫలమయ్యాను. ఈ సినిమాను వచ్చే నెలలో చైనాలో విడుదల కానుంది. ఈ సినిమాను అక్కడి ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలన్నారు. దీపావళి కానుకగా విడుదలైన ఈ మూవీ ఇప్పటి వరకు రూ.140 కోట్లను మాత్రమే వసూలు చేసింది.
 

First published: November 27, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>