Home /News /movies /

AAMIR KHAN LAAL SINGH CHADDHA MOVIE SPECIAL PREVIEW FOR CHIRANJEEVI NAGARJUNA AND ALLU ARJUN MANY TOLLYWOOD CELEBRITIES TA

Laal Singh Chaddha : ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’ మూవీపై చిరంజీవి, నాగార్జున మార్క్ రివ్యూ..

లాల్ సింగ్ చడ్డా మూవీపై చిరు, నాగార్జునల రివ్యూ (Twitter/Photo)

లాల్ సింగ్ చడ్డా మూవీపై చిరు, నాగార్జునల రివ్యూ (Twitter/Photo)

Laal Singh Chaddha : ఆమీర్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లాల్ సింగ్ చడ్ఢా’. తాాజగా ఈ సినిమాకు ప్రీమియర్స్‌ను హైదరాబాద్‌లో AMBలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిరంజీవి, నాగార్జునతో పాటు తదితరులు ఈ సినిమా చూసి తమదైన రివ్యూ ఇచ్చారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India
  Laal Singh Chaddha Special Preview For Tollywood Celebrities | మెగాస్టార్ చిరంజీవి సమర్పణ (తెలుగు) లో వయాకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చ‌ర్స్, ఆమీర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై  ఆమీర్ ఖాన్, అక్కినేని నాగ చైతన్య,కరీనా కపూర్ నటీ నటులుగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారేలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘లాల్ సింగ్ చెడ్డా’. హాలీవుడ్ లో సూపర్ హిట్ అయినటువంటి ఫారెస్ట్ గంప్ సినిమా ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా కొరకు ప్రేక్షకులు ఎంతో క్యూరియాసిటీ గా ఎదురు చూస్తున్నారు.ఇందులో టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య బాలరాజు గా కీలక పాత్రలో అమీర్ ఖాన్ తో కలిసి సైనికుడిగా కనిపిస్తున్నారు .ఇప్పటికే బాలీవుడ్ లో విడుదలైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చాయి. తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండడం విశేషం.

  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ ఏ ఎమ్ బి స్క్రిన్స్ లో జ‌రిగిన
  సెల‌బ్రెటి స్పెష‌ల్ ప్రిమియ‌ర్ షో, అట్ట‌హాసంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి, మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ష‌నిస్ట్ ఆమిర్ ఖాన్, కింగ్ అక్కినేని నాగార్జున‌, నాగ‌చైతన్య‌, నిర్మాత అల్లు అర‌వింద్, యంగ్ హీరోలు సాయితేజ్, అల్లు శిరీష్, కార్తికేయ‌, ద‌ర్శ‌కులు మారుతి, హ‌రీశ్ శంక‌ర్, నిర్మాత‌లు సురేశ్ బాబు త‌దిత‌రులు హ‌జ‌రైయ్యారు.  ప్రిమియ‌ర్ షో అనంత‌రం, ప్రిమియ‌ర్ షోకి వ‌చ్చిన అతిధుల‌ను ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..

  గ‌తంలో చెప్పిన‌ట్లుగానే అమీర్ ఖాన్ అంటే నాకెంతో ఇష్టం. ఆమీర్ సినీ ఇండస్ట్రీ కి ఒక ఖజానా లాంటి యాక్టర్ మాత్రమే కాదు భారత దేశంలో ఒక గర్వించదగ్గ నటుడు. మ‌ళ్లీ మ‌ళ్లీ చెబుతున్నా ఈ చిత్రాన్ని నేను తెలుగులో స‌గౌర‌వంగా స‌మ‌ర్పిస్తున్నాను. ఓ బాధ్య‌త‌గా ఫీల్ అవుతున్నాను. అలానే ఈ చిత్రంలో నాగ‌చైత‌న్య పాత్ర కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆ పాత్ర‌ల‌కు తెలుగు ప్రేక్ష‌కుల బాగా ఎమోష‌న‌ల్ గా క‌నెక్ట్ అవుతారు. మంచి సినిమాలు వ‌స్తే తెలుగు ప్రేక్ష‌కులు క‌చ్ఛితంగా ఆద‌రిస్తార‌నే విష‌యం మ‌ళ్లీ మ‌ళ్లీ రుజువు అవుతూనే ఉంది. తాజాగా విడుద‌లైన బింబిసార‌, సీతార‌మం చిత్రాల్ని తెలుగు ప్రేక్ష‌కులు విశేషంగా ఆద‌రించడం నాలా చాలా ఆనందంగా ఉంది. ఇదే రీతిన ఆగ‌స్ట్ 11న విడుద‌ల కాబోతున్న లాల్ సింగ్ చెడ్డాని కూడా ప్రేక్ష‌కులు ఆదరిస్తార‌నే నేను మ‌నఃస్పూర్తిగా న‌మ్ముతున్నాను. మరోవైపు నాగార్జున మాట్లాడుతూ.. ఒక మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రంతో నాగ చైతన్య హిందీలో ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు.

  Jr NTR : ఈ విషయంలో రామ్ చరణ్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న ఎన్టీఆర్..


  ఆమీర్ ఖాన్ మాట్లాడుతూ...

  ఈ ప్రీమియ‌ర్ షో కి వ‌చ్చిన వారంద‌రికీ ప్ర‌త్యేకంగా కృతజ్ఞ‌త‌లు. మీ అంద‌ర‌కి ఈ సినిమా న‌చ్చింద‌ని భావిస్తున్నాను. నేను అడిగిన వెంట‌నే ఈ సినిమాను తెలుగులో స‌మ‌ర్పించ‌డానికి అంగీక‌రించిన మెగాస్టార్ చిరంజీవికి ధ‌న్య‌వాదాలు. అలానే నా చిర‌కాల మిత్రులు ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్ని తెలుగులో డిస్ట్రీబ్యూట్ చేయ‌డం నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది. నాగ‌చైత‌న్య చేసిన బాల‌రాజు పాత్ర ఈ సినిమాలో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. నా గ‌త చిత్రాల్ని తెలుగు ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఆద‌రించారు. ఇదే రీతిన లాల్ సింగ్ చెడ్డాని కూడా ఆద‌రిస్తార‌ని నేను విశ్వసిస్తున్నాను.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Aamir Khan, Bollywood news, Chiranjeevi, Laal Singh Chaddha, Tollywood

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు