రివ్యూ : లాల్ సింగ్ చడ్డా (Laal Singh Chaddha)
నటీనటులు : ఆమీర్ ఖాన్, నాగ చైతన్య, కరీనా కపూర్, మోనా సింగ్ తదితరులు..
ఎడిటర్: హేమంతి సర్కార్
సినిమాటోగ్రఫీ: సత్యజిత్ పాండే
సంగీతం: తనుజ్ టికు
నిర్మాత : ఆమీర్ ఖాన్, కిరణ్ రావు, వయాకామ్ 18 స్టూడియోస్
దర్శకత్వం: మల్లిడి వశిష్ఠ్
విడుదల తేది : 11/8/2022
మెగాస్టార్ చిరంజీవి సమర్పణ (తెలుగు) లో వయాకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, ఆమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆమీర్ ఖాన్, అక్కినేని నాగ చైతన్య,కరీనా కపూర్ నటీ నటులుగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారేలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’. హాలీవుడ్ లో సూపర్ హిట్ అయినటువంటి ఫారెస్ట్ గంప్ సినిమా ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఆమీర్ ఖాన్ హిట్ అందుకున్నాడా లేదా మన రివ్యూలో చూద్దాం..
కథ
లాల్ సింగ్ చడ్డా కథ విసయానికొస్తే.. లాల్ సింగ్ చడ్డా ( ఆమీర్ ఖాన్) అందరిలా చురకైన కుర్రాడు కాదు. తల్లి చాటు బిడ్డలా పెరుగుతాడు. ఈ క్రమంలో అతనికి స్కూల్లో మిగతా పిల్లలు అతనితో స్నేహం చేయడానికి ఇష్టపడరు. ఈ క్రమంలో క్లాస్ మేట్ అయిన రూప (కరీనా కపూర్)తో అతనికి పరిచయం ఏర్పడుతోంది. వీళ్లిద్దరు కలిసి చదువుకుంటారు. ఆ తర్వాత లాల్ సింగ్ సైన్యంలో జాయిన్ అవుతాడు. రూప హీరోయిన్ అవ్వాలని ట్రై చేస్తోంది. ఈ క్రమంలో లాల్ సింగ్.. రూపను ప్రేమించినా.. ఆమె మాత్రం అతనంటే ఇష్టమున్నా.. ఓ శ్రీమంతుడును పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో హీరో, హీరోయిన్ పెళ్లి చేసుకున్నారా.. ? ఈ క్రమంలో చడ్డాకు సైన్యంలో బాలరాజు (అక్కినేని నాగచైతన్య)తో పరిచయమవుతోంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ‘లాల్ సింగ్ చడ్డా’ స్టోరీ.
కథనం, టెక్నిషియన్స్ విషయానికొస్తే..
లాల్ సింగ్ చడ్డా మూవీని దర్శకుడు అద్వైత్ చందన్ తెరకెక్కించాడు. కథ మాత్రం హాలీవుడ్ చిత్రం ’ఫారెస్ట్ గంప్’ ఆధారంగా తెరకెక్కించాడు. దాన్ని ఇక్కడి నేటివిటీకి తగ్గట్టు అతుల్ కులకర్ణి సరైన విధానంలో తీర్చిదిద్దలేకపోయాడనే చెప్పాలి. ముఖ్యంగా హీరో చిన్నప్పుడు అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జన్సీని ఎత్తివేస్తున్నట్టు ప్రకటిస్తారు. ఇక ఎమర్జన్సీ ఎత్తివేసింది 1977లో. ఇక అపుడు హీరో ఎంత లేదన్న 5 యేళ్ల పిల్లాడుగా చూపిస్తారు. అంతేకాదు 1983లో మన దేశం కపిల్ దేవ్ ఆధ్వర్యంలో క్రికెట్ వరల్డ్ కప్ గెలిచినపుడు కూడా హీరో అదే ఏజ్‌లో కనిపిస్తాడు. ఆ తర్వాత 1984లో అప్పట్లో స్వర్ణ దేవాలయంపై జరిపిన ఆపరేషన్ బ్లూ స్టార్.. ఇందిరా గాంధీ హత్య జరిగిపుడు కూడా హీరో 6 యేళ్ల బాలుడుగా చూపించడం పెద్ద మైనస్. 1977 నుంచి 84 వరకు అంటే 6 యేళ్ల పిల్లాడు 13 యేళ్లైనా ఉండాలి. అది దర్శకుడు, రచయత,హీరో ఎలా మిసయ్యారన్నది పెద్ద ప్రశ్న. ఈ సినిమాను దర్శకుడు అప్పట్లో భారతదేశంలో జరిగిన వివిధ సంఘటనలు, ముఖ్యంగా మండల్ కమిషన్, సోమనాథ్ టూ అయోధ్య అద్వానీ రథయాత్ర, ఆ తర్వాత 1993లో ముంబైలో సీరియల్ బాంబ్ బ్లాస్టులు వంటి కథ ప్రకారం చక్కగా అల్లుకుంటూ వెళ్లాడు. మొత్తంగా 84 వరకు చిన్న పిల్లాడుగా చూపించినా.. 89 వచ్చే వరకు డిగ్రీ చదువుతున్నట్టు చూపించాడు. మొత్తంగా కథ నేటివిటీకి తగ్గట్టు బాగానే అల్లుకున్నా స్క్రీన్ ప్లే విషయంలో తడబడ్డాడు.
మొత్తంగా అద్వైత్ చందన్ ఈ సినిమాతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడనే చెప్పాలి. మరోవైపు అంతగా మానసికంగా పరిపక్వత లేని వ్యక్తిని ఇండియన్ ఆర్మీలో ఎలా చేర్చుకున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇందులో లాల్ సింగ్ చడ్డా.. తాత,ముత్తాత,వాళ్ల తాత అందురు మిలటరీలో 1914 మొదటి వరల్డ్ వార్ నుంచి సైన్యంలో ఉన్నట్టు చూపించారు. అలా ఏమైనా లాల్ సింగ్ చడ్డాను సైన్యంలో చేర్చుకున్నారా అనేది తెలియాల్సింది. మరోవైపు కార్గిల్ యుద్ధం సమయంలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదిని మన సైనికుడు అనుకొని హీరో కాపాడుతాడు. ఆ తీవ్రవాదిని ఇండియన్ ఆర్మీ.. మిలటరీ జైల్లో పెట్టకుండా... అతన్ని ఊరకే విడిచిపెడుతుందా అనే లాజిక్ కూడా మిస్ అయ్యాడు. ఇక కార్గిల్ యుద్ద సమయంలో మన వీర జవాలను కాపాడినందుకు అతన్ని కేంద్ర ప్రభుత్వం మహావీర చక్రతో గౌరవించడం అనేది ఎక్కడా లాజిక్‌కు అందదు. ఇక హీరోయిన్ కరీనా పాత్రను మోనీకా బేడీ తరహాలో చూపించాడు. సినిమాల్లో అవకాశాల కోసం గ్యాంగ్ స్టర్‌తో సహ జీవనం చేస్తూ ఉంటోంది. అతని పాత్రను అబూ సలేంగా చూపించారు. ఇక జిహాద్ చేస్తే స్వర్గంలో 72 కన్యలతో సుఖపడవచ్చు అని ఉగ్రవాదం వైపు మళ్లిన పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఓ డైలాగుతో ఈ సినిమాలో ఒక చురక అంటించాడు. ఇక నాగ చైతన్య అనే సౌత్ హీరోను తీసుకుంటే.. అతనికి తగ్గట్టు ఓ మీడియం రేంజ్ హీరోయిన్ అయిన పెట్టాల్సింది. ఒక సీరియల్ ఆర్టిస్ట్ కన్నా ముక్క మొఖం తెలియని ఓ ఆంటీని పెట్టి అక్కినేని ఫ్యాన్స్‌ను డిజాస్పాయింట్ చేసాడు. గ్రాఫిక్స్ వర్క్ బాగున్నాయి. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు.
నటీనటుల విషయానికొస్తే..
ఆమీర్ ఖాన్ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఎందుకంటారో ‘లాల్ సింగ్ చడ్డా’ మూవీ చూస్తే తెలిసిపోతుంది. ఈ సినిమాలో ఎక్కడా ఆమీర్ ఖాన్ కనిపించడు. లాల్ సింగ్ పాత్రనే కనిపిస్తోంది. అతని అమాయకత్వం .. స్వాతి ముత్యంలోని కమల్ హాసన్‌ను మించిపోయిందనే చెప్పాలి. ఎలాంటి పాత్ర ఇచ్చానా.. దాని అంతు చూడటంలో ఆమీర్ స్టైలే వేరు అని మరోసారి ఈ సినిమాతో ప్రూవ్ అయింది. ఇక నాగ చైతన్య బాలరాజు పాత్రలో ఉన్నంత సేపు ఆకట్టుకున్నాడు. కరీనా కపూర్.. హీరోయిన్ ఛాన్సుల కోసం ఎంత దూరమైన వెళ్లే పాత్రలో ఆకట్టుకుంది. మిగతా పాత్రల్లో నటించిన నటీనటులకు పెద్దగా స్కోప్ లేదు.
ప్లస్ పాయింట్స్
ఆమీర్ ఖాన్ నటన
నాగ చైతన్య స్క్రీన్ ప్రెజెన్స్
మైనస్ పాయింట్స్
కథ, కథనం..
దర్శకత్వం
సెకండాఫ్
చిత్ర నిడివి
చివరి మాట : లాజిక్ దూరంగా ’లాల్ సింగ్ చడ్డా’
రేటింగ్ : 2/5
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aamir Khan, Bollywood news, Kareena Kapoor, Laal Singh Chaddha, Naga Chaitanya Akkineni