బాలీవుడ్ చాక్లెట్ బాయ్ ఆమీర్ ఖాన్ (Aamir Khan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా సింపుల్గా కనిపిస్తూ తన పనులు తాను చేసుకుంటూ పోతుంటాడు. తాజాగా ఆమీర్ తన గొప్ప మనసు చాటుకున్నాడు. అసోంలో వరద బాధితులకు నేనున్నానంటూ అండగా నిలిచాడు. అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నదులు పొంగిపొర్లుతున్నాయి. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఎన్నో ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 2,389 గ్రామాలు నీటమునిగాయి. మరోవైపు భారీ వరదలతో సతమతమవుతున్న అసోంకు ఎంతో మంది దాతలు తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలను అందిస్తున్నారు.
తాజాగా ఆమీర్ ఖాన్ కూడా వరదలపై స్పందించాడు. ఆమిర్ ఖాన్ కూడా తన వంతు సాయం అందించి పెద్ద మనసును చాటుకున్నారు. అసోం సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 25 లక్షలను అందించారు. ఆమిర్ చేసిన సాయాన్ని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ప్రశంసించారు. వరద బాధితుల సహాయార్థం రూ. 25 లక్షల విరాళాన్ని అందించి వారికి అండగా నిలిచారని కొనియాడారు. ఆమిర్ కు హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తున్నానని చెప్పారు. మరోవైపు ఆమిర్ నటించిన 'లాల్ సింగ్ చద్దా' ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, కరీనా కపూర్ ముఖ్య పాత్రలను పోషించారు.
మరోవైపు అసోం రాష్ట్రాన్ని వరదల కుదిపేస్తున్నాయి. అక్కడ నివసించే వారికి నిలువు నీడ లేకుండా చేస్తున్నాయి. ఈ ఏడాది అసోంను బీభత్సమైన వరదలు ముంచెత్తాయి. లక్షలాది మంది ఈ వరదలతో ప్రభావితం అయ్యారు. వందకు మించి మరణాలు సంభవించాయి. వీటికితోడు రోజువారీ జీవితం భారంగా మారింది. విద్యుత్ సహా అన్ని సదుపాయాలు నిలిచిపోయాయి. రోజు గడవడమే కష్టంగా ఉన్నది. శనివారం నాటికి ఆరు రోజులపాటు సిల్చార్ టౌన్ నీట మునిగే ఉన్నది. సుమారు వారం రోజులు నీటిలోనే మునిగి ఉండటంతో తిప్పలు ఎక్కువ అయ్యాయి.
అసోంలో ఈ వరదల కారణంగా 122 మంది మరణించారు. కాగా, సుమారు 25.10 లక్షల మంది వరదలతో ప్రభావితం అయ్యారు. అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ లెక్కల ప్రకారం, రాష్ట్రంలోని 28 జిల్లాల్లో శుక్రవారం నాటికి ఈ వరదల కారణంగా 33.03 లక్షల మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. శనివారం నాటికి వీరి సంఖ్య 25.10 లక్షల మందికి తగ్గింది. ఇప్పుడు వరదలు కొంత తగ్గుముఖం పట్టాయి.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.