హోమ్ /వార్తలు /సినిమా /

Ira Khan: పబ్లిక్‌లో స్టార్ కిడ్ ఘాటు ముద్దులు.. అతగాడితో పీకల్లోతు ప్రేమలో అమీర్ ఖాన్ డాటర్

Ira Khan: పబ్లిక్‌లో స్టార్ కిడ్ ఘాటు ముద్దులు.. అతగాడితో పీకల్లోతు ప్రేమలో అమీర్ ఖాన్ డాటర్

Amir khan daughter Love Track (Photo Twitter)

Amir khan daughter Love Track (Photo Twitter)

Ira Khan love track: ఇటీవలి కాలంలో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ బాగా హైలైట్ అవుతోంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ తో పాటు వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ వస్తున్న ఐరా.. తన ప్రియుడి విషయంలో కూడా ఓపెన్ గా ఉంటోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఈ మధ్యకాలంలో సినిమా సెలబ్రిటీల ప్రేమ సంగతులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రంగుల ప్రపంచంలో ఉన్న తారలు, వారి వారి కుటుంబ సభ్యుల లవ్ ట్రాక్స్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. ప్రేమ, పెళ్లి విషయాల్లో నిర్మొహమాటంగా ఉంటున్నారు నేటితరం సెలబ్రిటీలు. ప్రేమించిన వ్యక్తి వివరాలను గోప్యంగా ఉంచడం సంగతి అటుంచితే.. ఏకంగా పబ్లిక్ లోనే లవర్ తో ఘాటు రొమాన్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ లిస్టులో చాలా మంది ఉండగా.. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) కూతురు ఐరా ఖాన్ (Ira Khan love track) చేరిపోయింది.

ఇటీవలి కాలంలో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ బాగా హైలైట్ అవుతోంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ తో పాటు వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ వస్తున్న ఐరా.. తన ప్రియుడి విషయంలో కూడా ఓపెన్ గా ఉంటోంది. తన ప్రియుడితో కలిసిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హల్చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అందరూ చూస్తుండగానే బాయ్ ఫ్రెండ్ కు ముద్దు కూడా పెట్టేసి తన ప్రేమను పబ్లిక్ చేసింది ఐరా. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

గతంలో మిషాల్‌ అనే వ్యక్తితో కొంతకాలం పాటు రిలేషన్‌లో ఉన్న ఐరా ఖాన్.. పలు సందర్భాల్లో అతనిపై ఉన్న ప్రేమను సోషల్‌ మీడియా వేదికగా తెలియజేసింది. అయితే మిషాల్‌ - ఐరాల మధ్య మనస్పర్థలు రావడంతో అతనికి బ్రేకప్ చెప్పి సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ అయిన నుపుర్ శిఖరేతో ఆమె ప్రేమాయణం నడిపిస్తోంది. త్వరలోనే ఆమె పెళ్లి కూడా చేసుకోబోతోందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఐరా ఖాన్ పై ఉన్న ప్రేమను బహిరంగంగా బయటపెడుతూ లవ్ ప్రపోజ్ చేశాడు నుపుర్ శిఖరే. కొన్నినెలలుగా డేటింగ్ చేస్తున్న నుపుర్- ఐరా ఇద్దరూ కలిసి రీసెంట్ గా విదేశాలకు వెళ్లారు. సైక్లింగ్ పోటీల్లో పాల్గొనేందుకు నుపుర్ వెళ్లగా ఆయనకు తోడుగా ఐరా కూడా వెళ్ళింది. అయితే ఈ సైక్లింగ్ పోటీలు నడుస్తున్న సమయంలోనే నుపుర్ ఐరా వద్దకు చేరుకుని మోకాళ్లపై కూర్చొని లవ్ ప్రపోజ్ చేశాడు.

నన్ను పెళ్లి చేసుకుంటావా? అని ఐరాను అడగ్గా.. దీనికి ఆమె ఎస్ అంటూ సమాధానం ఇచ్చింది. అనంతరం నుపుర్.. ఐరాకి ఉంగరం తొడిగి తమ బంధాన్ని అఫీషియల్ చేశాడు. ఆ వెంటనే ఐరాను హత్తుకుని నుపుర్ లిప్ కిస్ కూడా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐరా తాజాగా తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేస్తూ.. నేను ఎస్ చెప్పాను అని పేర్కొంది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Published by:Sunil Boddula
First published:

Tags: Aamir Khan, Bollywood, Bollywood actor

ఉత్తమ కథలు