హోమ్ /వార్తలు /సినిమా /

Ravi- Lasya: రవి-లాస్య యాంకరింగ్.. శ్రీముఖిని మిస్ అవుతున్నానన్న నటి

Ravi- Lasya: రవి-లాస్య యాంకరింగ్.. శ్రీముఖిని మిస్ అవుతున్నానన్న నటి

సోలోగా షోలు కూడా చేయలేదు.. యాంకరింగ్‌కు బ్రేక్ ఇచ్చి పెళ్లి చేసుకుంది. చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ 4 తో లాస్య అందరికీ పరిచయం అయింది. ఈమె సెకండ్ ఇన్నింగ్స్ ఇక్కడ్నుంచే మొదలైంది. ఈ షోలో దాదాపు 80 రోజులు ఉండి 40 లక్షల వరకు వసూలు చేసింది ఈ యాంకర్.

సోలోగా షోలు కూడా చేయలేదు.. యాంకరింగ్‌కు బ్రేక్ ఇచ్చి పెళ్లి చేసుకుంది. చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ 4 తో లాస్య అందరికీ పరిచయం అయింది. ఈమె సెకండ్ ఇన్నింగ్స్ ఇక్కడ్నుంచే మొదలైంది. ఈ షోలో దాదాపు 80 రోజులు ఉండి 40 లక్షల వరకు వసూలు చేసింది ఈ యాంకర్.

ఒక‌ప్పుడు బుల్లితెర రేటింగ్‌లను అమాంతం పెంచేసిన జంట యాంక‌ర్లు ర‌వి(Ravi) లాస్య(Lasya) ఇప్పుడు మ‌ళ్లీ షో చేయ‌బోతున్నారు. మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో విడిపోయిన ఈ ఇద్ద‌రు ఐదేళ్ల త‌రువాత క‌లిసి యాంక‌రింగ్ చేయ‌బోతున్నారు. సంక్రాంతి సంబ‌రాల్లో భాగం స్టార్ మాలో ప్ర‌సారం కానున్న ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ(It's a family Party) ప్రోగ్రామ్‌ని ఈ ఇద్ద‌రు హోస్ట్ చేయ‌నున్నారు.

ఇంకా చదవండి ...

Ravi- Lasya: ఒక‌ప్పుడు బుల్లితెర రేటింగ్‌లను అమాంతం పెంచేసిన జంట యాంక‌ర్లు ర‌వి లాస్య ఇప్పుడు మ‌ళ్లీ షో చేయ‌బోతున్నారు. మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో విడిపోయిన ఈ ఇద్ద‌రు ఐదేళ్ల త‌రువాత క‌లిసి యాంక‌రింగ్ చేయ‌బోతున్నారు. సంక్రాంతి సంబ‌రాల్లో భాగం స్టార్ మాలో ప్ర‌సారం కానున్న ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ ప్రోగ్రామ్‌ని ఈ ఇద్ద‌రు హోస్ట్ చేయ‌నున్నారు. ఇక ఈ ప్రోగ్రామ్‌లో స్టార్ మా టీవీ సీరియ‌ల్స్‌లో న‌టించే వారు, షోల్లో చేస్తున్న‌ వారు, కొంత‌మంది క‌మెడియ‌న్లు సంద‌డి చేయ‌నున్నారు. అలాగే బిగ్‌బాస్ 4 సీజ‌న్‌లో పాల్గొన్న కొంత‌మంది కూడా ఈ సంబ‌రాల్లో భాగం అవ్వ‌నున్నారు. వీటికి సంబంధించిన ప్రోమో ఇప్ప‌టికే విడుద‌లై అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. ఇందులో మిగిలిన సంద‌డి ఎలా ఉన్నా.. ర‌వి-లాస్య యాంక‌రింగ్‌ను చూసేందుకు చాలా మంది వారి అభిమానులు ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించి స్టార్ మా తాజాగా మ‌రో ప్రోమోను విడుద‌ల చేసింది. అందులో తాను- లాస్య క‌లిసి యాంక‌రింగ్ చేస్తుంటే ఎలా ఉంద‌ని కొంత‌మందిని అడుగుతాడు ర‌వి. ముందుగా క‌మెడియ‌న్ సుధాక‌ర్‌ని అడ‌గ్గా.. లాస్యను చూస్తుంటే బాధ‌గా ఉంద‌ని అంటాడు. ఆ త‌రువాత ఆమె క‌థ న‌టి న‌వ్య స్వామిని ఇదే ప్ర‌శ్న వేస్తాడు ర‌వి. దానికి న‌వ్య‌.. నాకైతే శ్రీముఖిని మిస్ అవుతున్న‌ట్లు ఉంద‌ని చెబుతుంది. దీంతో ర‌వి బిక్కమొహం వేస్తాడు.

అయితే ర‌వి- లాస్య జోడీ విడిపోయిన త‌రువాత రవి-శ్రీముఖి జోడి ప‌లు షోల‌కు వ్యాఖ్య‌త‌గా చేసింది. ఆ షోలు మంచి విజ‌యాన్ని కూడా సాధించింది. కానీ అప్పుడు వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న చ‌నువు వ‌ల‌న ర‌వి-శ్రీముఖి జోడీపై ఎన్నో రూమ‌ర్లు వ‌చ్చాయి. ర‌వి-శ్రీముఖి మ‌ధ్య ఏదో జ‌రుగుతున్న‌ట్లు పుకార్లు వినిపించాయి. కానీ తామిద్ద‌రం మంచి స్నేహితులమ‌ని ఈ ఇద్ద‌రు చెబుతూ వ‌చ్చారు. ఇక శ్రీముఖి బిగ్‌బాస్ 3లో పాల్గొని వ‌చ్చిన త‌రువాత మాత్రం ఈ ఇద్ద‌రి జోడీలో పెద్ద‌గా షోలు రాలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే న‌వ్య స్వామి ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు తెలుస్తోంది.

First published:

Tags: Anchor lasya, Anchor ravi, Television News

ఉత్తమ కథలు