Navya Swamy: బుల్లితెరపై మంచి క్రేజ్ ఉన్న నటీమణుల్లో నవ్య స్వామి ఒకరు. కర్ణాటకలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ ఇప్పుడు వరుస సీరియల్స్‌తో బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో నవ్య తాజాగా అరుదైన అవార్డును సొంతం చేసుకున్నారు. బ్యూటీ ఆఫ్ ది ఇయర్ 2020 అవార్డుకు గానూ నవ్య స్వామి ఎన్నికైంది. ఇక ఈ అవార్డును ఇటీవల తీసుకున్న నవ్య.. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. వావ్ బ్యూటీ ఆఫ్ ది ఇయర్ 2020. వినడానికి చాలా బావుంది కదా. మీ అందరి నిరంతర ప్రేమ, మద్దతు లేకుండా నాకు ఈ అవార్డు వచ్చేది కాదు. అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ అన్నది నిజంగా సరిపోదు అని నవ్య కామెంట్ పెట్టారు. ఇక ఈ పోస్ట్‌కి స్పందిస్తోన్న ఆమె అభిమానులు కంగ్రాట్స్ అంటూ కామెంట్ పెట్టారు. తన సహనటుడు రవికృష్ణ సైతం నవ్యకు కంగ్రాట్స్ అని చెప్పాడు.
కాగా తంగలి అనే కన్నడ సీరియల్ ద్వారా నవ్య బుల్లితెర నటిగా ఎంట్రీ ఇచ్చారు. అందులో ఆమెకు మంచి గుర్తింపు రావడంతో.. అవకాశాలు కూడా వరుసగా వచ్చాయి. ఈ క్రమంలో తెలుగు, తమిళ్లోనూ ఆమెకు అవకాశాలు వచ్చాయి. రాధిక నటించిన వాణి రాణి సీరియల్లోనూ నవ్య నటించారు. అలాగే కంటే కూతురినే కనాలి, లకుమి, అరాన్మనై కిలి సీరియల్స్‌లో నటించారు.
View this post on Instagram
ఈ క్రమంలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. అలాగే తెలిగింటి అమ్మాయిలా గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు నవ్య తెలుగులో నా పేరు మీనాక్షి, ఆమె కథ సీరియల్స్‌లో నటిస్తోంది. కాగా నవ్య వదిన ఐశ్వర్య కూడా ఓ సీరియల్ నటి అన్న విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Television News, Tollywood