Aakasam Nee Haddura Movie Review: ఆకాశం నీ హద్దురా మూవీ రివ్యూ.. అమెజాన్ రిలీజ్...
నటీనటులు: సూర్య, మోహన్ బాబు, పరేష్ రావల్, అపర్ణ బాల మురళి తదితరులు..
రచన, దర్శకత్వం: సుధా కొంగర
మ్యూజిక్: జీవి ప్రకాష్
కరోనా లాక్డౌన్ తర్వాత రీసెంట్గా థియేటర్స్ ఓపెన్ అయినా.. అన్ని చోట్ల మాత్రం ఇంకా థియేటర్స్ తెరుచుకోలేదు. దీంతో కొత్త సినిమాల కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. దీంతో కొంత మంది హీరోలు, దర్శకులు ధైర్యం చేసి తమ సినిమాలను అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల చేస్తున్నారు. కరోనా తర్వాత ప్రేక్షకులకు ఇదో రకం కొత్త అనుభవం. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు తమిళనాడు థియేటర్స్, ఎగ్జిబిటర్స్ నుంచి వ్యతిరేకత ఎదురైన గతంలో ఆయన సతీమణి జ్యోతిక నటించిన ‘పొన్మగల్ వందల్’ సినిమాను ఓటీటీలో విడుదల చేసాడు. తాజాగా ఈయన హీరోగా నటించిన ‘సూరారై పొట్రు’ సినిమాను తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ సినిమానుఒకేసారి అమెజాన్ ఓటీటీ వేదికగా విడుదల చేసాడు. మరి ఈ సినిమా ఎలా ఉందంటే..
కథ విషయానికొస్తే..
ఆకాశం నీ హద్దురా స్టోరీ విషయానికొస్తే.. సూర్య (మహా) గుంటూరు జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో ఓ మాస్టారి కొడుకు. తన తండ్రి ఓ అభ్యుదయ వాది. ఆ ఊరికి కరెంట్ లాంటి ప్రాథమిక సౌకర్యాల కల్పనలో ఎంతో కృషి చేస్తాడు. అతని పెంపకంలో పెరిగిన సూర్య.. సామాన్యుడు తక్కువ ధరతో విమాన ప్రయాణం చేయాలనే కల కంటాడు. తన కలను సాధించుకోవడానికి ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఎయిర్ ఫోర్స్ ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. ఆ తర్వాత తన సాకారం చేసుకోవడానికి ఎలాంటి కష్టాలు అనుభవించాడు. చివరకు తాను అనుకున్నది ఎలా సాధించాడనేదే ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా స్టోరీ.
నటీనటులు విషయానికొస్తే..
సూర్య విషయానికొస్తే.. నటుడిగా వంక పెట్టాల్సిన పనిలేదు. ప్రతి సన్నివేశంలో తన యాక్టింగ్‌తో మెప్పించాడు. ముఖ్యంగా ఊర్లో రైలు ఆగడానికి చేసే పోరాటంతో పాటు ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగిగా.. ఆ తర్వాత సగటు మనిషిగా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్గా నటించిన అపర్ణా బాలమురళి తనదైన యాక్టింగ్‌తో మెప్పించింది. మోహన్ బాబు ఈ చిత్రంలో తన రియల్ నేమ్ ఎయిర్ కమాండర్ ‘భక్తవత్సలం నాయుడు’గా మరోసారి తన మార్క్ నటన చూపించారు. ఒక ప్రైవేటు ఎయిర్ లైన్స్ ఓనర్‌గా అడుగడున సూర్య కలకు అడ్డుపడే పాత్రలో పరేష్ రావల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ చిత్రంలో హీరోగా సూర్య పాత్ర ఎలివేట్ కావడానికి పరేష్ రావల్ నటన ఎంతో కీలకం అనే చెప్పాలి.
టెక్నీకల్ విషయానికొస్తే..
సుధా కొంగర ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రాన్ని ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. మంచి స్పూర్తిదాయక కథను ఎంచుకన్నా.. ఆ కథను తెరకెక్కించడంలో అక్కడక్కడ తడబడ్డారు సుధా కొంగర. ఒక ఎమోషనల్ డ్రామాను ఇంకా బాగా తీయచ్చు కానీ.. ఆమె ఉన్నంతలో ఈ సినిమాను తనదైన మార్క్‌తో తెరకెక్కించారు. ఏదో డాక్కుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతోంది. ఒకవేళ థియేటర్స్‌లో రిలీజై ఉంటే.. ఫలితం ఎలా ఉండేదో. మొత్తంగా సినిమాను ఓ ఎమోషనల్ డ్రామాగా మలచడంలో సక్సెస్ అయ్యారు సుధ కొంగర. ఈ సినిమాను నిఖిత్ బొమ్మిరెడ్డి అందించిన ఫోటోగ్రఫీ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ పర్వాలేదనిపించింది. సూర్యకు తెలుగు నటుడు సత్యదేవ్ చెప్పిన డబ్బింగ్ బాగానే కుదిరింది.
ప్లస్
సూర్య, పరేష్ రావల్, మోహన్ బాబు, అపర్ణా బాలమురళిల నటన
కథ
ఫోటో గ్రఫీ
మైనస్.
కథనం బోరింగ్‌గా సాగడం
డ్రామా సన్నివేశాలు
ఎడిటింగ్
రేటింగ్: 2.75/5
చివరి మాట.. మొత్తంగా ఆకాశం హద్దుగా సాగే ఎమోషనల్ ప్రయాణం..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aakasam Nee Haddura, Kollywood, Mohan Babu, Suriya, Tollywood