హోమ్ /వార్తలు /సినిమా /

Sreemukhi: వీడికి కసి, ఆకలి ఎక్కువ..! శృతి మించిన శ్రీముఖి శృంగారం కామెంట్స్

Sreemukhi: వీడికి కసి, ఆకలి ఎక్కువ..! శృతి మించిన శ్రీముఖి శృంగారం కామెంట్స్

 anchor sreemukhi

anchor sreemukhi

Aadivaaram with Star Maa Parivaaram: తాజాగా స్టార్ మా పరివార్ లేటెస్ట్ ఎపిసోడ్ తాలూకు ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో శృంగారంపై శ్రీముఖి చేసిన కామెంట్స్, కొన్ని సన్నివేశాలు వైరల్ అవుతున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఈ మధ్యకాలంలో బుల్లితెర ప్రోగ్రామ్స్ లో శృతిమించిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ చూస్తున్నాం. ఒకరిని మించి ఇంకొకరు అన్నట్లుగా రెచ్చిపోతున్నారు అంతా. తాజాగా స్టార్ మా పరివారం (Aadivaaram with Star Maa Parivaaram) ప్రోమోలో శ్రీముఖి (Sreemukhi) మాట్లాడిన తీరు, చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ఓ ప్రోగ్రాం టెలికాస్ట్ అవుతుందంటే అందుకు ఓ వారం ముందుగానే దాని తాలూకు ప్రోమోలు వదిలి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుకుతున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే తాజాగా స్టార్ మా పరివార్ లేటెస్ట్ ఎపిసోడ్ తాలూకు ప్రోమో రిలీజ్ చేశారు.

ఈ ప్రోమో వీడియోలో అవినాష్, శ్రీముఖిలతో పాటు షోకి వచ్చిన.. బ్రహ్మముడి, గృహలక్ష్మిల టీం సభ్యులు డబుల్ మీనింగ్ డోస్‌ పెంచేశారు. వాళ్లంతా చేసిన డబుల్ మీనింగ్ కామెంట్లతో కట్ చేసిన ఈ ప్రోమో వీడియో రిలీజ్ చేశారు. ఇంద్రనీల్ కసి బాగా నేర్పిస్తాడని గృహలక్ష్మి లాస్య అనడం, ఫైమా అయితే ఐ వాంట్ కసి అంటూ రెచ్చిపోవడం ఈ వీడియోలో చూడొచ్చు. ఇదంతా ఒకెత్తు అయితే యాంకర్ శ్రీముఖి నోరు విప్పడం మరో ఎత్తు అయింది.

బ్రహ్మముడి సీరియల్‌ హీరోయిన్ గెలిపించడం అనే బదులు గెలికించడం అనేసింది. దీంతో శ్రీముఖి ఎంటరై డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో రచ్చ చేసినట్లు ఈ ప్రోమో స్పష్టం చేస్తోంది. బ్రహ్మముడి సీరియల్‌లో చేస్తున్నమరో హీరోయిన్‌ హమీదాతో నవరసాలు పలికించే సాహసం చేశారు. శృంగార రసంలో భాగంగా అవినాష్ కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ హమీదాని శృంగార రసం పలికించాలని టాస్క్ ఇచ్చింది శ్రీముఖి. దీంతో హమీదా కళ్లల్లోకి చూస్తూ అవినాష్ సొల్లు కార్చేయడం, ఆపై యాంకర్ శ్రీముఖి తన నోటికి పని చెప్పడం చూడొచ్చు.' isDesktop="true" id="1609188" youtubeid="QEZwPrbFtgA" category="movies">

హమీదా చేస్తుంటే శృంగార రసం లాగే ఉంది కానీ.. వీడిది కసి, ఆకలిలాగ ఉంది అంటూ ఓపెన్‌ కామెంట్ చేసింది శ్రీముఖి. ఆ తర్వాత ఫైమా-అవినాష్‌లకు శృంగార రసం కాన్సెప్ట్ ఇవ్వడంతో ఫైమా అయితే అందులో లీనమైపోయింది. దీంతో ఈ ప్రోమో వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ డబుల్ మీనింగ్ డోస్ చూసి నోరెళ్లబెట్టడం సగటు ప్రేక్షకుడి వంతు అయింది.

First published:

Tags: Anchor Sreemukhi, Sreemukhi, TV shows