Home /News /movies /

AADI SAIKUMAR TEES MAAR KHAN MOVIE REVIEW AND RATING TA

తీస్ మార్ ఖాన్ (Tees Maar Khan)
తీస్ మార్ ఖాన్ (Tees Maar Khan)
2.5/5
రిలీజ్ తేదీ:19/08/2022
దర్శకుడు : కళ్యాణ్ జి గోగణ (Kalyan G Gogana)
సంగీతం : సాయి కార్తీక్ (Sai Karthik)
నటీనటులు : ఆది సాయి కుమార్, పాయల్ రాజ్ పుత్, పూర్ణ, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్, పూర్ణ తదితరులు
సినిమా శైలి : యాక్షన్ డ్రామా

Tees Maar Khan Movie Review: ఆది సాయి కుమార్ ‘తీస్‌ మార్‌ ఖాన్’ మూవీ రివ్యూ.. రొటీన్ యాక్షన్ థ్రిల్లర్..

తీస్ మార్ ఖాన్ మూవీ రివ్యూ (Photo Twitter)

తీస్ మార్ ఖాన్ మూవీ రివ్యూ (Photo Twitter)

Tees Maar Khan Movie Review: హిట్లు ఫ్లాపులతో పని లేకుండా ఎప్పుడూ వరస సినిమాలు చేసే హీరోల్లో ముందుంటాడు ఆది సాయికుమార్. ఈ ఏడాది ఆయన నుంచి మరో సినిమా తీస్ మార్ ఖాన్. పక్కా మాస్ సినిమాగా వచ్చిన తీస్ మార్ ఖాన్‌లో నిజంగానే ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలున్నాయా.. కమర్షియల్ విజయం సాధించే సత్తా ఉందా..? అసలు తీస్ మార్ ఖాన్ ఎలా ఉన్నారు..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
రివ్యూ : తీస్ మార్ ఖాన్ (Tees Maar Khan)
నటీనటులు : ఆది సాయి కుమార్, పాయల్ రాజ్ పుత్, పూర్ణ, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్, పూర్ణ తదితరులు
ఎడిటర్: మణికాంత్
సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి
సంగీతం: సాయి కార్తీక్
నిర్మాత : నాగం తిరుపతి రెడ్డి
దర్శకత్వం: కళ్యాణ్ జి గోగణ
విడుదల తేది : 19-8-2022

హిట్లు ఫ్లాపులతో పని లేకుండా ఎప్పుడూ వరస సినిమాలు చేసే హీరోల్లో ముందుంటాడు ఆది సాయికుమార్. ఈ ఏడాది ఆయన నుంచి మరో సినిమా తీస్ మార్ ఖాన్. పక్కా మాస్ సినిమాగా వచ్చిన తీస్ మార్ ఖాన్‌లో నిజంగానే ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలున్నాయా.. కమర్షియల్ విజయం సాధించే సత్తా ఉందా..? అసలు తీస్ మార్ ఖాన్ ఎలా ఉన్నారు..?

కథ:
తీస్ మార్ ఖాన్ (ఆది) ఓ అనాథ. చిన్నప్పటి నుంచి ఆయనకు తోడు నీడగా ఉన్నది మరో అనాథ అయిన వసు (పూర్ణ). తీస్ మార్ ఖాన్‌ను చేరదీసేది ఈమే. ఆమెను తల్లిలా చూసుకుంటాడు తీస్ మార్ ఖాన్. అమ్మకు ఏ లోటు వచ్చినా తట్టుకోడు. అలాంటి అమ్మకు చక్రీ (సునీల్)తో పెళ్లి జరుగుతుంది. మరోవైపు తీస్ మార్ ఖాన్ కూడా అనఘ (పాయల్ రాజ్‌పుత్)‌ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. లైఫ్ అంతా సాఫీగా సాగిపోతుందనుకుంటున్న సమయంలోనే ఉన్నట్లుండి సడన్‌గా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తుంది తీస్ మార్ ఖాన్ తల్లి. ఆ మరణానికి జీజా (అనూప్ సింగ్ ఠాకూర్) అనే అనుమానం కలుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది.. తన తల్లిని చంపిందెవరు.. దాన్ని తీస్ మార్ ఖాన్ ఎలా చేధిస్తాడు అనేది మిగిలిన కథ..

కథనం, టెక్నీషియన్స్ విషయానికొస్తే:
తీస్ మార్ ఖాన్ ఇదివరకు తెలుగులో వచ్చిన ఎన్నో సినిమాల కలయిక. వాటినే తన సినిమా కోసం రాసుకున్నాడు కళ్యాణ్. ఈయన మొదటి సినిమా నాటకం భిన్నమైన దారిలో వెళ్తుంది. కానీ ఈ సారి మాత్రం పక్కా కమర్షియల్ రూట్‌లో కథ రాసుకున్నాడు కళ్యాణ్. పక్కా లెక్కలేసుకుని కమర్షియల్ ఎలిమెంట్స్ రాసుకుని తీస్ మార్ ఖాన్ తీసాడు. మొదలైన కాసేపటికే ఈ విషయం అర్థమైపోతుంది. మాస్ సినిమాలు ఇష్టపడే వాళ్ల కోసం కావాల్సిన మసాలాలు కూడా బాగానే దట్టించాడు. కథలో పెద్దగా ట్విస్టులు ఉండవు. చైల్డ్ ఎపిసోడ్స్‌తో కథ మొదలవ్వడం.. అక్కడ్నుంచి హీరో అనాథ సన్నివేశాలు.. ఆ తర్వాత పూర్ణతో వచ్చే సీన్స్ అలా అలా సాగిపోతుంది. ఆది సాయికుమార్ పాత్రను బాగానే మలిచాడు. హీరో పాత్ర చాలా సినిమాల్లో చూసినట్లే ఉంటుంది. ఎలాంటి బరువు బాధ్యతలు లేకుండా తిరిగే కారెక్టర్ ఇది. అలాంటి పాత్ర ఉన్నట్లుండి పోలీస్ ఆఫీసర్‌గా మారుతుంది. ప్రాణంగా ప్రేమించే అమ్మను చంపిన వాళ్లపై ఎలా పగ తీర్చుకున్నారనేది కూడా రొటీన్‌గానే ఉంటుంది కానీ దానికే కమర్షియల్ హంగులు అద్దే ప్రయత్నం చేసాడు దర్శకుడు. అమ్మ మరణం వెనుక గుట్టును తీస్ మార్ ఖాన్ రట్టు చేశాడు అనేది ఈ సినిమా కథ. తీస్ మార్ ఖాన్, వసు బాల్యంలో ఎదురైన అనుభవాలు, కష్టాలతో సినిమా కథ ఎమోషనల్‌గా మారుతుంది. అయితే వాటిని ఇంకాస్త ఫాస్టుగా నడిపించి ఉంటే బాగుండేది. చైల్డ్ ఎపిసోడ్ సాగదీసినట్టు అనిపిస్తాయి. పాయల్ రాజ్‌పుత్, ఆది మధ్య లవ్ ట్రాక్ పర్లేదు. పూర్ణ మరణం తర్వాత చోటుచేసుకొన్న సంఘటనలు కథను పూర్తిగా మలుపు తిప్పుతుంది. తీస్ మార్ ఖాన్ పోలీస్ ఆఫీసర్ కావడమనే ట్విస్టుతో ఇంటర్వెల్ వస్తుంది. ఆ తర్వాత రొటీన్ ఫార్మాట్‌లోనే కథ ముందుకు వెళ్తుంది.

సంగీత దర్శకుడు సాయి కార్తిక్ వర్క్ అంతగా ఆకట్టుకోలేదు. ఆయన పాటలు అంతంతమాత్రంగానే ఉన్నాయి కానీ ఆర్ఆర్ మాత్రం బాగుంది. పాయల్, ఆదిపై పిక్చరైజ్ చేసిన బీచ్ సాంగ్ బాగుంది. సినిమాటోగ్రాఫర్ బాల్‌రెడ్డి పనితీరు ఆకట్టుకుంటుంది.. ఎడిటర్ మణికాంత్ ఇంకాస్త పదునుగా సీన్స్ కట్ చేసుంటే బాగుండేది. దర్శకుడు కల్యాణ్ జీ గోగణ తీసుకున్న పాయింట్ బాగుంది.. కానీ దాన్ని ఎమోషనల్‌గా డీల్ చేయలేకపోయాడు. మాస్ యాక్షన్‌పై ఫోకస్ చేయడంతో మెయిన్ స్టోరీ పక్కదారి పట్టింది. డాక్టర్ నాగం తిరుపతి రెడ్డి నిర్మాణ విలువలు బాగున్నాయి. పైగా ఆయన నటుడిగానూ ఆకట్టుకున్నారు.

నటీనటులు:
ఆది సాయి కుమార్ మరోసారి ఆకట్టుకున్నాడు. ప్రతీసారి లవర్ బాయ్‌గా వచ్చే ఈయన.. ఈ సారి మాస్ హీరోగా నిరూపించుకునే ప్రయత్నం చేసాడు. అందులో తనవంతు చాలా వరకు సక్సెస్ అయ్యాడు కూడా. అమ్మ సెంటిమెంట్‌ ఎపిసోడ్స్‌లో ఆది నటన బాగుంది. పాయల్ రాజ్‌పుత్ గ్లామర్ తీస్ మార్ ఖాన్‌కు ప్రధానాకర్షణ. కాకపోతే కథ అంతా పూర్ణ, సునీల్, ఆది కారెక్టర్స్ చుట్టూ తిరగడంతో ఈమెకు నటించడానికి స్కోప్ దక్కలేదు. కబీర్ ఖాన్, అనూప్ సింగ్ ఠాకూర్, శ్రీకాంత్ అయ్యంగార్ పాత్రలు ఓకే.

ప్లస్ పాయింట్స్ 

యాక్షన్ సన్నివేశాలు

ఇంటర్వెల్ ట్విస్ట్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్ 

రొటిన్ కథ

ఫస్టాఫ్

స్టోరీ ఫ్లోను దెబ్బ తీసే సాంగ్స్

చివరి మాట:  తీస్ మార్ ఖాన్.. మరో రొటీన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్

రేటింగ్: 2.5/5
Published by:Kiran Kumar Thanjavur
First published:

రేటింగ్

కథ:
2.5/5
స్క్రీన్ ప్లే:
2.5/5
దర్శకత్వం:
2.5/5
సంగీతం:
3/5

Tags: Aadi Saikumar, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు