ఆర్టికల్ 370 నేపథ్యంలో ఆది సాయి కుమార్ ‘ఆపరేషన్ గోల్డ్‌‌ఫిష్’.. విడుదల తేది ఖరారు..

operation gold fish | గత కొన్నేళ్లుగా ఆది సాయి కుమార్ బాక్సాఫీస్ దగ్గర సరైన విజయాన్ని నమోదు చేయలేకపోయాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ‘వినాయకుడు’, ‘విలేజ్‌లో వినాయకుడు’ సినిమాల దర్శకుడు సాయి కుమార్ అడివి దర్శకత్వంలో ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ అనే థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా విడుదల తేది ఖరారైంది.

news18-telugu
Updated: September 27, 2019, 10:29 AM IST
ఆర్టికల్ 370 నేపథ్యంలో ఆది సాయి కుమార్ ‘ఆపరేషన్ గోల్డ్‌‌ఫిష్’.. విడుదల తేది ఖరారు..
ఆపరేషన్ గోల్డ్‌ఫిష్ (Twitter/Photo)
  • Share this:
operation gold fish | గత కొన్నేళ్లుగా ఆది సాయి కుమార్ బాక్సాఫీస్ దగ్గర సరైన విజయాన్ని నమోదు చేయలేకపోయాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ‘వినాయకుడు’, ‘విలేజ్‌లో వినాయకుడు’ సినిమాల దర్శకుడు సాయి కుమార్ అడివి దర్శకత్వంలో ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ అనే థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో  ఆది సాయికుమార్ సరసన శషా చెట్రీ కథానాయికగా నటిస్తోంది. కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేష్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీని యదార్థ సంఘటనల ఆధారంగా రాసుకున్న కల్పిత కథతో తెరెక్కించారు. ఈ మూవీలో ఆది సాయికుమార్ అర్జున్ పండిత్ అనే ఎన్.ఎస్.జి కమాండో రోల్లో నటించాడు. ఎన్.ఎస్.జి కమెండోగా ఆది లుక్ టెర్రిఫిక్‌గా ఉంది. ఈ మూవీ కోసం ఆది..స్పెషల్‌గా ఆర్మీ, ఎన్.ఎస్.జీ వాళ్ల స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. అంతేకాదు ఈ మూవీలో   ఎలాంటి డూపు లేకుండా  ఎన్నో రిస్కీ షాట్స్ చేేసినట్టి సమాచారం.తాజాగా కేంద్రం కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని దేశంలోని మెజారిటీ ప్రజలు హర్షించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో కూడా ఆర్టికల్ 370ని ప్రస్తావించే అవకాశాలున్నాయి.

article 370, kashmir, Aadi Sai kumar Operation Gold Fish Movie First Look Release, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, కమెండోగా ఆది సాయి కుమార్, ఆర్టికల్ 370, కశ్మీర్, కాశ్మీర్,
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా
ఈ సినిమాలో ఘాజీ బాబా పాత్రలో అబ్బూరి రవి నటించాడు. ఫరూఖ్ ఇక్బాల్ ఇరాకీగా మనోజ్ నందం, ఇంకా కృష్ణుడు, నిత్యా నరేష్, పార్వతీశం, కార్తీక్ రాజు అద్భుతంగా నటించారు. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో రామజోగయ్య శాస్త్రి రాసిన దేశభక్తి గీతాన్ని కీరవాణి  పాటడం విశేషం. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈసినిమాను అక్టోబర్ 18న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
First published: September 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com