Aadi Saikumar: ఆది సాయి కుమార్ నటించిన ‘బ్లాక్’ చిత్రం త్వరలోనే విడుదల..

ఆది సాయికుమార్ బ్లాక్ సినిమా (Aadi Black movie)

Aadi Saikumar: హిట్టు ఫ్లాపులతో పని లేకుండా వరస సినిమాలు చేసే హీరోల్లో ఆది సాయికుమార్ ముందుంటాడు. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూనే ఉంటాడు ఈయన. ఇప్పుడు కూడా ఓ వైపు తీస్ మార్ ఖాన్ అనే సినిమా చేస్తూనే.. మరోవైపు బ్లాక్ సినిమాతో వస్తున్నాడు.

  • Share this:
హిట్టు ఫ్లాపులతో పని లేకుండా వరస సినిమాలు చేసే హీరోల్లో ఆది సాయికుమార్ ముందుంటాడు. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూనే ఉంటాడు ఈయన. ఇప్పుడు కూడా ఓ వైపు తీస్ మార్ ఖాన్ అనే సినిమా చేస్తూనే.. మరోవైపు బ్లాక్ సినిమాతో వస్తున్నాడు. మహంకాళి మూవీస్ పతాకం పై అది సాయి కుమార్ హీరోగా జి బి కృష్ణ దర్శకత్వంలో మహంకాళి దివాకర్ నిర్మిస్తున్న చిత్రం "బ్లాక్". దీపావళి పండగ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చిత్రం యొక్క రెండవ పోస్టర్ ను విడుదల చేసారు. ఇటీవలి విడుదలైన టీజర్ తో ఈ చిత్రం పై అంచనాలు పెరిగాయి. టీజర్ లో కనిపించిన యాక్షన్ షాట్స్ తో సరికొత్త క్యారెక్టర్ తో ఆకట్టుకునే సంభాషణలతో ఈ చిత్రం పై అంచనాలను మరింత పెంచింది. హీరో అది కెరీర్ లో బ్లాక్ చిత్రం ఒక మైలు రాయిగా నిలుస్తుంది. మంచి సాంకేతిక విలువలతో నిర్మించబడిన చిత్రం త్వరలోనే విడుదల కు సిద్ధం అవుతుంది. ఆటగాళ్లు ఫేమ్ దర్శన బానిక్, బిగ్ బాస్ కుశాల్ మందా, ఆమని, పృథ్వి రాజ్, సూర్య, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్, ఆనంద్ చక్రపాణి తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: