Home /News /movies /

AADI SAIKUMAR ATHIDHI DEVO BHAVA MOVIE REVIEW COMES UP WITH GOOD CONCEPT BUT WEAK SCREENPLAY PK

Athidhi Devo Bhava movie review: ‘అతిథి దేవోభవ’ రివ్యూ.. మంచి కాన్సెప్ట్.. కానీ కండీషన్స్ అప్లై..

ఆది సాయికుమార్ అతిథి దేవోభవ రివ్యూ

ఆది సాయికుమార్ అతిథి దేవోభవ రివ్యూ

Athidhi Devo Bhava movie review: ప్రేమ కావాలి, లవ్లీ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న యంగ్ లవర్ బాయ్ ఆది సాయికుమార్ హీరోగా నువేక్ష పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘అతిధి దేవోభవ’. శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రాజాబాబు, అశోక్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం జనవరి 7న విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం..

ఇంకా చదవండి ...
నటీనటులు: ఆది సాయికుమార్‌, నువేక్ష, రోహిణి, సప్తగిరి తదితరులు
సినిమాటోగ్రఫీ: అమ‌ర్‌నాథ్ బొమ్మిరెడ్డి
సంగీతం: శేఖ‌ర్ చంద్ర‌
నిర్మాతలు: రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల
దర్శకత్వం : పొలిమేర నాగేశ్వ‌ర్‌

ప్రేమ కావాలి, లవ్లీ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న యంగ్ లవర్ బాయ్ ఆది సాయికుమార్ హీరోగా నువేక్ష పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘అతిధి దేవోభవ’. శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రాజాబాబు, అశోక్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం జనవరి 7న విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం..

కథ:
అభయ్ (ఆది సాయి కుమార్)కు పుట్టుకతోనే 'మోనో ఫోబియా' అనే సమస్య ఉంటుంది. అంటే ఒంటరితనం భరించలేడన్నమాట. తోడు లేకపోతే చచ్చిపోతాడేమో అనే భయం వేస్తుంది. ఆ భయంలో చనిపోవడానికి కూడా సిద్ధపడతారు. అలాంటి సమస్య ఉన్న అభయ్ జీవితంలోకి వైష్ణవి (నువేక్ష) వస్తుంది. ఆమెను చూసి ప్రేమలో పడతాడు అభయ్. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. కానీ ఆ తర్వాత ఈ ఇద్దరి ప్రేమకు మోనోఫోబియా పెద్ద సమస్య అవుతుంది. అక్కడ్నుంచి కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనేది అసలు కథ.. అభయ్, వైష్ణవి ఒక్కటయ్యారా.. తన విషయం వైష్ణవికి చెప్పాడా లేదా.. చెప్పకుండా ఎందుకు దాచేస్తాడు.. చెప్పిన తర్వాత ఎలా రియాక్ట్ అయింది అనేది కథ..

కథనం:
తెలుగు ఇండస్ట్రీలో హీరోలకు డిజార్డర్స్ పెట్టి ఈ మధ్య చాలా సినిమాలే వచ్చాయి. అలాంటి కాన్సెప్టుతోనే వచ్చిన సినిమా అతిథి దేవోభవ. ఇందులో 'మోనో ఫోబియా’ అనే విభిన్న కథను టచ్ చేసాడు దర్శకుడు. ఇప్పటి వరకు మన తెలుగులో అయితే ఈ తరహా కథాంశంతో సినిమా రాలేదు. మంచి కాన్సెప్ట్ తీసుకున్న దర్శకుడు.. దాన్ని తెరకెక్కించడంలో మాత్రం విఫలమయ్యాడనే అనిపిస్తుంది. కాన్సెప్ట్ వరకు చాలా చక్కగా ఉంది. భలే ఉందిరా అనిపిస్తుంది. దాని చుట్టూ కథనం అల్లుకుంటూ వెళ్లిపోయాడు దర్శకుడు. స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం తడబడినట్లు అనిపిస్తుంది. అయినా కూడా తన వంతు బాగానే ప్రయత్నం చేసాడు. పాత్రల పరిచయానికి కొంత సమయం తీసుకున్నా... ఫస్ట్ హాఫ్ అక్కడక్కడా మంచి నవ్వులు పూయించే సన్నివేశాలున్నాయి. మోనోఫోబియా అనే పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ.. కథనాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. కథా బలంతో చివరి వరకూ దర్శకుడు సింగిల్ ప్లాట్‌తోనే సినిమాని నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రతి మనిషికి ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాలను మనం అంగీకరిస్తే అందరి జీవితాలు సాఫీగా సాగిపోతాయి.. ఈ కథనే సినిమాలో చెప్పాలనుకున్నాడు దర్శకుడు. హీరోకు ఒంటరితనం అంటే భయం.. ఆ భయమే తన లోపం.. ఆ లోపాలను ఎలా అధిగమించాడు అనేది దర్శకుడు చూపించాడు. గతంలో కూడా మారుతి తెరకెక్కించిన మహానుభావుడు, భలే భలే మగాడివోయ్ లాంటి చిత్రాలు ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్‌తోనే వచ్చి ఆకట్టుకున్నాయి. అయితే ఆ స్థాయి ఈ సినిమాలో లోపించింది. కానీ కాన్సెప్ట్ పరంగా వాటికేం తీసిపోదు. సినిమా మెయిన్ పాయింట్ బాగుంది. కొత్తగా ట్రై చేసాడనే పేరు అయితే వస్తుంది.

నటీనటులు:
ఆది సాయికుమార్ మంచి నటుడే.. కానీ ఆయనకు సరైన పాత్రలు పడలేదు. ఈ సినిమాలో మంచి పాత్ర వచ్చింది. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. అలాగే అతి భయంతో వణికిపోయే సందర్భాల్లో మంచి నటన కనబర్చాడు ఆది. హీరోయిన్ నువేక్ష‌ చక్కగా ఉంది.. బాగా నటించింది. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. తల్లిగా నటించిన రోహిణి నటన, స‌ప్త‌గిరి నటన పర్వాలేదు. మిగిలిన నటీనటులు కూడా తమకిచ్చిన పాత్రల్లో బాగా నటించారు.

టెక్నికల్ టీమ్:
సంగీత దర్శకుడు శేఖ‌ర్ చంద్ర‌ అందించిన సంగీతం బాగుంది. పాటలు పర్లేదు. సినిమాటోగ్రఫర్ అమ‌ర్‌నాథ్ బొమ్మిరెడ్డి వర్క్ సినిమాకి ప్లస్ అయింది. సన్నివేశాలన్నీ సహజంగా అనిపించాయి. ఎడిటింగ్ పర్లేదు. నిర్మాతలు రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. పొలిమేర నాగేశ్వ‌ర్‌ దర్శకుడిగా పర్లేదు అనిపించాడు. యూనిక్ కాన్సెప్ట్ తీసుకున్నపుడు వర్క్ ఇంకాస్త చేయాల్సింది. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ఉండుంటే ఇంకా బాగుండేది.

చివరగా ఒక్కమాట:
అతిథి దేవోభవ.. అందమైన కాన్సెప్ట్.. ఆకట్టుకోని స్క్రీన్ ప్లే..
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Adhi sai kumar, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు