హోమ్ /వార్తలు /సినిమా /

Top Gear: ఆది సాయి కుమార్ టాప్ గేర్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్.. 3D మోషన్ పోస్టర్ రిలీజ్

Top Gear: ఆది సాయి కుమార్ టాప్ గేర్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్.. 3D మోషన్ పోస్టర్ రిలీజ్

Top gear Photo Twitter

Top gear Photo Twitter

వేలాది మంది స్టూడెంట్స్ నడుమ టాప్ గేర్ టైటిల్ లోగో లాంచ్ చేసి యూత్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన చిత్ర యూనిట్.. తాజాగా చిత్ర ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఆది సాయి కుమార్ లుక్ చూస్తుంటే సినిమాలో ఏదో తెలియని పాయింట్ టచ్ చేశారని తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ప్రేమ కావాలి సినిమాతో వెండితెరకు పరిచయమైన సాయి కుమార్ (Sai kumar) కుమారుడు ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. దీంతో టాలీవుడ్ నిర్మాతలు ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిన ఆది సాయి కుమార్ తాజాగా మరో సినిమాను లైన్‌లో పెట్టేశారు. ఈ సినిమా పేరే టాప్ గేర్ (Top Gear). ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్ లుక్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ అందుకుంది.

వేలాది మంది స్టూడెంట్స్ నడుమ టాప్ గేర్ టైటిల్ లోగో లాంచ్ చేసి యూత్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన చిత్ర యూనిట్.. తాజాగా చిత్ర ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఆది సాయి కుమార్ లుక్ చూస్తుంటే సినిమాలో ఏదో తెలియని పాయింట్ టచ్ చేశారని తెలుస్తోంది. ఇకపోతే కాస్త వినూత్నంగా ఆలోచించి తొలిసారి 3D మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ హైలైట్ అయ్యాయి. టాప్ గేర్ అనే టైటిల్ కి తగ్గట్లుగా హీరో ఆది సాయి కుమార్ తో ఈ పోస్టర్ డిజైన్ చేసిన విధానం ఈ వీడియోలో ప్రధానమైన ఆకర్షణగా నిలిచింది.

ఇప్పటిదాకా విడుదల చేసిన అప్ డేట్స్ చూస్తుంటే ఈ సినిమాలో అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ పాయింట్ చూపించబోతున్నారని స్పష్టమవుతోంది. ఈ సినిమా తన కెరీర్ లో ఎంతో ప్రత్యేకం కానుందని హీరో ఆది సాయి కుమార్ చెప్పడం సినిమాపై అంచనాలు పెంచేసింది.

ఆదిత్య మూవీస్ &ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అన్ని హంగులతో ఈ టాప్ గేర్ సినిమా రాబోతోంది. ఈ సినిమాలో రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకొని ఓ వైవిద్యభరితమైన కథతో రూపొందించనున్నారు. చిత్రానికి K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.

పలు సూపర్ హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా సేవలందించిన సాయి శ్రీరామ్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ''జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, మనం, సోగ్గాడే చిన్నినాయనా'' లాంటి సూపర్ హిట్ సినిమాలకు ఎడిటర్‌గా పని చేసిన ప్రవీణ్ పూడి ఈ మూవీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర, రేడియో మిర్చి హేమంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్.

Published by:Sunil Boddula
First published:

Tags: Aadi Sai Kumar, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు