హోమ్ /వార్తలు /సినిమా /

Aadi Sai Kumar: ఆది సాయికుమార్ తీస్ మార్ ఖాన్.. రిలీజ్ డేట్ ఫిక్స్

Aadi Sai Kumar: ఆది సాయికుమార్ తీస్ మార్ ఖాన్.. రిలీజ్ డేట్ ఫిక్స్

Photo Twitter

Photo Twitter

Tees Maar Khan Release date: యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలల్లో నటిస్తూ మాస్ ఆడియెన్స్‌కు కూడా చేరువయ్యాడు యంగ్ హీరో ఆది సాయికుమార్ (Aadi Sai kumar). ఆయన తాజా చిత్రం 'తీస్ మార్ ఖాన్' (Tees maar Khan). ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ తీస్ మార్ ఖాన్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 19న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నామని ప్రకటించారు దర్శకనిర్మాతలు.

ఇంకా చదవండి ...

యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలల్లో నటిస్తూ మాస్ ఆడియెన్స్‌కు కూడా చేరువయ్యాడు యంగ్ హీరో ఆది సాయికుమార్ (Aadi Sai kumar). ఆయన తాజా చిత్రం 'తీస్ మార్ ఖాన్' (Tees maar Khan). ప్రొడక్షన్ నెంబర్ 3 గా విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి  ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నాటకం వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. చిత్రంలో ఆది సాయికుమార్ సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సునీల్, పూర్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ తీస్ మార్ ఖాన్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 19న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నామని ప్రకటించారు దర్శకనిర్మాతలు. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై ఆసక్తి పెంచేశాయి. అదేవిధంగా ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ టీజర్ లోని ప్రతి సన్నివేశం కూడా మూవీ ఎప్పుడెప్పుడు చూడాలా అనే ఆతృతను పెంచేసింది.

హీరో ఎలివేషన్ సీన్స్, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌తో రొమాంటిక్ సన్నివేశాలు, కామెడీ టచ్, యాక్షన్ సీన్స్ అన్నీ హైలైట్ కావడంతో ఈ టీజర్ కి రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. మనం ఆపాలనుకున్నంత పవర్ మనదగ్గరున్నా.. మనం ఆపలేనంత పవర్ వాడిదగ్గరుంది అనే డైలాగ్ ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్‌గా ఉండనుందో స్పష్టం చేసింది. తీస్ మార్ ఖాన్ అంటూ ఈ వీడియోలో హీరో విభిన్న షేడ్స్ చూపించడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది.

ఆది సాయి కుమార్ పవర్ ఫుల్ పాత్రలో నటించిన ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఎక్కడా ఖర్చుకు వెనక్కు తగ్గకుండా భారీ బడ్జెట్ లేటాయించి ఈ సినిమాను రూపొందించారు నిర్మాతలు. స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటించడం ఈ సినిమాకు మేజర్ అసెట్. మణికాంత్ ఎడిటర్ గా వర్క్ చేసి స్మార్ట్ అవుట్ పుట్ తీసుకొచ్చారు. ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ అందించగా.. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేశారు.

First published:

Tags: Aadi Sai Kumar, Payal Rajput, Tollywood

ఉత్తమ కథలు