హోమ్ /వార్తలు /సినిమా /

Aadi Sai Kumar: టాక్సీ డ్రైవర్‌గా ఆది సాయికుమార్.. యంగ్ హీరో టాప్ గేర్

Aadi Sai Kumar: టాక్సీ డ్రైవర్‌గా ఆది సాయికుమార్.. యంగ్ హీరో టాప్ గేర్

Aadi Sai Kumar Top Gear Photo Twitter

Aadi Sai Kumar Top Gear Photo Twitter

Top Gear: ప్రేమ కావాలి సినిమాతో వెండితెరకు పరిచయమైన సాయి కుమార్ (Sai kumar) కుమారుడు ఆది సాయి కుమార్ ప్రస్తుతం వివిధ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ఆది సాయి కుమార్.. మరికొద్ది రోజుల్లో టాప్ గేర్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

వరుస సినిమాలతో ప్రామిసింగ్ హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు యంగ్ హీరో ఆది సాయికుమార్ (Aadi Sai Kumar). ప్రేమ కావాలి (Prema Kavali) సినిమాతో వెండితెరకు పరిచయమై పలు వైవిధ్యభరితమైన సినిమాల్లో భాగమవుతూ తనదైన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ప్రస్తుతం వివిధ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ఆది సాయి కుమార్.. మరికొద్ది రోజుల్లో టాప్ గేర్ (Top Gear) అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఆదిత్య మూవీస్ &ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అన్ని హంగులతో ఈ టాప్ గేర్ సినిమా రాబోతోంది. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఆది సాయికుమార్ టాక్సీ డ్రైవర్‌గా నటిస్తుండటం విశేషం. ఆయన పోషించిన ఈ రోల్ సినిమాలో కీలకం కానుందని, ప్రేక్షకులకు ఓ డిఫరెంట్ అనుభూతినిస్తుందని అంటున్నారు మేకర్స్. ఈ సినిమాతో ఆది సాయి కుమార్ కెరీర్‌కి టాప్ గేర్ పడినట్లే అని చెబుతున్నారు.

ఇప్పటికే ఈ టాప్ గేర్ సినిమా నుంచి విడుదలైన టైటిల్ లుక్, ఫస్ట్ లుక్, 3D మోషన్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ అప్ డేట్స్ చూసి టాప్ గేర్‌కి యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. మోషన్ పోస్టర్ లో ఆది సాయి కుమార్ కారు నడుపుతున్నట్లు చూపించి.. యాక్షన్ మోడ్ తో ఆకట్టుకున్నారు. ఈ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ హైలైట్ అయ్యాయి. చిత్ర ప్రమోషన్స్‌లో వినూత్నంగా ఆలోచించి తొలిసారి 3D వర్షన్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది టాప్ గేర్ యూనిట్.

ఈ సినిమా తన కెరీర్ లో ఎంతో ప్రత్యేకం కానుందని హీరో ఆది సాయి కుమార్ చెప్పడం సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమాలో రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తోంది. K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకొని ఓ వైవిద్యభరితమైన కథతో రూపొందించనున్నారు. పలు సూపర్ హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా సేవలందించిన సాయి శ్రీరామ్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరిదశలో ఉన్నాయి. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

''జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, మనం, సోగ్గాడే చిన్నినాయనా'' లాంటి సూపర్ హిట్ సినిమాలకు ఎడిటర్‌గా పని చేసిన ప్రవీణ్ పూడి ఈ మూవీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర, రేడియో మిర్చి హేమంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

Published by:Sunil Boddula
First published:

Tags: Aadi Sai Kumar, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు