యూత్ మెచ్చే సినిమాల్లో నటించి మాస్ ఆడియెన్స్ కు కూడా చేరువైన ఆది సాయి కుమార్ (Aadi sai kumar) ఇప్పుడు 'తీస్ మార్ ఖాన్' (Tees maar Khan) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాటకం వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రొడక్షన్ నెంబర్ 3 గా విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) హీరోయిన్గా నటిస్తుండగా.. సునీల్ (Sunil), పూర్ణ (Poorna) కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా కొద్దిసేపటి క్రితం ఈ సినిమా టీజర్ (Tees maar Khan Teaser) విడుదల చేశారు.
ఒక నిమిషం 34 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ లోని సన్నివేశాలు సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాయి. తీస్ మార్ ఖాన్ అంటూ ఈ వీడియోలో హీరో విభిన్న షేడ్స్ చూపిస్తూ సినిమాపై హైప్ పెంచేశారు. మనం ఆపాలనుకున్నంత పవర్ మనదగ్గరున్నా.. మనం ఆపలేనంత పవర్ వాడిదగ్గరుంది అనే డైలాగ్ ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్‌గా ఉండనుందో స్పష్టం చేస్తోంది. హీరో ఎలివేషన్ సీన్స్, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌తో రొమాంటిక్ సన్నివేశాలు యూత్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. కామెడీ టచ్ ఇస్తూ యాక్షన్ సీన్స్ చూపించిన విధానం సినిమాలో హైలైట్ అవుతుందని ఈ టీజర్ స్పష్టం చేస్తోంది.
ఇప్పటికే తీస్ మార్ ఖాన్ మూవీకి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. తాజాగా విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది. ఈ తీస్ మార్ ఖాన్ చిత్రంలో ఆది మరో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా హై ఓల్టేజ్ యాక్షన్ ఓల్టేజ్ ఎంటర్టైనర్ గా భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందింది.
ఈ సినిమాలో స్టూడెంట్‌గా, రౌడీగా, పోలీస్‌గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్ర లో ఆది నటిస్తుండటం విశేషం. పలు హిట్ చిత్రాలకు సంగీతం అందించిన సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అతిత్వరలో ఈ మూవీ విడుదల తేదీ ప్రకటించనున్నారు మేకర్స్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aadi Sai Kumar, Payal Rajput, Tollywood