హోమ్ /వార్తలు /సినిమా /

Aadi Sai Kumar: ఆది సాయికుమార్ "సీఎస్ఐ సనాతన్" గ్లింప్స్ రిలీజ్

Aadi Sai Kumar: ఆది సాయికుమార్ "సీఎస్ఐ సనాతన్" గ్లింప్స్ రిలీజ్

Csi Sanatan Photo Twitter

Csi Sanatan Photo Twitter

Aadi Sai Kumar csi sanatam: ఎప్పటికప్పుడు సరికొత్తగా ట్రాన్స్‌ఫామ్ అవుతూ విలక్షణ కథలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు ఆది సాయికుమార్. తాజాగా ఆయన లేటెస్ట్ మూవీ "సీఎస్ఐ సనాతన్" నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కెరీర్ ఆరంభం నుంచే సెలెక్టెడ్ కథలతో ఆకట్టుకుంటున్నారు యంగ్ హీరో ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar). ఎప్పటికప్పుడు సరికొత్తగా ట్రాన్స్‌ఫామ్ అవుతూ విలక్షణ కథలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు. డిఫరెంట్ యాంగిల్స్ ఉన్న రోల్స్ చేస్తూ ఆడియన్స్ మెప్పు మెప్పు పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు "సీఎస్ఐ సనాతన్" (csi sanatan) అనే మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చాగంటి ప్రొడ‌క్ష‌న్ లో ఆది సాయికుమార్ హీరోగా భారీ హంగులతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

ఈ సినిమాలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియ‌స్ఐ) ఆఫీస‌ర్ గా ఆది సాయికుమార్ ఒక కొత్త రోల్ లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో గ్రిప్పింగ్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న "సీఎస్ఐ సనాతన్" సినిమా గ్లింప్స్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ ఆసక్తికరంగా ఉంది. హత్య కేసును చేధించేందుకు రంగంలోకి దిగిన క్రైం సీన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఆది సాయి కుమార్ ఇంటెన్స్ మూడ్ లో కనిపించారు.

క్రైమ్ సీన్ లో దొరికిన ప్రతి చిన్న అంశాన్నీ రిపోర్టులో చేరుస్తూ నివేదిక తయారు చేస్తున్నారు. ఎలాంటి నేరాన్నయినా చేధించే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఆది సాయికుమార్ పాత్ర రూపొందింది. ఈ క్లూస్ తో నేరస్థులను హీరో ఎలా పట్టుకోబోతున్నాడు అనేది ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది. ఇప్పటిదాకా రాని సరికొత్త ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. హత్య కేసు విచారణ సాగే క్రమం అంతా ఆద్యంతం ఆసక్తిని పంచనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా నవంబర్ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

చిత్రంలో ఆది సాయికుమార్, మిషా నారంగ్, అలీ రెజా, నందిని రాయ్, తాక‌ర్ పొన్న‌ప్ప ,మ‌ధు సూద‌న్, వసంతి తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. చిత్రానికి అనీష్ సోలోమాన్ సంగీతం అందించారు. అజ‌య్ శ్రీనివాస్ నిర్మాతగా వ్యవహరించగా.. శివ‌శంక‌ర్ దేవ్ దర్శకత్వం వహించారు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

Published by:Sunil Boddula
First published:

Tags: Aadi Sai Kumar, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు