Jodi trailer talk : ఆది హీరోగా, జెర్సీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా వస్తున్న సినిమా.. జోడి. ఈ సినిమాను విశ్వనాథ్ అరిగెల దర్శకత్వం వహించగా.. భావన క్రియేషన్స్ బ్యానర్‌పై గుర్రం శ్రీనివాస్, పద్మజ, సాయి వెంకటేష్‌లు నిర్మిస్తున్నారు.. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం గురువారం విడుదలచేసింది. ట్రైలర్ చూస్తుంటే.. కుటుంబ విలువలతో కూడిన లవ్ స్టోరిగా ఉండబోతోందని తెలుస్తోంది. ట్రైలర్లో డైలాగ్స్ ఆసక్తికరంగా ఉండి.. ఆకట్టుకుంటున్నాయి. క్రికెట్ బెట్టింగ్ చేస్తూ.. తండ్రి పాత్రలో సీనియర్ నరేష్ కనిపించనున్నారు.
ఆది, శ్రద్ధా శ్రీనాథ్‌లతో పాటు.. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సీనియర్ నటులు గొల్లపూడి మారుతీరావు, మిర్చి మాధవి, విద్యుల్లేఖ తదితరులు నటిస్తున్నారు. ఫణి కల్యాణ్ సంగీతమందించిన ఈ సినిమా సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.