శర్వానంద్ (Sharwanand) హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. మంచి అంచనాలతోనే వచ్చిన ఈ చిత్రానికి ఊహించిన కలెక్షన్స్ మాత్రం రావడం లేదు. మార్చ్ 4న విడుదలైన ఈ సినిమా చాలా స్లోగా ఉందనే టాక్ వినిపిస్తుంది. అదే సినిమాకు శాపం అయింది కూడా. సీరియల్ మాదిరి సాగే ఎమోషన్స్ మైనస్ అయిందంటున్నారు విశ్లేషకులు. ప్రేక్షకుల ఫీలింగ్ కూడా ఇదే. పైగా ఈ మధ్య శర్వానంద్ అదృష్టం అంతంతమాత్రంగానే ఉంది. వరస సినిమాలు చేస్తున్నాడు కానీ విజయాలు మాత్రం రావడం లేదు. మరీ ముఖ్యంగా భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు కూడా దారుణంగా నిరాశ పరుస్తున్నాయి. ఇలాంటి సమయంలో విడుదలైన సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavallu Meeku Johaarlu). నేను శైలజ (Nenu Sailaja), చిత్రలహరి (Chitralahari), రెడ్ (RED) లాంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు కిషోర్. మధ్యలో రామ్‌తో (Ram Pothineni) చేసిన ఉన్నది ఒకటే జిందగీ సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకుంది. కానీ హిట్ అవ్వలేదు. ఇప్పుడు ఆడవాళ్లు మీకు జోహార్లు అంటూ ఎమోషనల్ డ్రామాతో వచ్చాడు ఈయన. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వచ్చాయి. అవి ఎలా ఉన్నాయో చూద్దాం..
నైజాం: 1.91 కోట్లు
సీడెడ్: 0.56 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.58 కోట్లు
ఈస్ట్: 0.33 కోట్లు
వెస్ట్: 0.26 కోట్లు
గుంటూరు: 0.33 కోట్లు
కృష్ణా: 0.33 కోట్లు
నెల్లూరు: 0.20 కోట్లు
ఏపీ, తెలంగాణ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్: 4.50 కోట్లు
రెస్టాఫ్ ఇండియా + కర్ణాటక: 0.30 కోట్లు
ఓవర్సీస్: 0.80 కోట్లు
వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 5.67 కోట్లు
శర్వానంద్ గత సినిమా మహా సముద్రం, శ్రీకారం సినిమాలకు తొలి వీకెండ్ కనీసం 7 కోట్లకు పైగా షేర్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆడవాళ్లు మీకు జోహార్లు మాత్రం కేవలం 5.67 కోట్లతోనే సరిపెట్టుకుంది. కనీసం 6 కోట్ల షేర్ కూడా రాబట్టలేదు. మూడో రోజు పరిస్థితి కాస్త మేలు. సండే కావడంతో బాగానే వచ్చాయి కలెక్షన్స్. కానీ ఆ తర్వాత మళ్లీ నిలబడటం కష్టంగానే అనిపిస్తుంది. ఈ చిత్రం మరో 10 కోట్లకు పైగా వసూలు చేస్తే కానీ సేఫ్ అవ్వదు. రష్మిక మందన్న అందాలు.. శర్వానంద్ నటన కూడా ఈ సినిమాను కాపాడేలా కనిపించడం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.