హోమ్ /వార్తలు /సినిమా /

Viral Video : అలియా భట్ లెహంగా అడ్డువస్తోందని కాలితో తన్నిన రణ్ బీర్.. అంత పొగరెందుకు..!

Viral Video : అలియా భట్ లెహంగా అడ్డువస్తోందని కాలితో తన్నిన రణ్ బీర్.. అంత పొగరెందుకు..!

Photo Credit : You Tube

Photo Credit : You Tube

Viral Video : లేటెస్ట్ గా బాలీవుడ్ సెల‌బ్రిటీలు అలియా భ‌ట్ (Alia Bhatt), ర‌ణ్‌బీర్ కపూర్‌ (Ranbir Kapoor) కు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

సినీ ప్రపంచంలో సెలబ్రిటీలు ఏం చేసినా సోషల్ మీడియాలో అది వార్తయిపోతుంటుంది. నిజంగా వైరల్ కావాలనే ఇలా చేస్తారో.. లేక నెటిజన్లే వైరల్ చేస్తారో కానీ.. వీళ్ళకి కావాల్సిన ప్రచారం మాత్రం అయిపోతుంది. సహజంగా నటీమణుల హాట్ ఫోటోలు, వీడియోలకు వ్యూస్ రావడం.. వైరల్ కావడం చూస్తుంటాం. కానీ, లేటెస్ట్ గా రణ్ బీర్ కపూర్ చేసిన చిలిపి పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకెళితే.. లేటెస్ట్ గా బాలీవుడ్ సెల‌బ్రిటీలు అలియా భ‌ట్ (Alia Bhatt), ర‌ణ్‌బీర్ కపూర్‌ (Ranbir Kapoor) కు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వాళ్లిద్ద‌రూ గ‌త కొన్ని రోజుల నుంచి రిలేష‌న్‌షిప్‌లో ఉన్నారంటూ వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో తాజాగా ఇద్ద‌రూ కలిసి ఓ ఈవెంట్‌కు వెళ్లిన స‌మ‌యంలో జ‌రిగిన ఇన్సిడెంట్ గురించి ప్ర‌స్తుతం నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు.

ఓ ఈవెంట్‌కు అలియా.. స‌బ్య‌సాచి లెహంగాను ధ‌రించింది. ఆ లెహంగా చాలా పొడ‌వు ఉంది. త‌న వెనుకే ఉన్న ర‌ణ్‌బీర్‌.. ముందు న‌డుస్తున్న అలియా లెహంగా కింద నేల‌ను తాకుతూ వెళ్తుండ‌టంతో త‌న కాళ్ల‌తోనే ఆ లెహంగాను ముందుకు జ‌రిపాడు. అది కెమెరాకు చిక్కింది. ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో నెటిజ‌న్లు వెంట‌నే స్పందించారు.

అది ర‌ణ్‌బీర్ క్యారెక్ట‌ర్. అంత‌కు మించి ర‌ణ్‌బీర్ ఇంకేం చేస్తాడు. లెహంగా పొడ‌వుగా ఉన్న‌ప్పుడు క‌ట్ చేసుకోవ‌చ్చు క‌దా.. దాన్ని కాలితో త‌న్న‌కుండా వేరే విధంగా కూడా దాన్ని కిందికి జ‌ర‌పొచ్చు క‌దా అంటూ నెటిజ‌న్లు త‌మ‌కు న‌చ్చిన‌ట్టుగా కామెంట్లు చేస్తున్నారు. అంత పొగరెందుకు అంటూ మరి కొందరు ట్రోలింగ్ చేస్తున్నారు.

ఇక, ఈ ప్రేమ జంట గత మూడేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ ప్రేమజంట ఎప్పుడెప్పుడు ఒకటి అవుతుందా అని బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వీరి ప్రేమ విషయం ఇరువురి కుటుంబ సభ్యులకు కూడా తెలిసిపోవడంతో ప్రేమ పక్షుల్లా విహరిస్తున్నారు.ఇద్దరూ వారివారి కెరీర్లో సినిమాలతో బిజీగా ఉంటూనే సమయం దొరికినప్పుడల్లా ఒకరిపై మరొకరు ప్రేమని పంచుకుంటున్నారు.

' isDesktop="true" id="1106546" youtubeid="aLdp20bA7wQ" category="movies">

అయితే వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది వీరి పెళ్లి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంవత్సరం డిసెంబర్ లో వీరి పెళ్లి జరగాల్సి ఉండగా... మరొకసారి తాజాగా వీరి పెళ్లి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ ప్రేమ జంట గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పలు సినిమాలు ఇంకా పూర్తి కాక పోవడం, పలు ఇతర కారణాల వల్ల తమ పెళ్ళిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి :  ‘83’ ట్రైలర్ విడుదల.. గెలవడానికే మేం ఇక్కడికి వచ్చాం.. గెలిచి చూపిస్తాం..

మొదట ఈ ప్రేమ జంట కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసి డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారట.పెళ్లి అనంతరం ఒక ఖరీదైన ఫ్లాట్ లోకి కూడా మారాలనుకుంటున్నారట.దీనికి సంబంధించి కూడా కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయట. దీనితో అన్ని పనులు అనుకున్నట్లు పూర్తి అయ్యాక వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో లేదా 2022 డిసెంబర్ లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట.

First published:

Tags: Alia Bhatt, Bollywood news, Ranbir Kapoor, Viral Video

ఉత్తమ కథలు