టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad )ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దేవీ శ్రీ ప్రసాద్ బాబాయి బుల్గానిన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇక ఈ వార్త విని తట్టుకోలేక దేవి శ్రీ ప్రసాద్ మేనత్త సీతామహాలక్ష్మీ గుండెపోటుతో మృతి చెందారు. దీంతో శోకసముద్రంలో మునిగిపోయారు కుటుంబ సభ్యులు. ఇక అది అలా ఉంటే సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం తెలుగులో పలు చిత్రాలకు సంగీతం సమకూరుస్తున్నారు. అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాకు కూడా దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమా నుండి దాక్కో దాక్కో మేక పాట విడుదలవగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ కాంబినేషన్‌లో గతంలో ఆర్య, ఆర్య 2 సినిమాలు రాగా ప్రస్తుతం పుష్ప సినిమా (Pushpa Movie) వస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావోచ్చింది. ఈ సినిమాకు చెందిన మొదటి భాగం షూటింగ్ ప్రస్తుతం ఏపీలోని మారేడు మిల్లి అడువుల్లో జరుగుతోంది. అక్కడే పదిహేను రోజుల పాటు షూటింగ్ జరుపనుంది పుష్ప టీమ్.
ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఫహద్ పాసిల్ (Fahadh Faasil ) ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందింది. అల్లు అర్జున్‌కు జోడిగా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తోంది. ఈ చిత్రంలో శాండల్‌వుడ్ యువ నటుడు ధనంజయ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల దాక్కో దాక్కో మేక (Pushpa Daakko Daakko Meka song) అనే ఊర మాస్ సాంగ్ విడుదలై సంచలనం సృష్టించింది.
ఈ పాట తెలుగుతో పాటు హిందీ తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే తెలుగు వెర్షన్ కి మాత్రం అన్నిటికంటే అధిక రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు 24 గంటల్లో రియల్ టైమ్‌లో 9.4 మిలియన్ వ్యూస్‌తో 6 లక్షల 57 వేల ఆల్ టైమ్ లైక్స్‌లో సౌత్ ఇండియాలో మొదటి లిరికల్ సాంగ్‌గా రికార్డ్ సృష్టించింది.
ఈ పాటను చంద్రబోస్ రాయగా.. శివమ్ పాడారు.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఇక పుష్ప కథ విషయానికి వస్తే.. ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఓ యాక్షన్ ఫిల్మ్.
దీంతో ఈ చిత్రం షూటింగు ఎక్కువ భాగాన్ని అటవీ నేపథ్యంలో జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటికే కొంత భాగాన్ని కేరళలో చిత్రీకరించిన చిత్రబృందం.. ప్రస్తుతం మారేడు మిల్లి అడువుల్లో చిత్రీకరణ జరుగుతోంది.
ఇక పుష్ప సినిమా కథ విషయానికి వస్తే.. సుకుమార్ సక్సెస్ మంత్ర అయిన రివెంజ్ ఫార్ములాతోనే వస్తోందని టాక్. సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ రామ్ చరణ్ రంగస్థలం ఇదే ఫార్ములాతో వచ్చినవే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పుష్ప తెలుగు, హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లో ఈ సినిమా వచ్చే క్రిస్మస్‌కు ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Devi Sri Prasad, Tollywood news