ఆ దేశ పౌరసత్వం ఇచ్చినా తీసుకోని ఏ.ఆర్.రహామాన్.. ఎందుకంటే..

గత కొన్నేళ్లుగా మన దేశపౌరులు ముఖ్యంగా హీరోలు విదేశీ పౌరసత్వాల కోసం ఎగబడుతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే అక్షయ్ కుమార్ కెనడా పౌరసత్వం పై పెద్ద వివాదామే నడుస్తోంది. కూడా రెండేళ్ల క్రితం కెనడా పౌరసత్వం ఇస్తామని ముందుకొచ్చిన ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. 

news18-telugu
Updated: May 6, 2019, 7:43 PM IST
ఆ దేశ పౌరసత్వం ఇచ్చినా తీసుకోని ఏ.ఆర్.రహామాన్.. ఎందుకంటే..
ఏఆర్ రెహ్‌మాన్ (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: May 6, 2019, 7:43 PM IST
గత కొన్నేళ్లుగా మన దేశపౌరులు ముఖ్యంగా హీరోలు విదేశీ పౌరసత్వాల కోసం ఎగబడుతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే అక్షయ్ కుమార్ కెనడా పౌరసత్వం పై పెద్ద వివాదామే నడుస్తోంది. కెనడా పౌరసత్వం ఉండటంతో ఈ ఎన్నికల్లో అక్షయ్ ఓటు వేయకపోవడంపై పెద్ద దుమారమే రేగింది. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు విజేత ఏ.ఆర్.రహమాన్‌కు కూడా రెండేళ్ల క్రితం కెనడా పౌరసత్వం ఇస్తామని ముందుకొచ్చిన ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం.   రహమాన్ మాత్రం ఎలాంటి మొహమాటం లేకుండా కెనడా పౌరసత్వం  వద్దని చెబుతూ వారికి కృతజ్ఞతలు తెలియజేసారు. వివరాల్లోకి వెళితే...కెనడా ప్రభుత్వం వివిధ రంగాల్లోని ప్రముఖులకు వాళ్ల దేశ పౌరసత్వం ఇవ్వడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో కెనడా మేయర్ రహామాన్..ఏఆర్ రహామాన్‌కు చట్ట బద్దంగా వాళ్ల దేశ పౌరసత్వాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చారు. కానీ రహమాన్ మాత్రం ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్టు.. ఈ సందర్భంగా ఏ.ఆర్.రహాామాన్ గుర్తు చేసుకున్నారు. అంతేకాదు కెనడా వాళ్లు నాకు  వాళ్ల పౌరసత్వం ఇవ్వడానికి ముందుకు రావడం పట్ల సంతోషంగా ఫీలయ్యానన్నారు.

A.R.Rahman Rejected canadian citizenship..here are the details,ar rahman,ar rahman twitter,ar rahman rejected canadian citizenship,ar rahman canada,a r rahman,canada,a.r.rahman,ar rahman canada,a. r. rahman (record producer),rahman,a.r. rahman,a.r rahman,a. r. rahman (composer),arrahman,a r rahman qawwali,a r rahman song,a r rahman live concert,live in canada,a r rahman live,hindi,canada (country),a.r.rahman road in canada,markham,ar rahman canada post,tamil,a.r.rahman road,a.r.rahman friends in canada,ar rahman street canada,akshay kumar,akshay kumar pm narendra modi,akshay kumar canadian citizenship,ఏ.ఆర్.రహమాన్,ఏ.ఆర్ రహమాన్ కెనడా పౌరసత్వం,ఏఆర్ రహమాన్ భారతీయడు,కెనడా పౌరసత్వాన్ని వద్దన్న ఏ.ఆర్.రహామాన్, అక్షయ్ కుమార్,
ఆస్కార్ అవార్డులతో ఏ.ఆర్.రహమాన్ (ఫైల్ ఫోటో)


నేను తమిళనాడులో చాలా సంతోషంగా ఉన్నాను. భారతదేశమే నా కుటుంబం. ఇక్కడ నాకు స్నేహితులు, సమస్త బంధువులున్నారని గుర్తు చేసారు. మరోవైపు కెనడా మేయర్.. భారతదేశానికి విచ్చేస్తే..భారత్, కెనడా తరుపున సంగీత విభావరి నిర్వహించడానికి ఆసక్తిగా ఉన్నానని పేర్కొన్నాడు. కెనడా పౌరసత్వం తిరస్కరించడం పై రహామాన్‌పై ప్రశంసలు వర్షం కురస్తోంది. రహామాన్ కెనడా పౌరసత్వం వద్దని చెప్పినా.. అక్కడ ఒండోరియాలో ఏఆర్ రహామాన్ పేరిట ఒక వీధి ఉండటం విశేషం.

First published: May 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...